TRAI rules: ఛానెళ్లు సెలెక్ట్ చేసుకున్నారా? మీ కేబుల్ బిల్ ఇలా మారుతుంది

పే ఛానెల్స్ చూడాలంటే మాత్రం అదనంగా చెల్లించాల్సిందే. ఇందుకోసం ప్యాకేజీలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 535 ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్, 330 పే ఛానెల్స్ అందుబాటులో ఉన్నాయి.

news18-telugu
Updated: February 12, 2019, 6:00 PM IST
TRAI rules: ఛానెళ్లు సెలెక్ట్ చేసుకున్నారా? మీ కేబుల్ బిల్ ఇలా మారుతుంది
పే ఛానెల్స్ చూడాలంటే మాత్రం అదనంగా చెల్లించాల్సిందే. ఇందుకోసం ప్యాకేజీలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 535 ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్, 330 పే ఛానెల్స్ అందుబాటులో ఉన్నాయి.
  • Share this:
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)... షార్ట్ కట్‌లో ట్రాయ్. గత రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. టీవీ ఛానెళ్ల ప్రసారాలు, ధరలు, ప్యాకేజీల విషయంలో ట్రాయ్ విధించిన నియమనిబంధనలపై తీవ్రస్థాయిలోనే చర్చ జరుగుతోంది. ప్రేక్షకులు తాము చూడాలనుకున్న ఛానెల్స్ మాత్రమే ఎంచుకొని వాటికి డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించామని ట్రాయ్ చెబుతుంటే... ఇలా ఛానెల్స్ వేర్వేరుగా ఎంచుకుంటే బిల్లు మొత్తం తడిసి మోపెడవుతోందని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. అసలు కొత్త నిబంధనలతో కేబుల్ బిల్ ఎలా మారబోతోంది? తెలుసుకుందాం.

Read this: PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

బేస్ ప్యాకేజీ


బ్రాడ్‌క్యాస్టర్లు ప్రతీ ఛానెల్‌కు ఓ ధర నిర్ణయించారు. వాటికి అనుగుణంగా డీటీహెచ్, కేబుల్ టీవీ ఆపరేటర్లు సొంతగా ప్యాకేజీలు తయారు చేశారు. అయితే ట్రాయ్ నిబంధనల ప్రకారం 100 ఎస్‌డీ ఛానెళ్ల బేస్ ప్యాక్ రూ.130. దానికి జీఎస్‌టీ అదనం. జీఎస్టీతో కలిపి కేవలం రూ.153 చెల్లించి 100 ఉచిత ఛానెళ్లు చూసే వెసులుబాటు ఉంది. అయితే పే ఛానెల్స్ చూడాలంటే మాత్రం అదనంగా చెల్లించాల్సిందే. ఇందుకోసం ప్యాకేజీలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 535 ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్, 330 పే ఛానెల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలోంచి ఛానెళ్లను ఎంచుకోవచ్చు. ఎయిర్‌టెల్, టాటాస్కై రూ.99 నుంచే బేస్ ప్యాక్స్ ఆఫర్ చేస్తున్నాయి.

Read this: LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

బొకే ఛానెళ్ల ధరలు


పే ఛానెళ్లకు ఎంత ఛార్జ్ చేస్తారో ట్రాయ్ తన వెబ్‌సైట్‌లో జాబితాను ఉంచింది. ఆ జాబితా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. పే ఛానెళ్ల ధరల్ని బట్టి మీరు కోరుకునే ఛానెళ్లకు ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసుకోవచ్చు. అంతే కాదు... ఛానెల్ సెలెక్టర్ అప్లికేషన్‌‌ను కూడా ట్రాయ్ రూపొందించింది. అందులో మీ ప్రాధాన్యతను బట్టి ఛానెళ్లను ఎంచుకోవాలి. మీరు ఛానెళ్లను ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకునే ఛానెళ్లకు మొత్తం ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు. ఛానెల్ సెలెక్టర్ అప్లికేషన్‌‌ను ఉపయోగించేందుకు ఈ లింక్ https://channel.trai.gov.in/index.html క్లిక్ చేయండి. అయితే బేస్ ప్యాకేజీలో ఫ్రీ ఛానెళ్లు, పే ఛానెళ్లు మొత్తం కలిపి 100 దాటకూడదు. 100 దాటికే ప్రతీ 25 అదనపు ఛానెళ్లకు రూ.20 చెల్లించాలి. అంటే మీరు రూ.150+జీఎస్టీ చెల్లిస్తే 125 ఛానెళ్లను ఎంచుకోవచ్చు.Read this: Channel Selector Application: ఛానెళ్ల ఎంపికకు ట్రాయ్ కొత్త అప్లికేషన్... ఇలా సెలెక్ట్ చేసుకోండి

ఒకవేళ మీరు మీ కేబుల్ ఆపరేటర్ లేదా డీటీహెచ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర గతంలోనే వార్షిక ప్యాకేజీ తీసుకున్నట్టయితే మీ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు.

Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు

ఇవి కూడా చదవండి:

Save Money: జీతం మొత్తం ఖర్చయిపోతుందా? డబ్బు ఆదా చేయడానికి 5 టిప్స్

LIC Payment: ఎల్ఐసీ ప్రీమియం కట్టడం మర్చిపోయారా? ఇలా చేయొచ్చు

Elections 2019: మీ ఓటు ఉందా... లేదా? ఇలా చెక్ చేసుకోండి
First published: February 12, 2019, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading