ఆధార్ కార్డ్... ఇప్పుడు ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. అందుకే ఆధార్ కార్డును ఎప్పుడు బ్యాగులో మెయింటైన్ చేసేవారు ఉంటారు. ప్రజల అవసరాలను గుర్తించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఏటీఎం కార్డ్ సైజ్‌లో ఆధార్ కార్డును ముద్రించి ఇస్తోంది. దీన్నే ఆధార్ పీవీసీ కార్డ్ (Aadhaar PVC Card) అంటారు. ఆధార్ కార్డ్ కలర్ జిరాక్స్ చేయించి, కార్డులా ల్యామినేషన్ చేయిస్తే ఆ కార్డుకు విలువ ఉండదు. ఆ కార్డు ఎక్కడా చెల్లదు. అదే ఆధార్ పీవీసీ కార్డ్ ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డులా పనిచేస్తుంది. అందుకే ఎప్పుడూ తమ జేబులో ఆధార్ కార్డ్ ఉండాలనుకునేవారు ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ చేయొచ్చు.
ఒరిజినల్ ఆధార్ కార్డుపై ఉన్నట్టే ఆధార్ పీవీసీ కార్డుపైనా క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, ఘోస్ట్ ఇమేజ్, ఇష్యూ డేట్, ప్రింట్ డేట్, ఎంబాస్డ్ ఆధార్ లోగో లాంటివి ఉంటాయి. ఆధార్ హోల్డర్స్ యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్లో సింపుల్ స్టెప్స్‌తో ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ (Aadhaar PVC Card Order) చేయొచ్చు. రూ.50 నామినల్ ఛార్జీ చెల్లిస్తే చాలు, పీవీసీ ఆధార్ కార్డ్ ఇంటి అడ్రస్‌కు వచ్చేస్తుంది. ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ ఎలా ఆర్డర్ చేయాలో ఈ కింది స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.
IRCTC Ticket Booking: వాయిస్ మెసేజ్‌తో ట్రైన్ టికెట్ బుకింగ్... స్టెప్స్ ఇవే
Step 1- ముందుగా https://uidai.gov.in లేదా https://resident.uidai.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- Order Aadhaar Card పైన క్లిక్ చేయాలి.
Step 3- 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేదా 28 అంకెల ఎన్రోల్మెంట్ ఐడీ ఎంటర్ చేయాలి.
Step 4- సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.
Step 5- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.
Step 6- ఓటీపీ సబ్మిట్ చేసి ఆధార్ వివరాలు చెక్ చేసుకోవాలి.
Step 7- పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేసి పీవీసీ కార్డ్ ఆర్డర్ చేయాలి.
SBI Alert: ఎస్బీఐ పేరుతో ఈ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త
Step 1- ముందుగా https://uidai.gov.in లేదా https://resident.uidai.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- Order Aadhaar Card పైన క్లిక్ చేయాలి.
Step 3- 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేదా 28 అంకెల ఎన్రోల్మెంట్ ఐడీ ఎంటర్ చేయాలి.
Step 4- సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.
Step 5- If you do not have a registered mobile number బాక్స్ టిక్ చేయాలి.
Step 6- ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 7- ఆ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.
Step 8- ఓటీపీ సబ్మిట్ చేసి ఆధార్ వివరాలు చెక్ చేసుకోవాలి.
Step 9- పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేసి పీవీసీ కార్డ్ ఆర్డర్ చేయాలి.
ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ చేసిన తర్వాత SRN జనరేట్ అవుతుంది. ఈ నెంబర్‌తో మీ ఆర్డర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసిన వారం రోజుల్లో ఆధార్ పీవీసీ కార్డ్ మీ ఇంటి అడ్రస్‌కు వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, AADHAR, UIDAI