కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి చుక్కలను అంటనున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ ఫేబర్ పేర్కొన్నారు. రాబోయే కొన్ని త్రైమాసికాల పాటు షేర్లు, డెట్ మార్కెట్ల కంటే గోల్డ్ పెర్ఫార్మెన్స్ బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. పాపులర్ గ్లూమ్ బూమ్ అండ్ డూమ్ రిపోర్ట్ లో ఆయన ఈ విషయం తెలిపారు. ఇదిలా ఉంటే ఆయిల్ ధరలు, కమోడిటీల ధరలు పెరుగుతాయని 20 ఏళ్ల కిందట కరెక్ట్‌గా ఫేబర్ అంచనా వేశారు. అయితే ప్రస్తుతం గోల్డ్‌పై మార్క్ ఫేబర్ అంచనా వేశారు. 2015 నుంచి గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయని, ఈ ఒక్క ఏడాదే గోల్డ్ 26 శాతం, సిల్వర్ 33 శాతం(డాలర్ల పరంగా) పెరిగాయి. ఇదిలా ఉంటే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కరెన్సీని విపరీతంగా ప్రింట్ చేస్తోంది. ఒక్క ఫెడ్ అనే కాకుండా గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు తమ కరెన్సీలను విపరీతంగా ముద్రిస్తున్నాయి. దీంతో కరెన్సీలకు వాల్యూ పడిపోతోందని, గోల్డ్, సిల్వర్ వంటి విలువైన లోహాలకు వాల్యూ పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
చాలా సెంట్రల్ బ్యాంకులు తమ గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటున్నాయి. దీంతో సమీప కాలంలో గోల్డ్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నయని ఆయన తెలిపారు. వచ్చే కొన్ని నెలల్లో గోల్డ్ జ్యువలరీ ధరలు కూడా పెరుగుతాయని అంచనా వేశారు.
త్వరలో తులం బంగారం ధర రూ.90 వేలు...
బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. ఇదే దూకుడుతో వచ్చే ఏడాది తులం ధర రూ.90 వేలకు చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 2021 ఆఖరుకల్లా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 3 వేల డాలర్లు పలుకవచ్చని, భారతీయ మార్కెట్లో 10 గ్రాములు రూ.90 వేలకు పెరుగవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మార్కెట్లో డిమాండ్ ఉంటుందా?
కరోనా నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు ప్రజల ఆదాయాలూ భారీగా క్షీణించాయి. ఈ క్రమంలో బంగారం లాంటి ఖరీదైన మార్కెట్ల పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మునుపటి స్థాయిలో కొనుగోళ్లు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలే వినిపిస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published:November 23, 2020, 00:12 IST