SBI: ఆన్‌లైన్‌లోనే మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు ఇలా...

SBI Account Transfer Online Process | మీరు ఆన్‌లైన్‌లో బ్యాంక్ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే కేవైసీ అప్‌డేట్ ఉండాలి. మీ మొబైల్ నెంబర్ బ్యాంకులో రిజిస్టర్ చేసి ఉండాలి.

news18-telugu
Updated: May 18, 2019, 1:34 PM IST
SBI: ఆన్‌లైన్‌లోనే మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు ఇలా...
SBI: ఆన్‌లైన్‌లోనే మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు ఇలా...
news18-telugu
Updated: May 18, 2019, 1:34 PM IST
ఒకప్పుడు బ్యాంకింగ్ సేవలు పొందాలంటే సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లకతప్పని పరిస్థితి. బ్యాంకుకు వెళ్లి గంటలు గంటలు క్యూలో నిల్చుని పనులు పూర్తి చేసుకొని రావాల్సి వచ్చేది. కానీ... పెరుగుతున్న టెక్నాలజీతో బ్యాంకింగ్ సేవలు సులభమయ్యాయి. చాలావరకు సేవల్ని ఇంట్లో కూర్చొనే పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు... డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం దగ్గర్నుంచి చెక్ బుక్ రిక్వెస్ట్ వరకు... అన్నీ ఒక్క యాప్‌లో సాధ్యమౌతాయి. ఇప్పుడు బ్రాంచ్‌ను మార్చుకోవడం కూడా ఆన్‌లైన్‌లో సాధ్యమే. ఒకప్పుడు బ్రాంచ్ మార్చుకోవాలంటే నాలుగైదు ఫామ్స్ పూర్తి చేయాల్సి ఉండేది. కొన్ని వారాల పాటు ఎదురుచూడాల్సి వచ్చేది. ఎస్‌బీఐ అకౌంట్‌ను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌లోనే మార్చుకునే అవకాశం కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? అయితే సులువుగా బ్రాంచ్‌ను మరోచోటికి ఎలా మార్చుకోవచ్చు తెలుసుకోండి.

ఎస్‌బీఐ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లోనే మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా...


ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.onlinesbi.com ఓపెన్ చేయండి.

'personal banking' పైన క్లిక్ చేసి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
హోమ్ స్క్రీన్ పైన 'e-Services' ట్యాప్ క్లిక్ చేయండి.
'e-Services' మెనూలో 'Transfer of Savings Account' సెలెక్ట్ చేసుకోండి.


మీ రిజిస్టర్డ్ అకౌంట్ నెంబర్స్ కనిపిస్తాయి. అందులో ఏ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలో సెలెక్ట్ చేయండి.
Loading...
ఒకవేళ ఒకే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటే డిఫాల్ట్‌గా అదే అకౌంట్ సెలెక్ట్ అవుతుంది.
తర్వాత మీరు ఏ బ్రాంచ్‌‌కు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ కోడ్ ఎంటర్ చేయండి.
టర్మ్స్ అండ్ కండీషన్స్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయండి.
తర్వాతి పేజీలో ప్రస్తుత బ్రాంచ్ కోడ్, కొత్త బ్రాంచ్ కోడ్ ఎంటర్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి 'confirm' క్లిక్ చేయాలి.
వారం రోజుల్లో మీ అకౌంట్ మీరు ఎంచుకున్న బ్రాంచ్‌కు మారుతుంది.

మీరు ఆన్‌లైన్‌లో బ్యాంక్ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే కేవైసీ అప్‌డేట్ ఉండాలి. మీ మొబైల్ నెంబర్ బ్యాంకులో రిజిస్టర్ చేసి ఉండాలి.

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్


ఇవి కూడా చదవండి:

Gym Business: జిమ్‌ బిజినెస్‌తో లక్షల్లో సంపాదన... ఎలాగో తెలుసుకోండి

Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలా? ఈ టిప్స్ మీకోసమే...

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...