హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: కేవలం రూ.15 వేలతో వ్యాపారం... ట్రెండింగ్‌లో బిజినెస్ ఐడియా

Business Idea: కేవలం రూ.15 వేలతో వ్యాపారం... ట్రెండింగ్‌లో బిజినెస్ ఐడియా

Business Idea | ప్రతీ నెలా వచ్చే జీతం చాలట్లేదా? తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? కేవలం రూ.15,000 పెట్టుబడితో ఓ చిన్న వ్యాపారం (Small Business) ప్రారంభించొచ్చు. ఆ బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకోండి.

  బిజినెస్ చేయడానికి లక్షలకు లక్షల రూపాయలు అవసరం లేదు. ఓ మంచి ఐడియా (Business Idea) ఉంటే చాలు... తక్కువ పెట్టుబడితో కూడా వ్యాపారం (Business with low investment) చేయొచ్చు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ప్రతీ ఒక్కరిలో రెండో ఆదాయం పొందాలన్న ఆలోచన పెరిగిపోయింది. అంటే ఉద్యోగం చేస్తున్నవారు... చిన్నగా ఓ వ్యాపారం ప్రారంభించడం, లేదా ఇప్పటికే వ్యాపారం చేస్తున్నవారు మరో బిజినెస్‌లోకి ఎంటర్ కావడం మామూలైపోయింది. అయితే ఏ వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి కావాలి. తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. అలాంటిదే ఈ బిజినెస్ ఐడియా కూడా.

  కరోనా వైరస్ మహమ్మారితో అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది. ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. సహజ ఉత్పత్తులు, ఔషధ మొక్కలకు మంచి డిమాండ్ ఉంది. ఔషధ మొక్కల్ని పెంచి అమ్మడం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు. పెట్టుబడి చాలా తక్కువ. ప్రస్తుతం చాలా కంపెనీలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఔషధ మొక్కల సాగును చేయిస్తున్నాయి. కేవలం రూ.15,000 పెట్టుబడితో కూడా ఈ వ్యాపారం ప్రారంభించొచ్చు.

  EPF Account: పీఎఫ్ అకౌంట్‌లో పేరు తప్పుగా ఉందా? సింపుల్‌గా ఇలా సరిచేయండి

  తులసీ, అలోవెరా, ఆర్టిమీసియా, లికో రైస్ లాంటి ఔషధ మొక్కలు సాగు చేయొచ్చు. వీటిలో కొన్నింటిని చిన్న తొట్టిలో పెంచొచ్చు. తులసిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని తెలుసు. తులసిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. తులసి మొక్కల్ని ఒక హెక్టార్‌లో తులసి సాగు చేయడానికి రూ.15,000 పెట్టుబడి చాలు. మూడు నెలల తర్వాత రూ.3 లక్షల వరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తులసి మొక్కలతో పాటు తులసి గింజలకు కూడా మంచి డిమాండ్ ఉంది.

  ఆయుర్వేద మందులు తయారు చేసే కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తుంటాయి. పతంజలి, డాబర్, వైద్యనాథ్ లాంటి కంపెనీలు ఔషధ గుణాలు ఉన్న మొక్కల్ని కొంటుంటాయి. అలాంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని వారికి సప్లై చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కల్ని పెంచడానికి శిక్షణ కూడా తీసుకోవచ్చు. ఔత్సాహికులకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమెటిక్ ప్లాంట్ (CIMAP) దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇస్తోంది. శిక్షణతో పాటు ఎలా మార్కెటింగ్ చేయాలన్న అవగాహన కూడా లభిస్తుంది.

  LIC IPO Alert: ఎల్ఐసీ పాలసీ ఉందా? ఐపీఓలో కోటా కావాలంటే ఈ వివరాలు అప్‌డేట్ చేయండి

  ఆయుర్వేద మందులు తయారు చేసే కంపెనీలకు అమ్మడం మాత్రమే కాదు... లైసెన్స్ తీసుకొని సొంతగా ఓ బ్రాండ్ క్రియేట్ చేసి ఈ ప్రొడక్ట్స్ అమ్మొచ్చు. అయితే ఇందుకోసం కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. మార్కెటింగ్ చేయడానికి టీమ్ ఉండాలి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా అమ్మొచ్చు.

  First published:

  Tags: Business, Business Ideas, Business plan, Online business, Small business

  ఉత్తమ కథలు