ఆర్బీఐ వడ్డీ రెపోరేట్లు తగ్గించడంతో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించేశాయి. దీంతో వేతన జీవులు ఎక్కువగా కొత్త కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకులు అందిస్తున్న రుణాలతో కొత్త కార్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తర్వాత ఈఎమ్ఐల రూపంలో రుణాలను చెల్లించవలసి ఉంటుంది. అయితే కార్ లోన్ తీసుకునేముందు అన్ని బ్యాంకుల్లో ఇస్తున్న రుణాలను పోల్చి చూసుకోవాలి. కార్ లోన్ వడ్డీ రేట్లు సాధారణంగా వార్షికంగా 8.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. కార్ మోడల్, తిరిగి చెల్లించే సామర్థ్యం, పనిచేసే సంస్థ ఆధారంగా రుణాలపై వడ్డీ రేట్లు ఉంటాయి. కారు రుణం తీసుకునే ముందకు ముందుగా మీరు సాలరీ పొందే బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించాలి. ప్రస్తుతం చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను చాలా తగ్గించేశాయి. బ్యాంకులు ప్రిఫరెన్షియల్ కార్ రుణ వడ్డీ రేట్లను తమ వినియోగదారులకు ఇస్తున్నాయి. ఇతర బ్యాంకులు అందించే రుణాలతో మీ బ్యాంకు అందిస్తున్న రుణ వడ్డీరేటును పోల్చి చూసుకోవాలి.
ఇక నెలకు ఎంత EMI చెల్లించవలసి ఉంటుందో చెక్ చేయాలి. మీకు వచ్చే వేతనంలో మీ ఖర్చులన్నీ పోనూ నెలకు EMI చెల్లించగలిగేంత మొత్తాన్ని మాత్రమే ఎంచుకోవాలి. మీ నెలవారి ఆదాయంలో 40 శాతానికి మించి EMI ఉండకూడదని నిపుణులు చెప్తున్నారు. తక్కువ కాలపరిమితి ఉన్న రుణాలనే ఎంచుకోవాలి. చాలా వరకు బ్యాంకులు ఏడేళ్ల గడువును ఇస్తాయి. అయితే అంతకంటే తక్కువగా ఉన్న కాలపరిమితిని ఎంచుకోవడమే మేలు. అప్పుడు వడ్డీ రేట్ల భారం తగ్గుతుంది.
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా దేశంలో కార్ల షాపింగ్ ఊపందుకుంది. అయితే చాలా మంది ఫైనాన్స్ పద్ధతిలో కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే కారు రుణాలపై పలు బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో అందిస్తున్నాయి. అయితే ఇక్కడ మేము మీకు బ్యాంకుల 1 లక్ష రూపాయల రుణానికిగానూ ఎంత వడ్డీ చెల్లించాలో తెలుసుకుందాము.
బ్యాంకుల కారు రుణాల వడ్డీ రేటు ఒక లక్ష రూపాయలకు వాయిదాలను తెలుసుకోండి
-హెచ్డిఎఫ్సి బ్యాంక్: 9.25%
7 సంవత్సరాలు వాయిదా 1,622 రూపాయలు
-ఐసిఐసిఐ బ్యాంక్: 9.30%7 సంవత్సరాలు వాయిదా 1,624 రూపాయలు
-ఆక్సిస్ బ్యాంక్: 9.25%
8 సంవత్సరాలు వాయిదా 1,478 రూపాయలు
ఇండస్ఇండ్ బ్యాంక్: 10.65 శాతం
5 సంవత్సరాల వాయిదా రూ .2,157
కోటక్ బ్యాంక్: 11.50 శాతం
5 సంవత్సరాల వాయిదా రూ .1,199
-పిఎన్బి: 8.75 శాతం
7 సంవత్సరాల వాయిదా రూ .1,596
-యూనియన్ బ్యాంక్: 8.60 శాతం
7 సంవత్సరాలు వాయిదా 1,589 రూపాయలు
సెంట్రల్ బ్యాంక్: 9.00%
7 సంవత్సరాలు వాయిదా రూ. 1,609
-ఆంధ్రా బ్యాంక్: 9.40%
7 సంవత్సరాలు వాయిదా 1,629 రూపాయలు
-ఐడీబీఐ బ్యాంక్: 9.30%
7 సంవత్సరాలు వాయిదా 1,624 రూపాయలు
-ఫెడరల్ బ్యాంక్: 9.15%
7 సంవత్సరాలు వాయిదా 1,617 రూపాయలు
బ్యాంక్ ఆఫ్ ఇండియా: 9.50 శాతం
7 సంవత్సరాలు వాయిదా 1,634 రూపాయలు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 9.25%
7 సంవత్సరాలు వాయిదా 1,622 రూపాయలు
కార్పొరేషన్ కార్పొరేషన్: 9.55 శాతం
7 సంవత్సరాలు వాయిదా 1,637 రూపాయలు
-ఇండియన్ బ్యాంక్: 9.65 శాతం
7 సంవత్సరాలు వాయిదా 1,642 రూపాయలు
బ్యాంక్ ఆఫ్ బరోడా: 8.90 శాతం
7 సంవత్సరాలు వాయిదా 1,604 రూపాయలు
-యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 9.10 శాతం
7 సంవత్సరాలు వాయిదా 1,614 రూపాయలు
-ఎస్బీఐ: 8.00 శాతం
7 సంవత్సరాల వాయిదా రూ .1,559