• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • KNOW HOW TO OPEN SUKANYA SAMRIDDHI YOJANA ACCOUNT IN STATE BANK OF INDIA SBI SS

Sukanya Samriddhi Yojana: ఎస్‌బీఐలో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయండి ఇలా

Sukanya Samriddhi Yojana: ఎస్‌బీఐలో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయండి ఇలా

Sukanya Samriddhi Yojana: ఎస్‌బీఐలో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Sukanya Samriddhi Yojana Account | మీరు మీ అమ్మాయి పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI లో ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    భారత ప్రభుత్వం అందిస్తున్న పాపులర్ పొదుపు పథకాల్లో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన ఓ వరం. ఆడపిల్లల ఉన్నత విద్య, పెళ్లి ఖర్చుల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ముందునుంచే పొదుపు చేయడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI లో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సులువు. ఎస్‌బీఐలో బ్యాంకింగ్ సేవలతో పాటు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఎస్‌బీఐలో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోండి.

    SBI Sukanya Samriddhi Yojana Account: సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయండిలా


    ఎస్‌బీఐలో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయడానికి దగ్గర్లోని బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ బ్యాంకు సిబ్బందిని కలిస్తే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అప్లికేషన్ ఫామ్ లభిస్తుంది. దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్‌తో పాటు బర్త్ సర్టిఫికెట్ జతచేయాలి. వీటితో పాటు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. మీ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత అకౌంట్ ఓపెన్ అవుతుంది. కేవలం ఒక అమ్మాయి పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేయడం సాధ్యమవుతుంది. ఒకవేళ కవలలుగా ఇద్దరు అమ్మాయిలు పుడితే ఇద్దరి పేర్ల మీద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అందుకు తగ్గ ప్రూఫ్స్ చూపించాలి.

    PM Kisan Scheme: ఈ చిన్న మిస్టేక్‌తో మీ అకౌంట్‌లోకి రూ.6000 రావు... సరిదిద్దుకోండి ఇలా

    EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌లో మొబైల్ నెంబర్, ఇమెయిల్ అప్‌డేట్ చేయండి ఇలా

    SBI Sukanya Samriddhi Yojana Account: సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ మెయింటైన్ చేయడం ఎలా


    మీకు ఎస్‌బీఐలో అకౌంట్ లేకపోయినా ఎస్‌బీఐలో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అమ్మాయి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అందుకు తగ్గ ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. అమ్మాయి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అమ్మాయికి 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు అకౌంట్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమ్మాయి స్వయంగా అకౌంట్ ఆపరేట్ చేయొచ్చు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు.

    SBI Sukanya Samriddhi Yojana Account: సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌లో ఎంత డిపాజిట్ చేయాలి?


    ఎస్‌బీఐలో ఓపెన్ చేసిన సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ బ్యాలెన్స్ వివరాలను ఆన్‌లైన్‌లో చెక్ చేయొచ్చు. ఇందుకోసం అకౌంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ బ్యాంకు నుంచి తీసుకోవాలి. ఆ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయిన తర్వాత బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు.

    LIC Jeevan Umang Plan: రిటైర్మెంట్ నాటికి రూ.94 లక్షలు కావాలా? ఈ ఎల్ఐసీ ప్లాన్ మీకోసమే

    SBI Mutual Fund: నెలకు రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు... ఎస్‌బీఐ కొత్త మ్యూచువల్ ఫండ్‌తో లాభాలివే

    SBI Sukanya Samriddhi Yojana Account: సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌లో డబ్బులు ఎలా డ్రా చేయాలి?


    సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌లో అమ్మాయికి 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డబ్బులు జమ చేయాలి. అమ్మాయికి 21 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత డబ్బులు డ్రా చేయొచ్చు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత లేదా 10వ తరగతి పాస్ అయిన తర్వాత అప్పటివరకు జమ చేసిన మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేయొచ్చు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6% వడ్డీ చెల్లిస్తోంది ప్రభుత్వం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: