Crypto Currency: క్రిప్టో కరెన్సీ లాభాలపై ట్యాక్స్ చెల్లించాలా? ఆదాయపన్ను చట్టం వర్తిస్తుందా?

ప్రతీకాత్మక చిత్రం

భారత రిజర్వ్ బ్యాంకు బిట్ కాయిన్ లేదా ఇతర క్రిప్టోకరెన్సీకి మన దేశంలో లీగల్ టెండర్ హోదాను ఇవ్వలేదు. అందువల్ల ఈ వర్చువల్ కరెన్సీపై పన్ను పరిధిని నిర్వచించే స్పష్టమైన నిబంధనలు లేదా మార్గదర్శకాలు లేవు.

  • Share this:
కరోనా మహమ్మారి ప్రభావంతో యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. రెండు వరుస లాక్‌డౌన్ల తరువాత ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆదాయ వనరుల ప్రాముఖ్యతను గ్రహించారు. చాలా మంది తమ ఇళ్ల నుంచే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించగా.. మరికొందరు ఐపీఓలు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులను చాలామంది ఎంచుకుంటున్నారు. 2021లో భారత్‌లో సుమారు కోటి మందికి పైగా క్రిప్టో పెట్టుబడుదారులు ఉన్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

ప్రస్తుతం భారత్‌లో క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై అపోహలు తగ్గుతున్నాయి. ప్రజలు ఈ మార్గాన్ని.. మంచి రాబడి పొందడానికి గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. క్రిప్టో వ్యాపారులు, పెట్టుబడుదారుల సంఖ్య విపరీతంగా పెరగిన తర్వాత కూడా భారత్‌లో ఈ వర్చువల్ కరెన్సీపై పన్ను విధింపు అంశం, దీనిపై నిరాశను పెంచుతోంది. ఫలితంగా పెట్టుబడిదారులు క్రిప్టో భవిష్యత్తు గురించి ఆందోళనలు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో క్రిప్టో విషయంలో ఎలాంటి ట్యాక్స్ నియమాలు ఉంటాయో తెలుసుకుందాం.

క్రిప్టో కరెన్సీపై పన్ను..
భారత రిజర్వ్ బ్యాంకు బిట్ కాయిన్ లేదా ఇతర క్రిప్టోకరెన్సీకి మన దేశంలో లీగల్ టెండర్ హోదాను ఇవ్వలేదు. అందువల్ల ఈ వర్చువల్ కరెన్సీపై పన్ను పరిధిని నిర్వచించే స్పష్టమైన నిబంధనలు లేదా మార్గదర్శకాలు లేవు. ఫలితంగా దీనిపై ఆదాయపు పన్నుశాఖ నిర్దిష్టమైన స్పష్టతను కోరుతోంది. అయితే క్రిప్టో కరెన్సీ విక్రయాల ద్వారా వచ్చే లాభాలపై పన్ను చెల్లించకుండా ఉండటం మంచి ఐడియా కాదు. స్పష్టంగా మినహాయింపు ఇచ్చినవి తప్ప మిగిలిన ఆదాయం మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే పెట్టుబడిదారుల క్రిప్టో పెట్టుబడులపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది.

పెట్టుబడి స్వభావం
క్రిప్టోలపై పన్ను అనేది పెట్టుబడి స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇది కరెన్సీ రూపంలో ఉందా లేదా ఆస్తుల రూపంలో ఉందా అనే దాని బట్టి ఉంటుంది. క్రిప్టో కరెన్సీ అమ్మకాల ద్వారా వచ్చే లాభాలతో వ్యాపారం చేసేవారు లేదా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారి విషయంలో.. ట్యాక్స్ అనేది తప్పనిసరి కావచ్చు. దీనిపై వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయంపై వర్తించే స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధించవచ్చు. అయితే పెట్టుబడి ప్రయోజనాల విషయంలో అయితే క్యాపిటల్ ప్రాఫిట్లకు వర్తించే విధంగా ట్యాక్స్ ఉంటుంది.

పన్ను చెల్లింపుదారులు తమ పెట్టుబడులను మూడేళ్లకు ముందే ఉపయోగించుకుంటే సంబంధిత పన్ను స్లాబ్‌ల ప్రకారం స్వల్పకాలిక మూలధన లాభాలు వర్తిస్తాయి. ఒకవేళ మూడు సంవత్సరాల తర్వాత జరిగితే.. దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణించి 20 శాతం పన్ను విధించవచ్చు.

మైనింగ్‌లో క్రిప్టోపై పన్ను..
మైనింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన క్రిప్టో కరెన్సీని స్వయం ఉత్పాదక మూలధన ఆస్తి, మూలధన లాభంగా పరిగణించి పన్ను విధించవచ్చు. కానీ కాస్ట్ అక్వెజేషన్‌కు సంబంధించి 1961 ఐటీ చట్టంలోని సెక్షన్ 55 దీన్ని గుర్తించలేదు. అయితే క్రిప్టో కరెన్సీ మైనింగ్ అనేది పన్ను పరిధిలోకి వచ్చే ప్రక్రియ అని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. మార్కెట్ ధర, మైనింగ్‌కు మైనర్ చేసిన వ్యయం ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు.

క్రిప్టో కరెన్సీల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించడం..
ఏడాదికి రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉన్న చెల్లింపుదారులు తమ ఆస్తులు, లయబిలిటీలను కొనుగోలు ఖర్చులతో పాటు వెల్లడించాల్సిన అవసరముంది. క్రిప్టో కరెన్సీలను కూడా ఆస్తులుగా పరిగణించవచ్చు కాబట్టి పన్ను చెల్లింపుదారులు పై షెడ్యూల్లో ఉన్నవారిని కూడా చేర్చాలి. పన్ను చెల్లింపుదారులు రెసిడెంట్లు అయితే తమ పన్ను రిటర్నుల్లో విదేశీ ఆదాయాన్ని, ఆస్తులను వెల్లడించాలి. క్రిప్టో కరెన్సీని స్వీకరించడం, దానిపై పన్ను విధించడం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు, మార్గదర్శకాలు లేవు. అందువల్ల క్రిప్టో కరెన్సీపై పన్ను విధింపు గురించి మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ మార్గదర్శకాల కోసం ఎదురుచూడాల్సిందేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: