భారత ఆర్ధిక వ్యవస్థకు కేంద్ర నాడి, జీడీపీ కి ౩౦% దోహదకారి, 114 మిలిలయన్ల మంది కంటే అధిక జనాభాకు ఉపాధికారి, మరియు భారతదేశపు ఎగుమతుల లో 50% వాటా భాగస్వాములు భారదేశపు MSME లు. కేవలం MSME ల Digitization వలననే భారదేశపు GDP కు 2024 నాటికి $158 నుండి 216 బిలియన్లు చేయూత నివ్వగలదు.
ప్రస్తుతం కంటే MSME వ్యాపారానికి మెరుగైన రోజులు ఎన్నడూ లేవు. ప్రయివేటు పెట్టుబడి జోరు మీద వుంది, వ్యాపారం ప్రారంభించి సజావుగా నడిపేందుకు మెరుగైన ప్రణాళికా సవరణలు దోహదపడుతున్నాయి. అంతే కాకుండా భారతదేశ అవస్థాపక పెట్టుబడులు వ్యాపారాలకు గుణకారాలు అవుతున్నాయి. కోట్ల మంది వ్యక్తులు మరియు వ్యాపార సంస్థ ల తో ఇప్పటికే ఉపయోగించబడుతూ ఆర్ధిక మరియు సామాజిక అంతర్గ్రహణ కు దారిచూపుతున్న ఇండియా స్టాక్ భారతదేశపు సాంకేతిక శక్తిని ప్రదర్శిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలలో వయస్సు పైబడిన ప్రజల సంఖ్య అధికమవుతున్న తరుణంలో ప్రపంచపు పెద్ద దేశాల లో ఇండియా అత్యధిక మానవ వనరుల పంపిణీదారుగా ఆవిర్భవిస్తోంది.
భారతదేశపు $5 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థ గమ్యం అందుకోవడానికి ఈ వ్యాపారాల శక్తి సజ్జికరణించాలి అన్నది స్పష్టం. క్వాలిటీ కౌన్సిల్ అఫ్ ఇండియా (QCI) యొక్క ఒక దృష్టి ఇది. చిత్తశుద్ధి చోదిత వ్యాపారాల సముదాయం మరియు అవి అందించే నిర్వహణీయ అభివృద్ధి ఏర్పాటు ద్వారా QCI భారతదేశం నిజమైన ప్రపంచ నాయకత్వ స్థానం చేరుకోవడం లో దోహదపడుతున్నది. ఈ దృష్టి యొక్క కీలక సిద్ధాంతాల మేల్కలయిక ఫలితంగానే MSME మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో దోష రహిత, ప్రభావ శూన్య (ZED) ప్రమాణీకరణ ప్రణాళిక రూపుదిద్దుకుంది. ZED ప్రమాణీకరణ ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యం ప్రజానీకానికి మరియు గోళానికి మంచి చేకూర్చడం.
శూన్య దోషం అంటే భారతదేశ వ్యాపారాలు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడం. దీనివల్ల, భారతదేశం లోనే కాకుండా విదేశాలలో కూడా అవి ఉన్నత పోటీ ఎదుర్కునే శక్తి ఏర్పరచుకొని తమ గిరాకీ మరియు ప్రతిష్ట అంతర్గతంగా పెంచుకోగలుగుతాయి. తత్కారణంగా మరిన్ని భారతీయ వ్యాపారాలు ఈ ప్రమాణాలు అందుకోవడం ద్వారా మెరుగైన నాణ్యత, కాలీనత మరియు చిత్తశుద్ధి కి భారతదేశం మారుపేరుగా ఎదిగే గుణాకార ప్రభావం కలిగిస్తుంది.
