SBI YONO: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉందా? యోనో యాప్‌తో లింక్ చేస్తే లభించే సేవలివే

SBI YONO App | యోనో యాప్‌తో మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించొచ్చు. మీ అవసరాలకు తగ్గట్టుగా క్రెడిట్ కార్డుల్ని రికమండ్ చేస్తుంది ఎస్‌బీఐ. కొత్త క్రెడిట్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

news18-telugu
Updated: April 8, 2019, 2:54 PM IST
SBI YONO: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉందా? యోనో యాప్‌తో లింక్ చేస్తే లభించే సేవలివే
SBI YONO: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉందా? యోనో యాప్‌తో లింక్ చేస్తే లభించే సేవలివే
news18-telugu
Updated: April 8, 2019, 2:54 PM IST
మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు ఉందా? ఎస్‌బీఐకి చెందిన యోనో యాప్‌తో లింక్ చేస్తే సరికొత్త సేవలు లభిస్తాయి. ‘You Only Need One’ పేరుతో YONO యాప్ రూపొందించింది ఎస్‌బీఐ. ప్రస్తుతం ఉన్న కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్లు ఈ యాప్ ఉపయోగించొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్స్ మాత్రమే కాదు... ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుకు సంబంధించిన సేవలు కూడా పొందొచ్చు. ఇప్పటికే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారు యోనో యాప్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉంటే యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ క్రెడిట్ కార్డ్ నెంబర్‌ను యోనో యాప్‌తో లింక్ చేయాలి.

Read this: Fixed Deposit: టాప్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే...

మీ క్రెడిట్ కార్డ్ రిజిస్టర్ చేసుకొని ఉంటే ఈ స్టెప్స్ ఫాలో కావాలి



ముందుగా మీ స్మార్ట్‌ఫోన్లో యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
పేజీ చివర్లో ‘Go to your account’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.


మీ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
మెయిన్ పేజీలో ‘My Relationships’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
తర్వాత ‘Link SBI Credit Card’ ఆప్షన్‌ పైన క్లిక్ చేయండి.
‘Send OTP’ బటన్‌పై క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేస్తే క్రెడిట్ కార్డ్ యోనో యాప్‌తో లింక్ అవుతుంది.

Read this: JIO Plans: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తారా? రూ.200 లోపు జియో ప్లాన్స్ ఇవే...

క్రెడిట్ కార్డ్ ముందుగా రిజిస్టర్ చేయకపోతే ఈ స్టెప్స్ ఫాలో కావాలి


ముందుగా మీ ఫోన్‌లో యోనో యాప్ ఓపెన్ చేయాలి.
'My Relationships' క్లిక్ చేసి ' Link SBI Credit Card’ ఆప్షన్ ఎంచుకోండి.
‘Register’ క్లిక్ చేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ నెంబర్, సీవీవీ, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ‘Submit’ పైన క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్‌ నెంబర్‌‌తో పాటు ఇమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తన తర్వాత మళ్లీ యోనో యాప్ ఓపెన్ చేయాలి.
మెయిన్ పేజీలో ‘My Relationships’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
తర్వాత ‘Link SBI Credit Card’ ఆప్షన్‌ పైన క్లిక్ చేయండి.
‘Send OTP’ బటన్‌పై క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

యోనో యాప్‌తో మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించొచ్చు. మీ అవసరాలకు తగ్గట్టుగా క్రెడిట్ కార్డుల్ని రికమండ్ చేస్తుంది ఎస్‌బీఐ. కొత్త క్రెడిట్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అప్లికేషన్, క్రెడిట్ కార్డ్ పేమెంట్, రివార్డ్ పాయింట్స్ ట్రాక్ చేయొచ్చు.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్

Election 2019: మీ ఓటు ఉందా... లేదా? ఇలా చెక్ చేసుకోండి

Honor Gala Festival: హానర్ గాలా ఫెస్టివల్‌లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు
First published: April 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...