హోమ్ /వార్తలు /బిజినెస్ /

Residential Property: రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ అమ్మకంపై పన్ను ఆదా చేయడం ఎలాగో తెలుసుకోండి..!

Residential Property: రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ అమ్మకంపై పన్ను ఆదా చేయడం ఎలాగో తెలుసుకోండి..!

Know how to save full tax on sale of Residential Property

Know how to save full tax on sale of Residential Property

Residential Property: ఒక నివాస గృహాన్ని విక్రయించి, లాంగ్‌ టర్మ్‌ గెయిన్స్‌ని సంపాదిస్తే, కొత్త నివాస గృహాన్ని కొనుగోలు చేయడంలో మూలధన రాబడిని పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేయవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇల్లు (House) లేదా ప్రాపర్టీ (Property)ని కొనుగోలు చేసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల తర్వాత (అంటే 24 నెలలు) తిరిగి విక్రయిస్తే, లాభం ఏదైనా ఉంటే.. దాన్ని లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌(LTCG)గా పరిగణిస్తారు. లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌పై 20 శాతం ఫ్లాట్ రేటుతో పన్ను విధిస్తారు. అంతే కాకుండా ఇండెక్సేషన్ బెనిఫిట్స్‌ను క్లెయిమ్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే మొత్తం పన్ను (Tax)ను కూడా ఆదా చేయడానికి వివిధ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆపర్చునిటీలను అందిస్తుంది. లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌పై పన్ను భారాన్ని తగ్గించడానికి లేదా తొలగించడానికి, కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి ఆదాయ పన్ను (Income Tax) చట్టంలోని సెక్షన్ 54 నిబంధనలను ఉపయోగించవచ్చు. పన్ను ఆదా చేసే పెట్టుబడి ఎంపికలు u/s 54 గురించి క్లియర్ వ్యవస్థాపకుడు, సీఈవో అర్చిత్ గుప్తా ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌కు తెలియజేసిన వివరాలు ఇవే.* కొత్త ఇంటిని కొనండి లేదా నిర్మించండి
ఒక నివాస గృహాన్ని విక్రయించి, లాంగ్‌ టర్మ్‌ గెయిన్స్‌ని సంపాదిస్తే, కొత్త నివాస గృహాన్ని కొనుగోలు చేయడంలో మూలధన రాబడిని పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేయవచ్చు. సెక్షన్ 54 ప్రకారం అటువంటి లాంగ్‌ టర్మ్‌ గెయిన్స్‌కి ఎగ్జమ్షన్‌ క్లెయిమ్ చేయవచ్చు. మొత్తం మూలధనాన్ని కొత్త రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీని కొనుగోలు చేయడం లేదా నిర్మించడం రీడైరెక్ట్‌ చేస్తే మూలధన లాభాలకు పూర్తిగా ఎగ్జమ్షన్‌ ఉంటుంది.
* టైం లిమిట్స్‌
అయితే పాత ప్రాపర్టీని విక్రయించే ముందు ఏడాదిలోపు కొత్త ఇంటిని స్వాధీనం చేసుకోవాలని చట్టం పేర్కొంది. పాత ప్రాపర్టీని విక్రయించిన తేదీ నుంచి రెండేళ్లలోపు దానిని పొందితే ఎగ్జమ్షన్‌ పొందే అవకాశం ఉంటుంది. పాత ప్రాపర్టీని విక్రయించిన తేదీ నుంచి మూడు సంవత్సరాలలోపు నివాస గృహాన్ని నిర్మిస్తే, పేర్కొన్న సెక్షన్ కింద ఎగ్జమ్షన్‌కు వీలుంటుంది.


* రెండు ఇళ్లను కొనుగోలు చేసే నిబంధన
అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 నుంచి, రెండు రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలలో పెట్టుబడి పెడితే సెక్షన్ 54 కింద ఎగ్జమ్షన్‌ క్లెయిమ్ చేయవచ్చు. దీనికి ముందు, కేవలం ఒక ఇంటిని కొనుగోలు చేయడానికి మాత్రమే ఎగ్జమ్షన్‌ వీలయ్యేది. లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ రూ.2 కోట్లకు మించకపోతే రెండు రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలలో చేసిన పెట్టుబడికి ఎగ్జమ్షన్‌ లభిస్తుంది. పన్ను చెల్లింపుదారు జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ ఎంపికను వినియోగించుకోవడానికి అర్హులు.
ఇది కూడా చదవండి :  పెట్టుబడుల నిర్ణయాల్లో యువత చేసే 5 ప్రధాన తప్పులు ఇవే.. నిపుణుల సూచనలు మీ కోసమే..
* క్యాపిటల్ గెయిన్ ఖాతాలో డిపాజిట్ చేయడం
రిటర్న్ ఫైలింగ్ గడువు తేదీకి ముందు లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ని పెట్టుబడి పెట్టలేకపోతే, సూచించిన ఆదాయ పన్ను నిబంధనలలో పేర్కొన్న కాలక్రమాల గడువు ముగియకపోతే, LTCG/విక్రయ ఆదాయాన్ని క్యాపిటల్‌ గెయిన్‌ అకౌంట్లో ఉంచవచ్చు. ఈ అకౌంట్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్, 1988లో తెలియజేసిన ఇతర బ్యాంకులలో ఓపెన్‌ చేయవచ్చు. ఏదైనా దీర్ఘకాలిక మూలధన నష్టాన్ని ఎదుర్కొని ఉంటే, పన్ను ఆదా కోసం లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్స్‌ గెయిన్స్‌కి వ్యతిరేకంగా దాన్ని సర్దుబాటు చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: House, Income tax, Tax payers, TAX SAVING

ఉత్తమ కథలు