SBI IMPS: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఐఎంపీఎస్ వాడుకోండి ఇలా

SBI IMPS | ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు చాలా వేగంగా ట్రాన్స్‌ఫర్ అవుతాయి. స్మార్ట్‌ఫోన్ నుంచి కూడా ఈజీగా డబ్బులు పంపొచ్చు.

news18-telugu
Updated: August 15, 2019, 5:03 PM IST
SBI IMPS: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఐఎంపీఎస్ వాడుకోండి ఇలా
SBI IMPS: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఐఎంపీఎస్ వాడుకోండి ఇలా
news18-telugu
Updated: August 15, 2019, 5:03 PM IST
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? తరచూ లావాదేవీలు జరుపుతుంటారా? ఎవరికైనా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-IMPS ద్వారా చాలా సులువు. ఇటీవలే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌లో ఐఎంపీఎస్ ఛార్జీలను తొలగించింది ఎస్‌బీఐ. బ్రాంచ్‌లో కూడా రూ.1,000 వరకు ఐఎంపీఎస్ ఛార్జీలు లేవు. ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు చాలా వేగంగా ట్రాన్స్‌ఫర్ అవుతాయి. స్మార్ట్‌ఫోన్ నుంచి కూడా ఈజీగా డబ్బులు పంపొచ్చు. ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే IFSC లేదా MMID ఉండాలి.

SBI IMPS: ఎస్‌బీఐ ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు పంపండి ఇలా



ముందుగా మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో ఎస్‌బీఐలో లాగిన్ కావాలి.
తర్వాత పేమెంట్స్ ట్రాన్స్‌ఫర్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత IMPS Funds Transfer పైన క్లిక్ చేసి Fund Transfer ఓపెన్ చేయాలి.


పర్సన్ టూ పర్సన్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం MMID ఉపయోగించాలి.
Loading...
పర్సన్ టూ అకౌంట్ అయితే IFSC కోడ్ ఉపయోగించాలి.
బెన్ఫీషియరీ పేరు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లాంటివి ఎంటర్ చేయాలి.
ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
చివరగా Confirm పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేస్తే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు


ఇవి కూడా చదవండి:

Free ATM Transactions: ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ

Tata Sky: టాటా స్కై ఫ్లెక్సీ ప్లాన్‌తో క్యాష్‌బ్యాక్ ఆఫర్

LIC Paid-up: ఎల్ఐసీ ప్రీమియం కట్టలేకపోతున్నారా? పెయిడ్-అప్‌గా మార్చుకుంటే లాభాలివే
First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...