శూన్య ప్రభావం అంటే పర్యావరణం పైన శూన్య ప్రతికూల ప్రభావాల తో అధిక నాణ్యతగల వస్తువులు మరియు సేవల ఏర్పాటుకు వ్యాపారాల పైన కఠిన ఆంక్షల ద్వారా అతిశయమైన/బలవత్తరమైన హరిత ప్రమాణాల అవలంబనకు భారత వ్యాపారాలు కట్టుబడి ఉండాలి. అవలంబన పెరిగినకొలది పర్యావరణ పరంగానూ మరియు ఆర్థికంగానూ నిర్వహించగల విధంగా వ్యాపారాభివృద్ధి కి భారతీయ వ్యాపారాలు ప్రమాణం రూపొందిస్తాయి.
ఈ కార్యక్రమపు లహరి ప్రభావాలు అన్ని భారతీయ వ్యాపారాలకు పుష్టి చేకూరుస్తాయి. కాగా, MSME ల పెరుగుదలకు ZED ప్రణాళిక అపరిమితమైన అవకాశాలు ఏర్పరుస్తుంది. రెండు దశలలో అనువర్తించే ZED ప్రమాణీకరణ ఇప్పుడు వస్తువులు మరియు సేవలకు వర్తిస్తుంది. ZED ప్రమాణం లభించిన MSME లు వాటి వినియోగదారులు, మదుపరులు, పంపిణీదారులు మరియు ఉద్యోగస్తుల మనస్సులలో నాణ్యత, విలువ మరియు చిత్తశుద్ధి పైన హామీ ఏర్పడడం ద్వారా వారి నుండి ఉత్త్తమమైన వారిని ఆకర్షించ గలవు. తత్కారణంగా ఏ పంపిణీదారునితో ఒప్పందాలు చేసుకోవాలి, ఎవరిని ఎంచుకోవాలి లేదా ఎవరి నుండి పెట్టుబడులు స్వీకరించవచ్చు అనేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం లో వారి స్థితి శక్తివంతం చెయ్యడం లో ఇది దోహదపడుతుంది. అదనంగా, ఆర్ధిక సంస్థ ల నుండి అప్పులు పొందండంలో ZED ప్రమాణీకరణ పొందిన MSME లకు ప్రాధాన్యత లభిస్తుంది మరియు ప్రాసెసింగ్ రుసుములు మరియు వడ్డీ రేట్ల లో రాయితీలు లభిస్తాయి. వాటికి రుణ స్థానక్రమం (క్రెడిట్ రేటింగ్) సాధారణంగా మెరుగుగా ఉంటుంది.
వాటి ఉత్పత్తులు మరియు సేవలు అధిక స్థాయి నాణ్యత మరియు నిర్వహణతా ప్రమాణాల కనుగుణంగా ఉండడం వలన ZED ప్రమాణీకరణ పొందిన MSME లకు, ముఖ్యంగా పాశ్చత్య దేశాలకు ఎగుమతుల విషయం లో, నూతన విపణులు మరియు భౌగోళిక ప్రదేశాలు అందుబాటులోకి వస్తాయి. భారతదేశం లో మరియు విదేశాలలో నిర్వహింపబడే వ్యాపార ప్రదర్శనలు మరియు వర్తక మేళాల లో పాల్గొనే నిమిత్తం దుకాణ రుసుములు, విమాన టిక్కెట్లు మరియు సరుకు రవాణా రుసుములు లో రాయితీలు అందించడం ద్వారా కూడా GOI సహాయపడుతుంది.
అయినా, ప్రణాళిక నుండి లాభం పొందడానికి MSME లు ZED ప్రమాణీకరణ అర్హత కోసం నిరీక్షించే అవసరం లేదు. వారి వారి వ్యాపారాల లో లోపాలు మరియు వారి వ్యాపారాభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యల అవగాహనకు ZED ప్రమాణీకరణ ప్రక్రియే సహాయపడుతుంది. లోప విశ్లేషణ నిర్వహించి వ్యాపారాల రేటింగులు మెరుగుచేసుకునే దిశగా QCI సలహాదారులు సదరు వ్యాపార సంస్థలతో కలిసి పనిచేస్తారు. రేటింగులు మెరుగు పడడంతో బాటూ వ్యాపారాల లాఘవం మరియు క్షమత పెరుగుతాయి.
ఈ విధంగా వ్యాపారాలు తమ శక్తి పెంచుకోగలవు. లోపాలు తగ్గించుకోవడం తోనూ, సవరించుకొని; ఉత్పాదకత పెంచుకొని మొదటి సారి రేట్ల ఉత్తీర్ణత పొందడం ద్వారా ROI అధికం కావడం. డెలివరీ విషయం లో సమయపాలన మరియు వినియోగదారుల ఫిర్యాదుల తగ్గుదల మరియు బ్రాండు విలువ మరియు ప్రతిష్ఠ మాత్రమే కాకుండా పునః వాణిజ్యం కు దోహద పడుతుంది.
దీని సారాంశం, నాణ్యత అవకాశాలకు తలుపులు తీస్తుంది.
1. MSME ద్వారా ఉచిత ఆన్లైన్ నమోదు మరియు శపథం
2. ప్రాథమిక సమాచారం మరియు దస్తావేజుల డౌన్లోడ్
3. అప్లోడ్ చేసిన సమాచారం ఆధారంగా డెస్క్టాప్/రిమోట్/ఆన్ సైట్ సమీక్ష
4. ప్రామాణీకరణ పత్రం అందుకొని యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం.
5. ప్రోత్సాహకాల వినియోగం
ఆసక్తి కల పార్టీలు ప్రక్రియను ఇప్పుడే, ఇక్కడే ప్రారంభించవచ్చు.
ZED ప్రామాణీకరణ మూడు స్థాయిలు- బ్రాన్జ్, సిల్వర్, మరియు గోల్డ్ . వాటి పూర్ణత అనుసారం MSME లు ఏ స్థాయి ప్రమాణికరణకైనా దరఖాస్తు చేసుకోవచ్చును. మరిన్ని MSME లను దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సాహన కొరకు, MSME మంత్రిత్వ శాఖ మైక్రో, స్మాల్, మరియు మీడియం సంస్థలకు వరుసగా 80%, 60% మరియు 50% రాయితీ ప్రకటించింది. పలురకాలైన ప్రోత్సాహకాలు అందించే రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, ఆర్ధిక సంస్థలు మరియు బ్యాంకులను MSME మంత్రిత్వ శాఖ చేర్చింది. ప్రణాళిక మరియు లబ్ధుల గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకొనవచ్చును.
కానీ, అన్ని యోగ్యమైన సాధనల లాగానే ZED ప్రమాణీకరణ సులువుగా లభ్యం కాదు. విలువ కట్టి, పరీక్షించి, MSME లకు చేయూత నిచ్చి తద్ద్వారా వాటిని ఉన్నతమైన పరిపక్వ స్థాయిలకు చేర్చి వాటిని ప్రపంచ పోటీ కి తయారుచెయ్యడం ZED పరిపక్వ పరీక్షా నమూనా యొక్క లక్ష్యం. ఇది ఒక మహా ప్రయత్నం. 2026 నాటికల్లా ఆర్ధిక వ్యవస్థను $5 ట్రిలియన్లు అటుతరువాత 2033 నాటికి $10 ట్రిలియన్లకు చేర్చడానికి GOI ZED ప్రణాళికను ఒక తులాయంత్రం గా వీక్షిస్తోంది. అది సాధ్యపడాలంటే, దానికి ఖచ్చ్చితత్వం అవసరం.
ZED కార్యక్రమం తో భారతదేశం లో నాణ్యత స్థాయి పెంపుదల, MSME లు ధైర్యంగా దీటుగా వ్యవహరించేందుకు తగిన పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడం లో QCI తన 25 సంవత్సరాల అనుభవం వినియోగించుకుంటోంది.
QCI మరియు భారతదేశపు గుణవత్థా సే ఆత్మనిర్భరత చొరవ గురించి మరిన్ని వివరాల కొరకు మరియు అది మన జీవితాలను వివిధ రీతులలో ప్రభావితం చేసిన వివరాల కొరకు https://www.news18.com/qci/ సందర్శించండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business Ideas, Msme, Small business