Home /News /business /

KNOW THE OFFERS ON HONDA CARS WILL BE BENEFIT OF RS 53000 ON THESE MODELS AK GH

Honda Cars: పండగ ఆఫర్లు ప్రకటించిన హోండా మోటార్స్.. ఈ మోడళ్లపై రూ. 53 వేల వరకు ప్రయోజనాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జపనీస్​ వాహన తయారీ సంస్థ హోండా కార్స్​ ఇండియా పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన కార్లపై క్యాష్​ డిస్కౌంట్లు, యాక్సెసరీస్, లాయల్టీ బోనస్, స్పెషల్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ అందిస్తామని పేర్కొంది.

దసరా, దీపావళి పండుగ సీజన్ ప్రారంభమవ్వడంతో తమ సేల్స్​ పెంచుకునేందుకు అన్ని ఆటోమేకర్స్​ వరుస ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా జపనీస్​ వాహన తయారీ సంస్థ హోండా కార్స్​ ఇండియా పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన కార్లపై క్యాష్​ డిస్కౌంట్లు, యాక్సెసరీస్, లాయల్టీ బోనస్, స్పెషల్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ అందిస్తామని పేర్కొంది. హోండా 5 వ జనరేషన్ సిటీ మోడల్​పై రూ. 53,500, 4 వ జనరేషన్ సిటీ మోడల్​పై రూ. 22,000 వరకు, అమేజ్‌ మోడల్​పై రూ .18,000 వరకు, WR-V మోడల్​పై రూ. 40,100, హోండా జాజ్‌ మోడల్​పై రూ .45,900 వరకు ప్రయోజనాలను అందిస్తామని స్పష్టం చేసింది. ఈ ఆఫర్లన్నీ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. 2021 అక్టోబర్ 31 వరకు కంపెనీకి చెందిన అన్ని అధీకృత డీలర్‌షిప్‌ సెంటర్లలో ఈ ప్రయోజనాలను పొందవచ్చని స్పష్టం చేసింది.

వీటికి అదనంగా, రాబోయే 'నవరాత్రి' పర్వదినాల్లో మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తామని సంస్థ పేర్కొంది. ఈ బంపరాఫర్లపై హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్​ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) రాజేష్ గోయల్ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో పండుగలకు, సాంప్రదాయాకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ సీజన్​లో కొత్త వాహనాలు కొనడాన్ని చాలా మంది సెంటిమెంట్​గా భావిస్తారు. అందుకే ఈ ఒక్క నెలలోనే అత్యధిక సేల్స్​ నమోదవుతాయి. కస్టమర్లకు పండుగ సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు మా వంతుగా డిస్కౌంట్లు​, క్యాష్​ బెనిఫిట్స్​, ఎక్స్​చేంజ్​ బెనిఫిట్స్​ ప్రకటిస్తున్నాం. ఈ బిగ్​ ఆఫర్లతో కస్టమర్ల సంతోషంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉంది.”అని ఆయన పేర్కొన్నారు.

Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్.. అసలు కారణం ఇదే.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే..

KT RamaRao: ఆ ఎమ్మెల్యేను చూసి నేర్చుకోండి.. టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ క్లాస్


పండుగ సీజన్​లో సేల్స్​ పెంచుకోవడమే లక్ష్యంగా..
ఇప్పటికే టూవీలర్​ విభాగంలో అగ్రగామిగా ఉన్న హోండా సంస్థ ఫోవీలర్​ మార్కెట్​పై దృష్టి సారించింది. ఈ పండుగ సీజన్​లో తమ వాహనాల అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే హోండా ఉత్పత్తులకు భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్​కు తోడు పండుగ ఆఫర్లు కలిసిరానున్నాయి. కరోనాతో కుదేలైన ఆటో మొబైల్​ పరిశ్రమ ఈ పండుగ సీజన్​లో గాడిన పడుతుందని హోండా సంస్థ అంచనా వేస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Honda

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు