Aadhaar-Ration card linking: ఆధార్‌ నెంబర్‌ను రేషన్ కార్డుతో లింక్ చేయాలా... ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్రాసెస్ ఇదే

Aadhaar-Ration card linking: ఆధార్‌ నెంబర్‌ను రేషన్ కార్డుతో లింక్ చేయాలా... ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్రాసెస్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar-Ration card linking | మీ రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేశారా? వన్ నేషన్ వన్ రేషన్ (One Nation One Ration) స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.

  • Share this:
దేశవ్యాప్తంగా 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' (One Nation One Ration) పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రజలు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. తక్కువ ధరకే మంచి ఆహారాన్ని పొందవచ్చు. అయితే రేషన్ కార్డును ఆధార్‌కి లింక్ చేయడం (Aadhaar-Ration card linking) ద్వారా మరిన్ని మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అయినా రేషన్ పొందవచ్చు. లబ్ధిదారులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో రేషన్ కార్డును ఆధార్‌కు లింక్ చేయవచ్చు.

ఆన్‌లైన్ ప్రక్రియ


ఆన్‌లైన్ విధానంలో ఆధార్‌కు రేషన్‌ కార్డును లింక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ అయిన uidai.gov.in ఓపెన్ చేయాలి. వెబ్ పేజీలో కనిపించే ‘స్టార్ట్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. కొత్త పేజీ కనిపిస్తుంది. ఇందులో అడిగే చిరునామా, రాష్ట్రం, ఫోన్ నంబర్ వంటి వివరాలను నింపాలి. అనంతరం 'రేషన్ కార్డ్ బెనిఫిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తరువాత మీ ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. వెబ్ పేజీలో OTP నింపిన తర్వాత.. ఈ ప్రక్రియ పూర్తయినట్లు మెసేజ్ వస్తుంది. అనంతరం ఆధార్ ధ్రువీకరణ పూర్తయ్యి, రేషన్ కార్డుతో లింక్ అవుతుంది.

myAadhaar Portal: ఆధార్ కొత్త వెబ్‌సైట్‌లో లభించే 11 రకాల సేవలు ఇవే

ఆఫ్‌లైన్‌ ప్రక్రియ


రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటోను రేషన్ కార్డు కేంద్రంలో అందించడం ద్వారా లబ్ధిదారులు ఆఫ్‌లైన్ విధానంలో ఆధార్‌కు రేషన్ కార్డును అనుసంధానం చేయవచ్చు. రేషన్ కార్డు కేంద్రంలో ఆధార్ డేటా బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ కూడా చేయవచ్చు. సంబంధిత విభాగానికి ఈ అప్లికేషన్‌ను పంపిస్తారు. అధికారులు అన్ని వివరాలను పరిశీలించిన తరువాత.. ఆధార్‌కు రేషన్ కార్డు అనుసంధానం పూర్తయినట్లు లబ్ధిదారులకు మెసేజ్ వస్తుంది.

Aadhaar Card Update: తెలుగులో మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయండి ఇలా

SMS ద్వారా కూడా రేషన్ కార్డును ఆధార్‌కు లింక్ చేయవచ్చు. ఇందుకు లబ్ధిదారుడు UID SEED అని టైప్ చేసి స్టేట్ షార్ట్ కోర్డ్ టైప్ చేసి ప్రోగ్రామ్ కోడ్ టైప్ చేసి స్కీమ్ ఐడీ టైప్ చేసి ఆధార్ నెంబర్ టైప్ చేసి 51969 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు: UID SEED MH POSC 9876543 123478789012 అని టైప్ చేయాల్సి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published: