పాన్ కార్డ్... ఆర్థిక లావాదేవీలు జరిపేవారందరికీ ఓ అవసరం. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పర్మనెంట్ అకౌంట్ నెంబర్‌నే పాన్ అంటారు. 10 క్యారెక్టర్స్‌తో ఉండే ఆల్ఫాన్యూమరిక్ నెంబర్ ప్రతీ ఒక్కరికీ విభిన్నంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు చాలావరకు పాన్ నెంబర్ అవసరం. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే పాన్ కార్డు తప్పనిసరి. ఒక్కసారి పాన్ కార్డ్ తీసుకున్నాక పాన్ నెంబర్‌ను మార్చలేరు. అయితే అందులోని వివరాలను మాత్రం అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. అందులో అడ్రస్ మార్పు ఒకటి. మరి మీరు కూడా మీ పాన్ కార్డు అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారా? గతంలో ఉన్న అడ్రస్ కాకుండా కొత్త అడ్రస్ అప్డేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Read this:
After Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...
ఆఫ్‌లైన్‌లో పాన్ కార్డులో అడ్రస్ ఎలా మార్చుకోవాలి?
పాన్ కార్డులో వివరాలు అప్డేట్ చేసేందుకు 'కొత్త పాన్ కార్డ్ లేదా పాన్ కరెక్షన్' ఫామ్ నింపాలి.
ఏఏ వివరాలు అప్డేట్ చేయాలనుకుంటున్నారో అన్నీ రాయాలి.
కొత్త అడ్రస్‌ను తప్పులు లేకుండా రాయాలి.మీరు ఏ అడ్రస్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి.
దరఖాస్తును మీకు దగ్గర్లో ఉన్న PAN కేంద్రంలో ఇవ్వాలి.
ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రింట్ అవుట్ తీసుకొని, సంతకం చేసి, ఈ కింది అడ్రస్‌కు పంపాలి.
Income Tax PAN services unit (Managed by NSDL e-Governance Infrastructure Limited),
5th Floor, Mantri Sterling, Plot No. 341, Survey No. 997/8,
Model Colony, Near Deep Bungalow Chowk, Pune - 411 016.
Read this:
SBI clerk Jobs: ఎస్బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...

ఆన్లైన్లో పాన్ కార్డులో అడ్రస్ ఎలా మార్చుకోవాలి?
NSDL అధికారిక వెబ్సైట్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ఓపెన్ చేయాలి.
ఆన్లైన్ పాన్ అప్లికేషన్ పేజీలో 'Application Type' పైన క్లిక్ చేసి 'Changes or Correction in existing PAN Data/Reprint of PAN Card' ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
ఈ కేటగిరీలో డ్రాప్‌డౌన్‌లో 'Individual' పైన క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాలు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి.
కొత్త పేజీలో మీకు టోకెన్ నెంబర్ వస్తుంది.
ఇ-సైన్ ద్వారా స్కాన్ చేసిన ఇమేజెస్‌ని అప్లోడ్ చేయాలి.
పర్సనల్ డీటైల్స్ పేజీలో అడ్రస్ బాక్స్ టిక్ చేయాలి.
కొత్త అడ్రస్‌ను తప్పులు లేకుండా రాయాలి.
మీరు ఏ అడ్రస్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి.
తర్వాతి స్టెప్‌లో దరఖాస్తును సరిచూసుకొని పేమెంట్ చేయాలి.
చివరి స్టెప్‌లో అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ జెనరేట్ అవుతుంది.
ఆ స్లిప్ ప్రింటవుట్ తీసుకోవాలి.
అప్లికేషన్ ప్రింట్ తీసి NSDL e-Gov office అడ్రస్‌కు పంపాలి.
Photos: రూ.83,000 కోట్ల ఎయిర్పోర్ట్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు
BEL Jobs: బీఈఎల్‌లో 150 అప్రెంటీస్ పోస్టులు
IRCTC: రైలు టికెట్లో తప్పులుంటే ఇలా సరిచేసుకోండి