SBI Special Deposit Scheme: ఎస్​బీఐ స్పెషల్​ ఎఫ్​డీ స్కీమ్.. వడ్డీ రేట్లు, ఫీచర్ల వివరాలివే..!

SBI Special Deposit Scheme: ఎస్​బీఐ స్పెషల్​ ఎఫ్​డీ స్కీమ్.. వడ్డీ రేట్లు, ఫీచర్ల వివరాలు

SBI Special Deposit Scheme: పరిమిత కాలపు ఆఫర్​లో భాగంగా ఈ స్కీమ్‌లను ఆవిష్కరించినట్లు ఎస్​బీఐ తెలిపింది. ఈ ఆఫర్​ సెప్టెంబర్‌ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఎస్​బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

  • Share this:
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. వారి కోసం సరికొత్త స్పెషల్ టర్మ్​ డిపాజిట్ స్కీమ్​ను ప్రారంభించింది. స్పెషల్​ డిపాజిట్, ప్లాటినం డిపాజిట్‌ పేర్లతో వీటిని ఆవిష్కరించింది. పరిమిత కాలపు ఆఫర్​లో భాగంగా వీటిని ఆవిష్కరించినట్లు ఎస్​బీఐ తెలిపింది. ఈ ఆఫర్​ సెప్టెంబర్‌ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఎస్​బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దీనిపై ఎస్​బీఐ ట్వీట్​ చేస్తూ ‘‘ప్లాటినం డిపాజిట్​ స్కీమ్​తో 75 వ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే సమయం వచ్చింది. ఎస్​బీఐ టర్మ్ డిపాజిట్లు, స్పెషల్​ టర్మ్ డిపాజిట్ల కింద ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 14 వరకే అందుబాటులో ఉంటుంది” అని పేర్కొంది. కాగా, ఈ ప్లాటినం టర్మ్ డిపాజిట్లు 75 రోజులు, 525 రోజులు, 2250 రోజుల వ్యవధిలో అందుబాటులో ఉంటాయి.​

ఎస్​బీఐ ప్లాటినం డిపాజిట్లపై వడ్డీ రేట్లు
ఎస్​బీఐ 75 రోజుల వ్యవధి గల టర్మ్​ డిపాజిట్లపై ప్రస్తుతం 3.80 శాతం వడ్డీ అందిస్తుంది. అయితే ఆఫర్​లో భాగంగా స్పెషల్​ డిపాజిట్ ​స్కీమ్​ కింద 3.95 శాతం వడ్డీ చెల్లించనుంది. సీనియర్​ సిటిజన్లకు ప్రస్తుతం 4.40 శాతం వడ్డీ అందిస్తుండగా.. అది 4.45 శాతానికి పెరుగుతుంది. 525 రోజుల వ్యవధి గల టర్మ్​ డిపాజిట్లపై 5.10 శాతం వడ్డీ, 2250 రోజుల టర్మ్​ డిపాజిట్లపై 5.55 శాతం వడ్డీ చెల్లించనుంది. కాగా ఎస్​బీఐ ఇదే వ్యవధిలో ప్రస్తుతం 5 శాతం, 5.40 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇక, 525 రోజుల టర్మ్​ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం 5.50 శాతం వడ్డీ అందిస్తుండగా.. అది 5.50 శాతానికి పెరుగుతుంది. మరోవైపు 2250 రోజుల డిపాజిట్లపై 6.20 శాతం వడ్డీ అందించనుంది.

ఎస్​బీఐ ఎఫ్​డీ వడ్డీ రేట్లు
ఎస్​బీఐ ప్రస్తుతం కనిష్టంగా 7 రోజుల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఫిక్స్​డ్ డిపాజిట్లను అందిస్తోంది. ఈ వ్యవధిలో 2.9 శాతం నుంచి 5.4 శాతానికి వడ్డీ చెల్లిస్తుంది. ఈ డిపాజిట్లపై సీనియర్​ సిటిజన్లు అదనంగా 50 బేసిస్​ పాయింట్​ వడ్డీ పొందుతారు. కాగా, దేశంలోని సీనియర్ సిటిజన్లు, పెన్షనర్ల కోసం ఎస్​బీఐ ఇటీవల ‘వీకేర్’ పేరుతో ప్రత్యేక ఎఫ్​డీ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 5 సంవత్సరాలు లేదా అంతకు ఎక్కువ వ్యవధి గల ఎఫ్​డీలపై అధిక వడ్డీ ఆఫర్​ చేస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published: