SBI ATM: ఛార్జీలు పడకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయండి ఇలా

SBI Yono Cash | ఎన్నిసార్లైనా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అదనంగా ఛార్జీలేవీ చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకే మీరు కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్స్‌లోకి మారాలని కోరుతోంది ఎస్‌బీఐ.

news18-telugu
Updated: October 10, 2019, 4:06 PM IST
SBI ATM: ఛార్జీలు పడకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయండి ఇలా
SBI ATM: ఛార్జీలు పడకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఏటీఎం ఛార్జీలు... ఈ మాట వింటే సామాన్యుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఏ ఏటీఎంలో ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే ఎంతెంత ఛార్జీలు పడతాయో అని ఎప్పుడూ లెక్కలు వేస్తూనే ఉంటారు. బ్యాంకు ఇచ్చిన పరిమితికి మించి ఏటీఎంలో క్యాష్ డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించక తప్పదు. ఏ బ్యాంక్ అయినా ఈ ఛార్జీలు వసూలు చేయడంలో తక్కువేమీ కాదు. అన్ని బ్యాంకులూ కస్టమర్ల దగ్గర ఏటీఎం ఛార్జీలు వసూలు చేస్తూనే ఉంటాయి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలల్లో మీరు ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ్చు. ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐ అందిస్తున్న సరికొత్త సదుపాయం ఇది. కేవలం ఎస్‌బీఐ కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం. మరి ఛార్జీలు పడకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయడం ఎలాగో తెలుసుకోండి.



మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? అయితే మీరు యోనో క్యాష్ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా ఎన్నిసార్లైనా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అదనంగా ఛార్జీలేవీ చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకే మీరు కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్స్‌లోకి మారాలని కోరుతోంది ఎస్‌బీఐ. అంటే ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం అన్నమాట. మీ కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్స్‌ని మీరు ఎన్ని సార్లైనా చేసే అవకాశం కల్పిస్తోంది ఎస్‌బీఐ. ఎస్‌బీఐ యోనో యాప్‌తో ఇది సాధ్యం. మీరు యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. యాప్‌కు 6 అంకెల ఎంపిన్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత యోనో క్యాష్ పైన క్లిక్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏటీఎం కార్డు లేకపోయినా క్యాష్ ఎలా డ్రా చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రస్తుతం కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్‌కు ఎలాంటి ఛార్జీలు లేవు. రోజుకు రూ.20,000 వరకు డ్రా చేయొచ్చు. ఒక ట్రాన్సాక్షన్‌లో ఒకేసారి రూ.10,000 డ్రా చేయొచ్చు. మీరు యోనో క్యాష్ ద్వారా డబ్బులు డ్రా చేయాలనుకుంటే మాత్రం మీకు దగ్గర్లో యోనో క్యాష్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి.తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Aadhaar: ఆధార్ అప్‌డేట్ చేయించాలా? ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేయొచ్చు ఇలా

SBI Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... డబ్బులు లేకపోయినా షాపింగ్ చేయొచ్చు ఇలా

Post Office RD: మీకు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ గురించి తెలుసా? లాభాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: October 10, 2019, 4:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading