ఏదైనా చిన్న వ్యాపారం చేయాలన్నా ఈ రోజుల్లో కనీసం రూ.10 లక్షల పెట్టుబడి అవసరం. ఇంకాస్త పెద్ద బిజినెస్ చేయాలంటే పెట్టుబడి రూ.50 లక్షల వరకు వెళ్తుంది. తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు (Low Investment Business) కొన్ని మాత్రమే ఉంటాయి. ఇలాంటి వ్యాపారాలను బిజినెస్ లోన్ తీసుకొని ప్రారంభించవచ్చు. మరి మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మినీ ఆయిల్ మిల్ బిజినెస్ (Mini Oil Mill Business) గురించి ఆలోచించవచ్చు. వంట నూనెలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. పండుగల సమయంలో వంట నూనెల అమ్మకాలు కూడా పెరుగుతుంటాయి. కాబట్టి ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియా అనే చెప్పొచ్చు.
తక్కువ పెట్టుబడితో మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేయొచ్చు. గతంలో విత్తనాల నుంచి నూనె తీయడానికి పెద్దపెద్ద మెషీన్లు అవసరం అయ్యేవి. కానీ ఇప్పుడు చిన్న మెషీన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ మెషీన్ల సాయంతో మినీ ఆయిల్ మిల్ సెటప్ చేయొచ్చు. చిన్న గ్రామం అయినా, పట్టణం అయినా ఆయిల్ మిల్ ఏర్పాటు చేయొచ్చు. ఓ చిన్న గదిలో కూడా మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేయొచ్చు.
PM Kisan: అదే జరిగితే రైతుల ఖాతాల్లోకి రూ.12,000... అన్నదాతలకు పండగే
వంటనూనెల తయారీ బిజినెస్ ఏర్పాటు చేయాలంటే మీకు ఆయిల్ ఎక్స్‌పెల్లర్ మెషీన్ కావాలి. చిన్న గదిలో ఈ మెషీన్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఆవాలు, పల్లీలు, నువ్వుల నూనెను ఈ మెషీన్ల ద్వారా తీయొచ్చు. తక్కువ పెట్టుబడి కాబట్టి మీడియం సైజ్ ఆయిల్ ఎక్స్‌పెల్లర్ మెషీన్ ఏర్పాటు తీసుకుంటే చాలు. మీడియం సైజ్ ఆయిల్ ఎక్స్‌పెల్లర్ మెషీన్‌కు రూ.2 లక్షలు ఖర్చవుతుంది. రా మెటీరియల్, ప్యాకేజింగ్ మెటీరియల్ కోసం మరో రూ.2 లక్షలు అవసరం.
కేవలం రూ.4 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. గ్రామంలో మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేస్తే ఓ లాభం ఉంటుంది. ఆవాలు, పల్లీలు, ఇతర గింజల్ని నేరుగా రైతుల నుంచి సేకరించవచ్చు. బయట మార్కెట్ కంటే రైతుల దగ్గర కాస్త తక్కువ ధరకే ముడిసరుకు లభిస్తుంది. కాబట్టి పంటను నేరుగా రైతుల దగ్గర కొంటారు కాబట్టి ముడిసరుకుకు పెట్టుబడి తక్కువ అవుతుంది.
LIC Policy: త్వరపడండి... కోటి రూపాయల బెనిఫిట్ ఇచ్చే ఈ పాలసీ ఇక ఉండదు
పల్లీ నూనె, ఆవాల నూనె, నువ్వుల నూనెకు నిత్యం డిమాండ్ ఉంటుంది. లైసెన్స్ తీసుకొని ప్యాకేజింగ్ చేస్తే ఆన్‌లైన్‌లో కూడా అమ్మొచ్చు. లేదా నేరుగా షాపుల్లో అమ్మొచ్చు. ఇటీవల రిఫైండ్ ఆయిల్ కన్నా పల్లీ నూనె, ఆవాల నూనె, నువ్వుల నూనెకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యాపారం ద్వారా కనీసం 20 శాతం లాభం పొందొచ్చని అంచనా. ఎక్కువగా మార్కెటింగ్ చేసి, ఎక్కువ సేల్స్ చేస్తే ప్రతీ నెలా ఎక్కువ లాభం వస్తుంది. బిజినెస్ బాగా నడిస్తే మినీ ఆయిల్ మిల్ కోసం పెట్టిన పెట్టుబడి ఆరు నెలల నుంచి ఒక ఏడాదిలో కవర్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Business Ideas, Business Loan, Cooking oil, Edible Oil, Small business