హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌లో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయా? అప్‌డేట్ చేయండిలా

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌లో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయా? అప్‌డేట్ చేయండిలా

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌లో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయా? అప్‌డేట్ చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌లో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయా? అప్‌డేట్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

EPF Account Update | ఈపీఎఫ్ అకౌంట్‌లోని వివరాలను ఆన్‌లైన్‌లో సులువుగా అప్‌డేట్ చేయొచ్చు. ఈపీఎఫ్ అకౌంట్‌లో బ్యాంకు అకౌంట్ వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్‌లోని డబ్బును విత్‌డ్రా చేయడానికి బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉండాలి. లేకపోతే ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయడంలో సమస్యలు వస్తాయి. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను సరిచూసుకోవడంతో పాటు అకౌంట్‌లో మార్పులు ఉంటే అప్‌డేట్ చేయాలి. గతంలో ఈ వివరాలు అప్‌డేట్ చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో సింపుల్‌గా బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

IRCTC Bharat Darshan: 10 రోజుల టూర్‌కు రూ.10 వేలే ఖర్చు... విజయవాడ, వరంగల్ నుంచి భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్

Railway Helpline Number: అలర్ట్... ఆ రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ పనిచేయదు... కాల్ చేయాల్సిందే కొత్త నెంబర్‌కే

EPF Account: బ్యాంక్ అకౌంట్ నెంబర్ అప్‌డేట్ చేయండి ఇలా


ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్ ఓపెన్ చేయండి.

ఆ తర్వాత మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవండి.

ఆ తర్వాత manage సెక్షన్ పైన క్లిక్ చేయండి.

డ్రాప్ డౌన్ మెనూలో KYC పైన క్లిక్ చేయండి.

ఏ అకౌంట్ నెంబర్ అప్‌డేట్ అయి ఉందో ఓసారి చెక్ చేయండి.

ఇప్పుడు వాడుతున్న అకౌంట్ నెంబర్ ఉంటే మార్చాల్సిన అవసరం లేదు.

కొత్త అకౌంట్ నెంబర్ అప్‌డేట్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి.

మీ ఎంప్లాయర్ నుంచి అప్రూవల్ లభించిన తర్వాత కొత్త బ్యాంక్ అకౌంట్ నెంబర్ అప్‌డేట్ అవుతుంది.

మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌డేట్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.

Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఏదో 2 నిమిషాల్లో తెలుసుకోండిలా

EPFO: అకౌంట్‌లోకి వడ్డీ రిలీజ్ చేసిన ఈపీఎఫ్ఓ...మీ బ్యాలెన్స్ చెక్ చేయండిలా

ఇక ఈపీఎఫ్ఓ 2019-2020 ఆర్థిక సంవత్సరానికి చెందిన 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్ అకౌంట్లలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖాతాదారుల ఈపీఎఫ్ అకౌంట్లలో వడ్డీ క్రెడిట్ అవుతోంది. మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో వడ్డీ క్రెడిట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఓసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.

First published:

Tags: EPFO, Personal Finance

ఉత్తమ కథలు