హోమ్ /వార్తలు /బిజినెస్ /

FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ వడ్డీ రేట్ల వివరాలు మీ కోసమే!

FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ వడ్డీ రేట్ల వివరాలు మీ కోసమే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fixed Deposit Rates: రోజుల తేడాతో వడ్డీ రేట్లు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎఫ్‌డీ చేసేటప్పుడు ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాతే ఎఫ్‌డీ చేయాలి.

రిస్క్‌ తక్కువగా ఉండి.. సమయానికి వడ్డీ రావాలి అంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను (ఎఫ్ డీ) మించిన ఆప్షన్‌ లేదని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల వరకు వివిధ బ్యాంకుల్లో ఎఫ్‌డీలు చేయవచ్చు. అయితే ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డీ రేటు ఉంటుంది. దాంతోపాటు సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. కస్టమర్లు వడ్డీరేటు, మెచూరిటీ, అవసరాల ఆధారంగా వీటిని ఎంచుకోవాలి. వివిధ బ్యాంకులు ఎఫ్‌డీల మీద ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ రేట్ల వివరాలు మీకు అందిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన బ్యాంకులో ఎఫ్‌డీ చేసుకోవచ్చు.


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)

ఎస్‌బీఐలో ఎఫ్‌డీ చేస్తే 2.9 శాతం నుండి 5.4 శాతం వడ్డీ ఇస్తున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు 7 రోజుల నుండి 10 ఏళ్ల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయొచ్చు. సీనియర్‌ సిటిజన్లు అయితే 50 బేసిస్‌ పాయింట్లు ఎక్కువ వడ్డీ ఇస్తారు.


టెన్యూర్‌ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు

7 రోజుల నుంచి 45 రోజులు 2.9 3.4

46-179 రోజులు 3.9 4.4

180-210 రోజులు 4.4 4.9

211-365 రోజులు 4.4 4.9

సంవత్సరం నుంచి 2 ఏళ్లు 5 5.5

2-3 సంవత్సరాలు 5.1 5.6

3-5 సంవత్సరాలు 5.3 5.8

5-10 సంవత్సరాలు 5.4 6.2


* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వడ్డీ రేట్లు 2.5 శాతం నుంచి 5.5 శాతంగా ఉన్నాయి. ఇందులో కూడా ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల మెచూరిటీతో డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి.


టెన్యూర్‌ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు

7-14 రోజులు 2.5 3

15-29 రోజులు 2.5 3

30-45 రోజులు 3 3.5

46-60 రోజులు 3 3.5

61-90 రోజులు 3 3.5

91 రోజుల నుంచి ఆరు నెలలు 3.5 4

6-9నెలలు 4.4 4.9

తొమ్మిది నెలల నుంచి 364 రోజులు 4.4 4.9

ఒక సంవత్సరం 4.9 5.4

366 రోజుల నుంచి 2 సంవత్సరాలు 4.9 5.4

2-3 సంవత్సరాలు 5.15 5.65

3-5 సంవత్సరాలు 5.3 5.8

5 ఏళ్ల ఒక రోజు నుంచి 10 ఏళ్లు 5.5 6.25


ఐసీఐసీఐ బ్యాంక్‌

ఐసీఐసీఐ తన వినియోగదారులకు 2020 అక్టోబరు నుంచి ఇవే వడ్డీ రేట్లను అందిస్తోంది. 2.5 శాతం వడ్డీతో ఐసీఐసీఐ ఎఫ్‌డీ మొదలవుతుంది. ఐదేళ్లు ఆపైబడి ఎఫ్‌డీ చేస్తే 5.5 శాతం వడ్డీ అమలులోకి వస్తుంది. ఆ తర్వాత అది 6.4 శాతానికి చేరుకుంటుంది.


టెన్యూర్‌ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు

7-29 రోజులు 2.5 3

30-90 రోజులు 3 3.5

91-184 రోజులు 3.5 4

185-364 రోజులు 4.4 4.9

సంవత్సరం నుంచి 18 నెలలలోపు 4.9 5.4

18 నెలల నుంచి 2 సంవత్సరాలు 5 5.5

2 ఏళ్ల ఒక రోజు నుంచి 3 సంవత్సరాలు 5.15 5.65

3 ఏళ్ల ఒక రోజు నుంచి 5 సంవత్సరాలు 5.35 5.85

5 ఏళ్ల ఒక రోజు నుంచి 10 సంవత్సరాలు 5.5 6.40


కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

కోటక్‌ మహీంద్రా బ్యాంకు గత నెలలో ఎఫ్‌డీ రేట్లను సవరించింది. కనిష్ఠంగా 2.5 శాతం వడ్డీ, గరిష్ఠంగా 5.3 శాతం వడ్డీ అందిస్తోంది ఈ బ్యాంక్‌. మిగిలిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. ఇందులో సీనియర్‌ సిటిజన్లకు అదనంగా ఎక్కువేం ఇవ్వడం లేదు.


టెన్యూర్‌ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు

7-30 రోజులు 2.5 2.5

31-90 రోజులు 2.75 2.75

91-120 రోజులు 3 3

121-179 రోజులు 3.25 3.25

180-364 రోజులు 4.40 4.40

365-389 రోజులు 4.5 4.58

390 రోజుల నుంచి 23 నెలలలోపు 4.8 4.89

23 నెలల నుంచి 3 ఏళ్లలోపు 5 5.09

3-4 ఏళ్లలోపు 5.1 5.20

4-5 ఏళ్లలోపు 5.25 5.35

5-10 ఏళ్లు 5.3 5.41


యాక్సిస్ బ్యాంక్‌

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లలో యాక్సిన్‌ బ్యాంకు ఇటీవల మార్పులు చేసింది. ప్రస్తుతం బ్యాంకు 2.5 శాతం నుండి 5.75 వరకు వడ్డీ ఇస్తోంది. ఇందులో కూడా టెన్యూర్‌ ఏడు రోజుల నుండి 10 ఏళ్ల వరకు ఉంది.


టెన్యూర్‌ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు

7-29 రోజులు 2.5 2.5

30 రోజుల నుంచి 3 నెలలలోపు 3 3

90 రోజుల నుంచి ఆరు నెలలలోపు 3 3.5

ఆరు నెలల నుంచి ఏడాదిలోపు 4.4 4.65

సంవత్సరం నుంచి 370 రోజులలోపు 5.1 5.75

370 రోజుల నుంచి 375 రోజుల్లోపు 5.15 5.8

376 రోజుల నుంచి 15నెలల్లోపు 5.1 5.75

15-18 నెలల్లోపు 5.2 5.85

18-2 ఏళ్లలోపు 5.25 6.05

2-30 నెలల్లోపు 5.4 5.9

5-10 ఏళ్లు 5.75 6.5


ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలనుకునేవారు ఈ వడ్డీరేట్లను పరిశీలించవచ్చు. దాంతోపాటు డబ్బులు చెల్లించేముందు ఆయా వెబ్‌సైట్లలోని ఎఫ్‌డీ రేట్ల జాబితాను క్రాస్‌ చెక్‌ చేసుకోవడం మంచిది. ఎఫ్‌డీ రేట్లలో సాధారణ ఎఫ్‌డీలకు వచ్చే రిటర్న్స్‌, సీనియర్‌ సిటిజన్లకు ఇచ్చే రిటర్న్స్‌ ఒకేలా ఉండవు. ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ ఇస్తోంది. రోజుల తేడాతో వడ్డీ రేట్లు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎఫ్‌డీ చేసేటప్పుడు ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాతే ఎఫ్‌డీ చేయాలి.

First published:

Tags: State bank of india

ఉత్తమ కథలు