IRCTC RAC: ఆర్ఏసీ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ ఇవే...

IRCTC RAC ticket cancellation rules | ఒకవేళ మీరు ఆర్ఏసీ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే క్లర్కేజ్ ఛార్జీ రూ.60+జీఎస్టీ మినహాయించి మీకు రీఫండ్ చేస్తారు.

news18-telugu
Updated: April 6, 2019, 1:28 PM IST
IRCTC RAC: ఆర్ఏసీ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ ఇవే...
IRCTC RAC: ఆర్ఏసీ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ ఇవే...
news18-telugu
Updated: April 6, 2019, 1:28 PM IST
ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేయడమే కాదు... క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఇది సాధ్యం. అయితే టికెట్ క్యాన్సలేషన్ విషయంలో కొన్ని రూల్స్ ఉంటాయి. టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆ నిబంధనలకు అనుగుణంగానే రీఫండ్ లభిస్తుంది. ఒకవేళ మీరు RAC(రిజర్వేషన్ అగెయిన్స్‌ట్ క్యాన్సలేషన్) టికెట్ క్యాన్సిల్ చేయాలంటే ముందు నిబంధనల గురించి తెలుసుకోవాలి. ఆర్ఏసీ టికెట్ అంటే మీకు టికెట్ కన్‌ఫామ్ అయినట్టే. కానీ బెర్త్ కోసం వెయిట్‌లిస్ట్‌లో ఉన్నారని అర్థం. బెర్త్ దొరికితే దొరకొచ్చు. లేదా ఒకే బెర్త్‌లో ఇద్దరు అడ్జెస్ట్ కావాల్సి ఉంటుంది. ఆర్ఏసీలో అడ్జెస్ట్ కాలేమని అనుకునేవాళ్లు టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు.

Read this: WhatsApp: వాట్సప్‌లో కొత్తగా గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్... సెట్టింగ్స్ ఇవే

ఆర్ఏసీ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ ఇవే...



రిజర్వేషన్‌లో ముందుగా బెర్త్‌లన్నీ కేటాయిస్తారు. ఆ తర్వాత ఆర్ఏసీ టికెట్లు కేటాయిస్తారు. మీకు ఆర్ఏసీ వచ్చిందంటే టికెట్ కన్‌ఫామ్ అయినట్టే. కానీ బెర్త్ దొరకలేదు. మీకంటే ముందు బుక్ చేసుకున్నవాళ్లు ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు బెర్త్ దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఆర్ఏసీ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే క్లర్కేజ్ ఛార్జీ రూ.60+జీఎస్టీ మినహాయించి మీకు రీఫండ్ చేస్తారు. ఒకవేళ రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేస్తే రీఫండ్ కోసం ఆన్‌లైన్‌లో టీడీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.



రైలు బయల్దేరడానికి అరగంట ముందు మీరు టికెట్ క్యాన్సిల్ చేయకపోయినా, టీడీఆర్ ఫైల్ చేయకపోయినా రీఫండ్ రాదు. ఒకరికన్నా ఎక్కువ మంది టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కొందరికి బెర్త్ కన్‌ఫామై, ఇంకొందరికి ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ ఉంటే... టికెట్ క్యాన్సల్ చేసినప్పుడు క్లర్కేజ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి.

Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే
ఇవి కూడా చదవండి:

Link PAN: మీ పాన్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ఇలా లింక్ చేయండి

EPFO: ప్రైవేట్ ఉద్యోగులకు వరం... కొత్త పీఎఫ్ ఇలా లెక్కించాలి
First published: April 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు