ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఉద్యోగులకు అనేక రకాల సేవలందిస్తుంది. ఖాతాదారులకు మంచి వడ్డీతో పాటు చాలా ప్రయోజనాలు అందిస్తుంది. అయితే, కొన్ని కారణాలతో ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారుతుంటారు. EPFO నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి ఒక సంస్థ నుండి మరొక సంస్థకు మారితే, కొత్త సభ్యునిగా చేరాల్సి ఉంటుంది. దీని కోసం పాత కంపెనీ పీఎఫ్ ఖాతా నుంచి నిష్రమణ కావాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో సంస్థపై ఆధారపడకుండా ఉద్యోగులే స్వయంగా తమ పీఎఫ్ అకౌంట్లో మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించింది ఈపీఎఫ్ఓ సంస్థ. ఉద్యోగం మానేసిన తర్వాత EPFO పోర్టల్‌లో వారి ఎగ్జిట్ తేదీని స్వయంగా అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఎగ్జిట్ తేదీని అప్డేట్ చేసుకోవడానికి ఉద్యోగి యూనిఫైడ్ పోర్టల్‌ను సందర్శించి UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి.. ఈ ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
PF Account: పీఎఫ్ అకౌంట్ నుంచి ఎగ్జిట్ అవండి ఇలా
ముందు యూనిఫైడ్ పోర్టల్ www.unifiedportal-mem.epfindia.gov.in ను సందర్శించండి.
UAN, పాస్వర్డ్, CAPTCHA ని ఎంటర్ చేయండి.
మేనేజ్లోకి వెళ్లి ఎగ్జిట్‌పై క్లిక్ చేయండి.
‘సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్’ ఆప్షన్‌లోని మీ పాత ‘పిఎఫ్ అకౌంట్ నంబర్’ను ఎంచుకోండి
‘ఎగ్జిట్ డేట్’, ‘ఎగ్జిట్ రీజన్’ ఎంటర్ చేయండి.
‘రిక్వెస్ట్ OTP’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ ఆధార్ రిజిస్టర్ నంబర్‌కు పంపిన OTP ని ఎంటర్ చేయండి.
మీరు కొత్త సంస్థలో చేరినప్పుడు మీ పాత కంపెనీలోని పీఎఫ్ అకౌంట్‌నే కొత్త కంపెనీకి బదిలీ చేయడం ఉత్తమం. పీఎఫ్ అకౌంట్ ఉండటం ద్వారా అధిక వడ్డీతో పాటు అనేక పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఉద్యోగుల సహకారం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద పన్ను నుండి మినహాయించబడింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.