హోమ్ /వార్తలు /బిజినెస్ /

Broadband Plans: జియో ఫైబర్ నుంచి యాక్ట్ వరకు.. తక్కువ ధరలోని బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు ఇవే..

Broadband Plans: జియో ఫైబర్ నుంచి యాక్ట్ వరకు.. తక్కువ ధరలోని బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Broadband Plans: రిలయన్స్ జియో ఫైబర్, ఎయిర్టెల్, యాక్ట్ బ్రాండ్ బ్యాండ్, బీఎస్ఎన్ఎల్, టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్, ఎక్స్ టెల్.. తదితర సంస్థలు నెలకు రూ.500 నుంచి వివిధ రకాల ప్లాన్లు అందుబాటులో ఉంచుతున్నాయి.

కరోనా మహమ్మారి ప్రభావంతో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నప్పటి నుంచి హోం బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు ఆదరణ పెరిగింది. నగరాల నుంచి గ్రామాల వరకు మెరుగైన ఇంటర్నెట్ సేవల కోసం బ్రాడ్‌బ్యాండ్‌ లైన్ కనెక్షన్‌ను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా పిల్లల ఆన్ లైన్ చదువుల కోసం, ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఈ సేవలను అధికంగా వాడుతున్నారు. మొబైల్‌లో 3జీ, 4జీ సేవలు ఉన్నప్పటికీ మరింత సౌలభ్యం కోసం వీటికి ప్రాధాన్యత పెరిగింది. రిలయన్స్ జియో ఫైబర్, ఎయిర్టెల్, యాక్ట్ బ్రాండ్ బ్యాండ్, బీఎస్ఎన్ఎల్, టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్, ఎక్స్ టెల్.. తదితర సంస్థలు నెలకు రూ.500 నుంచి వివిధ రకాల ప్లాన్లు అందుబాటులో ఉంచుతున్నాయి. 30 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు వేగాన్ని అందిస్తున్నాయి.

రిలయన్స్ జియో ఫైబర్..

రిలయన్స్ జియో ఫైబర్ మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తోంది. నెలకు రూ.399 విలువగల బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్ వస్తుంది. అంతేకాకుండా హోమ్‌ పోన్‌తో దేశవ్యాప్తంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అపరిమిత డేటా సౌలభ్యం ఉంది. ప్రీపెయిడ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. 6 నెలలు లేదా ఏడాది కాలానికి పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ ప్లాన్స్ ఉన్నాయి.

* ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్..

రూ.499కే అన్ లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్. ఈ ప్లాన్ లో 40 ఎంబీపీఎస్ స్పీడ్ వస్తుంది. అంతేకాకుండా అపరిమిత డేటా.. అంటే 3333జీబీ ఫెయిర్ యూసేజ్ పాలసీని(FUP)ని అందుబాటులో ఉంచింది. ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ఓటీటీ ప్లాట్ ఫాం, వింక్ మ్యూజిక్, షా అకాడమి లాంటి ఆప్షన్లు ఈ ప్లాన్ లో ఉన్నాయి. ఎయిర్టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ తో పాటు లోకల్, నేషనల్ అపరిమిత వాయిస్ కాల్స్ సౌలభ్యం కూడా ఇందులో ఉన్నాయి.

* బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్..

బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్ ను వినియోగదారుల ముందు ఉంచింది. రూ.449కే 30 ఎంబీపీఎస్ స్పీడు ఉండే ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. రిలయన్స్ జియో ఫైబర్ కంటే నెలవారీ ధర కొంచెం ఎక్కువగా ఉన్న ఈ ప్లాన్ లో అపరిమిత లోకల్, నేషనల్ వాయిస్ కాల్స్ ఉన్నాయి. అంతేకాకుండా 3333జీబీ FUP పాలసీని అవలంభిస్తుంది. ఎంటీఎన్ఎల్ ప్లాన్స్ ప్రస్తుతం ముంబయి, దిల్లీ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. FTH-777 ప్లాన్ తో నెలకు రూ.777లకే 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉండే ఇంటర్నెట్ ను అందిస్తుంది. 800 జీబీ వరకు ఈ స్పీడ్ ఉంటుంది. అనంతరం 1 ఎంబీపీఎస్ వేగానికి తగ్గుతుంది.

* టాటా స్కై..

50 ఎంబీపీఎస్ స్పీడ్ కావాలంటే 3, 6, 12 నెలల ప్లాన్ తీసుకుని అడ్వాన్స్ గా ముందే డబ్బు చెల్లించాలి. ఇలా కాకుండా నెలవారీ చెల్లించాలంటే 100 ఎంబీపీఎస్ లేదా అంతకంటే ఎక్కువ వచ్చే ప్లాన్ ను ఎంచుకోవచ్చు. 3 నెలల ప్లాన్ కావాలంటే రూ.1797లు చెల్లించాలి. 6 నెలలకు రూ.3300, 12 నెలలకు 6000 చెల్లించాలి. ఈ ప్లాన్స్ లో నెలవారీగా డేటా ప్లాన్ కోసం వరుసగా రూ.599, రూ.550, రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

Sleep: గాఢంగా నిద్రపోవాలనుకుంటున్నారా ?.. ఇలా చేస్తే మీ నిద్రకు ఇబ్బంది ఉండదు..

Revanth Reddy: రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే.. ఆ రిపోర్ట్ ఆధారంగా కీలక నిర్ణయాలు

* ఎక్సైటెల్..

ఎక్సైటెల్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు దిల్లీ సహా భారత్ లో అనేక నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉండే ప్లాన్ ను ఎంచుకుంటే అపరిమిత డేటా వస్తుంది. అయితే మీరు ముందుగానే డబ్బు చెల్లించాలి. ఉదాహరణకు మీకు నెలకు రూ.699 ఖర్చవుతుందనుకుంటే మూడు నెలలకు ముందుగానే చెల్లిస్తే నెలవారీ భారం తగ్గుతుంది. అంటే రూ.565లు చెల్లిస్తే సరిపోతుంది. అదే 4 నెలలయితే రూ.508, ఏడాదికైతే రూ.399లు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. అదే ఇతర బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల్లో అయితే 40, 50ఎంబీపీఎస్ మాత్రమే వస్తుంది.

* యాక్ట్ బ్రాడ్‌బ్యాండ్‌..

ఈ సంస్థ కొన్ని నగరాల్లో యాక్ట్ స్విఫ్ట్ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. నెలకు అపరిమిత డేటాను వాడుకోవచ్చు. అంటే 3300 జీబీ FUP పరిమితి ఉంటుంది. 50ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. ఈ ప్లాన్ కోసం నెలకు రూ.710లు చెల్లించాలి. కొంచె ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది వినియోగదారులు ఈ ప్లాన్ పట్ల విముఖంగా ఉండవచ్చు. వేగం కూడా పరిమితి తర్వాత 512 కేబీపీఎస్ కు పడిపోతుంది. దీంతో వినియోగదారులపై భారం పడుతుంది. అయితే 40 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్న యాక్ట్ స్టార్టర్ ప్లాన్ రూ.549కే తీసుకోవచ్చు.

First published:

Tags: AIRTEL, Internet, Jio fiber, Tata Sky

ఉత్తమ కథలు