KNOW HOW TO OPEN PRADHAN MANTRI JAN DHAN YOJANA ACCOUNT TO AVAIL GOVERNMENT SCHEME BENEFITS SS
Jan Dhan Account: జన్ ధన్ ఖాతాతో ప్రభుత్వ పథకాలు పొందొచ్చు... అకౌంట్ ఓపెన్ చేయండి ఇలా
Jan Dhan Account: జన్ ధన్ ఖాతాతో ప్రభుత్వ పథకాలు పొందొచ్చు... అకౌంట్ ఓపెన్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
Pradhan Mantri Jan Dhan Yojana | ఇటీవల ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం లబ్ధిదారులందరికీ జన్ ధన్ ఖాతాల్లోకి డబ్బుల్ని పంపింది కేంద్ర ప్రభుత్వం. జన్ ధన్ ఖాతాతో అనేక లాభాలు ఉన్నాయి.
మీకు జన్ ధన్ అకౌంట్ ఉందా? ఇంకా అకౌంట్ తీసుకోలేదా? ప్రభుత్వ పథకాలకు జన్ ధన్ అకౌంట్ ముఖ్యమైపోయింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పలు పథకాలకు సంబంధించిన డబ్బులు నేరుగా లబ్ధిదారుల జన్ ధన్ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. పీఎం కిసాన్, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లాంటి పథకాలకు చెందిన డబ్బుల్ని ప్రభుత్వం జన్ ధన్ ఖాతాల్లోకే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. జన్ ధన్ ఖాతా ఉంటే ప్రభుత్వ పథకాలు పొందడం సులువవుతుంది. పథకాలు మాత్రమే కాదు రుణాలు, సబ్సిడీ, ఇన్స్యూరెన్స్, పెన్షన్ లాంటివాటికి కూడా జన్ ధన్ అకౌంట్ అవసరమే. మీరు ఏ బ్యాంకులో అయినా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన-PMJDY ఖాతా తెరవచ్చు. 20 నుంచి 65 ఏళ్ల వయస్సు గల వారెవరైనా జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మరి జన్ ధన్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోండి.
ముందుగా మీరు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన-PMJDY వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లాంటి ఐడీ, అడ్రస్ ప్రూఫ్స్ జత చేయాలి. ఆ దరఖాస్తు ఫామ్‌ను సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌లో సబ్మిట్ చేయాలి. మీ వివరాలన్నీ వెరిఫై చేసిన తర్వాత బ్యాంకు మీకు జన్ ధన్ ఖాతాను ఇస్తుంది. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే ఖాతాదారులు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అకౌంట్‌పై చెక్ బుక్స్ కావాలంటే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు వర్తిస్తాయి.
ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాదారులకు ఉచితంగా బేసిక్ రూపే కార్డును జారీ చేస్తుంది బ్యాంకు. ఏ బ్యాంకు బ్రాంచ్ లేదా ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. డబ్బులు డిపాజిట్ చేయడానికి లిమిట్ లేదు. నెలకు నాలుగు సార్లు ఉచితంగా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు విత్‌డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాలి. ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లాంటి సేవల్ని ఉపయోగించుకోవచ్చు. జన్ ధన్ ఖాతాదారులకు ఉచితంగా రూ.1 లక్ష ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. దీంతో పాటు రూ.5,000 ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఉంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.