• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • KNOW RESERVE BANK OF INDIA ATMDEBIT CARD BEFORE GIVING YOUR CARD TO SOMEONE SS

ATM Rules: మీ ఏటీఎం కార్డును మీ భార్య వాడినా తప్పే... RBI రూల్స్ తెలుసుకోండి

ATM Rules: మీ ఏటీఎం కార్డును మీ భార్య వాడినా తప్పే... RBI రూల్స్ తెలుసుకోండి

దీంతోపాటు RTGS,NEFT ద్వారా జరిపే లావాదేవీలకు అదనపు చార్జీలు ఎత్తేసింది.

ATM Rules | మీ డెబిట్ కార్డ్ మీరు మాత్రమే వాడాలి. ఇతరులకు ఇవ్వకూడదు. మీ కుటుంబ సభ్యులకు కూడా మీ ఏటీఎం కార్డు ఇవ్వొద్దు. పిన్ నెంబర్ చెప్పకూడదు.

  • Share this:
    మీరు మీ ఏటీఎం కార్డ్ మీ భార్యకు ఇస్తున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే. ఏ సమస్య రానంతవరకూ మీకు ఏ ఇబ్బంది ఉండదు కానీ... ట్రాన్సాక్షన్‌లో ఏదైనా తేడా వస్తే మాత్రం మీరు కంప్లైంట్ చేయలేరు. ఉదాహరణకు మీ ఏటీఎం కార్డును మీ భార్య తీసుకొని, ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడానికి వెళ్లారని అనుకుందాం. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినప్పుడు మెషీన్‌లోంచి డబ్బులు రాకపోయినా మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అయితే మీరు నష్టపోయినట్టే. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం దీనిపై కంప్లైంట్ చేసే హక్కు మీకు ఉండదు. గతంలో ఒకరికి ఇలాంటి సమస్యే వచ్చింది.

    Read this: RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?

    Reserve Bank of India ATM card rules, Reserve Bank of India debit card rules, new ATM card rules, new debit card rules, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కార్డ్ రూల్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ రూల్స్, ఏటీఎం కార్డ్ రూల్స్, డెబిట్ కార్డ్ రూల్స్

    నిబంధనల ప్రకారం ఎవరి డెబిట్ కార్డ్ వాళ్లే ఉపయోగించాలి. ఎందుకంటే ఏటీఎం కార్డ్ ట్రాన్స్‌ఫరబుల్ కాదు. కాబట్టి మీరు ఎవరికీ ఇవ్వకూడదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రతీ బ్యాంకు నియమనిబంధనలు ఇవే చెబుతున్నాయి. మీ ఏటీఎం కార్డు మీరు ఉపయోగించినప్పుడు లావాదేవీల్లో ఏవైనా సమస్యలు వస్తే మీరు కంప్లైంట్ చేయొచ్చు. అదే మీ కార్డు ఇతరులు ఎవరైనా ఉపయోగించినప్పుడు లావాదేవీల్లో తేడా వస్తే మాత్రం కంప్లైంట్ చేసే హక్కు మీకు లేనట్టే.

    Read this: Personal Finance: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

    Reserve Bank of India ATM card rules, Reserve Bank of India debit card rules, new ATM card rules, new debit card rules, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కార్డ్ రూల్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ రూల్స్, ఏటీఎం కార్డ్ రూల్స్, డెబిట్ కార్డ్ రూల్స్


    ఏటీఎం కార్డుల విషయంలో మీరేం చేయాలి?


    ఏటీఎం కార్డ్ ట్రాన్స్‌ఫరబుల్ కాదు అన్న విషయం గుర్తుంచుకోండి.
    మీ డెబిట్ కార్డ్ మీరు మాత్రమే వాడాలి. ఇతరులకు ఇవ్వకూడదు.
    మీ కుటుంబ సభ్యులకు కూడా మీ ఏటీఎం కార్డు ఇవ్వొద్దు. పిన్ నెంబర్ చెప్పకూడదు.
    కార్డ్ హోల్డర్ పిన్ నెంబర్‌ను ఎవరికీ చెప్పకూడదని ఆర్‌బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
    మీరు మీ ఏటీఎం కార్డును ఇతరులకు ఇచ్చారంటే మీ పిన్ నెంబర్ చెప్పాల్సిందే.
    మీ పిన్ నెంబర్ ఇతరులకు చెప్పడం నిబంధనలకు విరుద్ధం.
    ఏటీఎంల దగ్గర కూడా మీరే డబ్బులు డ్రా చేయాలి తప్ప ఇతరుల సాయం తీసుకోకూడదు.
    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమనిబంధనలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Link PAN: బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తేనే ఐటీఆర్ రీఫండ్

    Redmi Note 7 Pro: షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్
    First published: