HOME »NEWS »BUSINESS »know how to place order for aadhaar pvc card and how to check aadhaar pvc card status ss

Aadhaar PVC Card: ఏటీఎం కార్డు సైజులో ఆధార్ కార్డ్... ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోండి ఇలా

Aadhaar PVC Card: ఏటీఎం కార్డు సైజులో ఆధార్ కార్డ్... ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోండి ఇలా
Aadhaar PVC Card: ఏటీఎం కార్డు సైజులో ఆధార్ కార్డ్... ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar PVC Card | మీరు ఆధార్ కార్డ్ జేబులో మెయింటైన్ చేస్తుంటారా? అయితే ఆధార్ పీవీసీ కార్డ్ ప్రింట్ చేయించుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    ఆధార్ కార్డు మందంగా ఉన్న పేపర్‌పై ప్రింట్ చేసి ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఆ కార్డును కట్ చేసి ల్యామినేట్ చేసి జేబులో పెట్టుకోవడం అలవాటుగా మారిపోయింది. ఆధార్ కార్డును ఐడీ కార్డుగా, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించొచ్చు కాబట్టి జేబులో, పర్సులో మెయింటైన్ చేస్తుంటారు. ప్రజలు ఆధార్ కార్డును మెయింటైన్ చేస్తున్న తీరు చూసి ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆధార్ పీవీసీ కార్డును రూపొందించింది. ఇది క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డులా ఉంటుంది. జేబులో, పర్సులో పెట్టుకోవచ్చు. డిజిటల్ సంతకం, క్యూఆర్ సెక్యూరిటీ కోడ్, డెమొగ్రఫిక్ డీటైల్స్‌ లాంటి ఆధార్ పీవీసీ కార్డు ఫుల్ సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఆధార్ కార్డ్ హోల్డర్స్ ఎవరైనా ఆధార్ పీవీసీ కార్డ్ తీసుకోవచ్చు. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్, రెసిడెంట్ పోర్టల్‌లో 12 అంకెల ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్-UID లేదా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్- VID లేదా 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ఐడీ-EID ఎంటర్ చేసి ఆధార్ పీవీసీ కార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం రూ.50 చెల్లించాలి. ఇందులోనే జీఎస్‌టీ, స్పీడ్ పోస్ట్ ఛార్జీలు ఉంటాయి. మరి ఆధార్ పీవీసీ కార్డ్ ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకోండి.

    Gold Price Today: ఈరోజు బంగారం రేట్ ఎంత? ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే తెలుస్తుంది



    SBI ATM PIN: ఏటీఎం కార్డ్ పిన్ మర్చిపోయారా? ఒక్క కాల్‌తో కొత్త పిన్ జనరేట్ చేయొచ్చు


    Aadhaar PVC Card: ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ చేయండి ఇలా


    ముందుగా https://uidai.gov.in/ హోమ్ పేజీ ఓపెన్ చేయాలి.
    My Aadhaar సెక్షన్‌లో Order Aadhaar PVC Card ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
    మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
    ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
    మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
    మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.
    టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించి సబ్మిట్ చేయాలి.
    ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
    పేమెంట్ విజయవంతంగా పూర్తైన తర్వాత ఆర్డర్ ప్లేస్ అవుతుంది.
    ఐదు వర్కింగ్ డేస్‌లో మీ అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్‌లో ఆధార్ పీవీసీ కార్డ్ వస్తుంది.

    Gold: అద్భుతమైన అవకాశం... మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం

    IRCTC PNR Status: ట్రైన్‌లో మీ బెర్త్ స్టేటస్ వాట్సప్‌లో తెలుసుకోవచ్చు ఇలా

    Aadhaar PVC Card: ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ స్టేటస్ చెక్ చేయండి ఇలా


    ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ చేసిన తర్వాత స్టేటస్ చెక్ చేయొచ్చు.
    ఇందుకోసం https://uidai.gov.in/ హోమ్ పేజీ ఓపెన్ చేయాలి.
    My Aadhaar సెక్షన్‌లో Check Aadhaar PVC Card Status ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
    మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
    ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
    మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
    మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.
    టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించి సబ్మిట్ చేయాలి.
    ఆధార్ పీవీసీ కార్డ్ ప్రింట్ స్టేటస్ తెలుస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:December 25, 2020, 17:37 IST

    टॉप स्टोरीज