HOME »NEWS »BUSINESS »know how to understand your credit card statement and know important terms ss

Credit Card Statement: మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఈ ఛార్జీలు చూసుకున్నారా?

Credit Card Statement: మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఈ ఛార్జీలు చూసుకున్నారా?
Credit Card Statement: మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఈ ఛార్జీలు చూసుకున్నారా? (ప్రతీకాత్మక చిత్రం)

Credit Card Statement | ఎప్పుడైనా మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ వివరంగా చూసుకున్నారా? అసలు స్టేట్‌మెంట్‌లో ఈ ఛార్జీలు ఉంటాయని మీకు తెలుసా?

  • Share this:
    క్రెడిట్ కార్డ్ బిల్ రాగానే పేమెంట్ చేయడం, మళ్లీ క్రెడిట్ కార్డ్ వాడుకోవడం, ఆ తర్వాత బిల్ చెల్లించడం... క్రెడిట్ కార్డ్ ఉన్నవారందరూ చేసేపని ఇదే. కానీ అసలు వచ్చిన బిల్లులో ఏఏ ఛార్జీలు ఉన్నాయి? సంబంధం లేని ఛార్జీలు కూడా చెల్లిస్తున్నామా? అసలు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఏముంది? అని చూసేవాళ్లు చాలా అరుదు. అసలు స్టేట్‌మెంట్ చూడకుండా బిల్లు చెల్లించేవారే ఎక్కువ. టోటల్ డ్యూ ఎంత, మినిమమ్ పేమెంట్ ఎంత అన్న నెంబర్స్ మాత్రమే చూసి మిగతా స్టేట్‌మెంట్ గురించి అస్సలు పట్టించుకోరు. కానీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో చాలా వివరాలు ఉంటాయి. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో మీరు ఎక్కడెక్కడ ఎంత షాపింగ్ చేశారు? ఎంత పేమెంట్స్ చేశారు? వాటికి అదనంగా చెల్లిస్తున్న ఛార్జీలు ఏమిటి? ఈఎంఐలు ఉన్నాయా? ఈఎంఐలపైన ఎంత ఛార్జీ చెల్లిస్తున్నారు? మీ క్రెడిట్ లిమిట్ ఎంత? ప్రస్తుతం బ్యాలెన్స్ ఎంత? ఇప్పటివరకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఎన్ని? ఇలాంటి వివరాలన్నీ ఉంటాయి. ఇవి మాత్రమే కాదు.... కొత్తగా మీ క్రెడిట్ కార్డ్ పైన ఏవైనా ఆఫర్స్ ఉన్నా స్టేట్‌మెంట్‌లో తెలుస్తుంది.

    అందుకే ప్రతీ నెల క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడం కన్నా ముందే ఓసారి స్టేట్‌మెంట్ చెక్ చేయాలని అంటుంటారు ఆర్థిక నిపుణులు. మీరు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ చూస్తే అందులో మీకు తెలియని ఛార్జీలు ఏవైనా ఉంటే కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అవసరమైతే ఆ ఛార్జీలను తొలగించమని అడగొచ్చు. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ చూడటం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. అసలు మీరు మీ క్రెడిట్ కార్డును ఎక్కువగా ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుస్తుంది. అవసరమైతే ఆ ఖర్చులు తగ్గించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో మీరు తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి.



    SBI IOCL Debit Card: ఇండియన్ ఆయిల్‌తో కలిసి డెబిట్ కార్డ్ లాంఛ్ చేసిన ఎస్‌బీఐ... బెనిఫిట్స్ ఇవే

    Important Deadlines: అలర్ట్... ఈ లాస్ట్ డేట్స్ గుర్తున్నాయా? ఒక్క రోజు లేట్ చేసినా చిక్కులు తప్పవు

    how to understand your credit card statement, credit card statement hdfc, how to check credit card statement online, what is a credit card statement, understanding a credit card statement, how to read credit card statement, credit card statement hdfc, credit card statement sbi, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ అంటే ఏంటీ, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ వివరాలు, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ ఎస్‌బీఐ, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ హెచ్‌డీఎఫ్‌సీ
    ప్రతీకాత్మక చిత్రం


    మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ జనరేట్ అయ్యే తేదీ మీకు తెలుసా? చాలామందికి ఈ విషయం తెలియదు. ప్రతీ నెల ఒకే రోజున మీ స్టేట్‌మెంట్ జనరేట్ అవుతుంది. స్టేట్‌మెంట్ జనరేట్ అయిన 15 నుంచి 20 రోజుల్లో బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్ బిల్లును ఏ తేదీలోగా చెల్లించాలో దాన్నే పేమెంట్ డ్యూ డేట్ అంటారు. తప్పనిసరిగా చివరి తేదీలోగా బిల్లు పేమెంట్ చేయాలి. లేదా మినిమమ్ పేమెంట్ అయినా చెల్లించాలి. మినిమమ్ పేమెంట్ బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. మీ మొత్తం బిల్లులో కనీసం 5 శాతం మినిమమ్ పేమెంట్ ఉండొచ్చు. మినిమమ్ పేమెంట్ చెల్లించినా మీ ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌పై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

    బిల్ పేమెంట్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ ద్వారా అయితే చివరి తేదీ రోజున చెల్లించినా పర్లేదు. కానీ చెక్ పేమెంట్స్ చేస్తే మాత్రం కనీసం రెండు మూడు రోజుల ముందే చెల్లించాలి. క్లియరెన్స్ కోసం సమయం పడుతుంది. ఆలస్యం చేస్తే లేట్ పేమెంట్ ఛార్జీలు చెల్లించక తప్పదు. కొన్ని బ్యాంకులు బిల్ పేమెంట్ కోసం రెండు మూడు రోజులు గ్రేస్ పీరియడ్ ఇస్తాయి. మీ కార్డుకు గ్రేస్ పీరియడ్ వర్తిస్తుందో లేదో చూడాలి. గ్రేస్ పీరియడ్ ఉంటే అప్పట్లోగా బిల్ చెల్లించాలి. గ్రేస్ పీరియడ్ లోగా పేమెంట్ చేయకపోతే పెనాల్టీ తప్పదు. అయితే గ్రేస్ పీరియడ్‌లో బిల్లు చెల్లిస్తే వడ్డీ వసూలు చేస్తుంది బ్యాంకు. ఈ వడ్డీ నెక్స్ట్‌ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తుంది.

    Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారు? 2 నిమిషాల్లో తెలుసుకోండిలా

    EPF Money: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

    how to understand your credit card statement, credit card statement hdfc, how to check credit card statement online, what is a credit card statement, understanding a credit card statement, how to read credit card statement, credit card statement hdfc, credit card statement sbi, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ అంటే ఏంటీ, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ వివరాలు, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ ఎస్‌బీఐ, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ హెచ్‌డీఎఫ్‌సీ
    ప్రతీకాత్మక చిత్రం


    మీ టోటల్ డ్యూ అమౌంట్‌లో గత నెలలో మీరు చేసిన పేమెంట్స్, లేట్ పేమెంట్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు, ట్రాన్సాక్షన్ ఛార్జీలు, క్యాష్ అడ్వాన్స్ ఛార్జీలు లాంటివి ఉంటాయి. యాన్యువల్ ఫీజు కూడా ఇందులోనే ఉంటుంది. అందుకే బిల్లు మొత్తం చెల్లించేముందు మీకు సంబంధంలేని ఛార్జీలు ఉన్నాయేమో ఓసారి చూసుకోండి. మీరు మీ క్రెడిట్ కార్డును ఎక్కడ వాడారన్న వివరాలు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఉంటాయి. మీకు సంబంధం లేకుండా ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టైతే వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.

    ఇక మీ క్రెడిట్ లిమిట్ ఎంత ఉందో ఓసారి చూసుకోవాలి. రివార్డ్ పాయింట్స్ వివరాలు కూడా స్టేట్‌మెంట్‌లో ఉంటాయి. క్రెడిట్ కార్డ్ నియమ నిబంధనల్లో ఏవైనా మార్పులు ఉంటే స్టేట్‌మెంట్‌లో వివరిస్తాయి బ్యాంకులు. వాటిని చదవడం మర్చిపోవద్దు.
    Published by:Santhosh Kumar S
    First published:January 09, 2021, 12:58 IST