హోమ్ /వార్తలు /బిజినెస్ /

PF withdrawal: మీ కంపెనీ మూసేశారా? పీఎఫ్‌ను ఇలా విత్‌డ్రా చేయండి

PF withdrawal: మీ కంపెనీ మూసేశారా? పీఎఫ్‌ను ఇలా విత్‌డ్రా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PF withdrawal | మీ పీఎఫ్ డబ్బులు పాత కంపెనీ అకౌంట్‌లో చిక్కుకుపోయాయా? ఎలా విత్‌డ్రా చేయాలో తెలుసుకోండి.

కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఉద్యోగులపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు చాలా మంది తమ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి పీఎఫ్ విత్‌డ్రా చేస్తున్నారు. అయితే పీఎఫ్ విత్‌డ్రాపై ఉద్యోగులకు అనేక సందేహాలు ఉంటాయి. అనేక సందర్భాల్లో, కంపెనీలో ఉద్యోగం మానేసినప్పుడు లేదా కంపెనీని శాశ్వతంగా మూసివేసినప్పుడు పీఎఫ్ విత్‌డ్రాలో ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితే మీకు ఎదురైతే పాత కంపెనీలో చిక్కుకున్న మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలాంటి అరుదైన సందర్భాల్లో మీ పిఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

PAN card: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఈ చిన్న మిస్టేక్‌తో రూ.10,000 ఫైన్ కట్టాల్సి రావొచ్చు

Flipkart Big Billion Days: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.30,000 వరకు డిస్కౌంట్... ఫోన్ ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు

బ్యాంక్ కేవైసీతో విత్‌డ్రా అవకాశం


మీరు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారిన సందర్భంలోనే కాక మీ కంపెనీని షట్ డౌన్ అయిన సందర్భంలోనూ మీ పీఎఫ్ ఖాతా 36 నెలలు యాక్టివ్‌లోనే ఉంటుంది. మీరు పనిచేసిన కాలానికి గాను మీ పిఎఫ్‌పై వడ్డీని పొందుతారు. అయితే, 36 నెలల గడువు ముగిసిన తరువాత, మీ పిఎఫ్ ఖాతా ఇనాక్టివేట్ అవుతుంది. అయితే అలాంటి సందర్భంలో మీ క్లెయిమ్ పొందాలంటే మాత్రం మీ కంపెనీ ధృవీకణ తప్పనిసరి.

ఒకవేళ మీ కంపెనీని మూసివేస్తే మీ పీఎఫ్ ధృవీకరణకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అటువంటి సందర్భంలో మీ బ్యాంక్ కేవైసీ మీ పీఎఫ్‌కు రక్షణగా నిలుస్తుంది. సంస్థను మూసివేస్తే లేదా మీ పీఎఫ్‌ను ధృవీకరించడానికి ఎవరూ లేకపోతే బ్యాంక్ కేవైసీ ద్వారా మీ పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి గాను పాన్ కార్డ్, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, ఈఎస్ఐ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ కార్డు వంటి కేవైసీ పత్రాలను ఉపయోగించుకోవచ్చు. కేవైసీ ద్వారా మీ పీఎఫ్‌ను సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికిగాను అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. రూ.50 వేలకు మించిన పీఎఫ్ ఫండ్ కోసం అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అనుమతి తీసుకోవాలి. అయితే రూ.25 వేల లోపు ఫండ్ కోసం మాత్రం డీలింగ్స్ అసిస్టెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: BUSINESS NEWS, EPFO, Personal Finance

ఉత్తమ కథలు