ఒకప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ (Bank Account) నుంచి మరొక అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ (Money Transfer) చేయాలంటే పెద్ద తతంగమే ఉండేది. డబ్బులు తీసుకొని బ్యాంకుకు వెళ్లి, ఓ ఫామ్ తీసుకొని, ఎవరికి డబ్బులు పంపాలో వారి అకౌంట్ వివరాలన్నీ ఫామ్‌లో పూర్తి చేసి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే, ఆ డబ్బులు కొన్ని గంటల తర్వాత లేదా ఒకట్రెండు రోజుల్లో అవతలివారి అకౌంట్‌లో జమ అయ్యేవి. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం గంటల నుంచి క్షణాల్లోకి వచ్చేసింది. కొన్ని సెకండ్లలో డబ్బుల్ని అవతలివారి అకౌంట్‌లోకి ఈజీగా పంపేస్తున్నారు. టెక్నాలజీ మహిమ ఇదంతా. టెక్నాలజీతో ఎంత సౌలభ్యం ఉందో అంత రిస్క్ కూడా ఉంది. ఒకరికి పంపాలనుకొని మరొకరికి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాయి.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అంటే యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పేమెంట్స్ చేయడం, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం ఈజీ అయిపోయింది. అయితే ఇటీవల కాలంలో రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక అకౌంట్‌కు బదులు మరో అకౌంట్‌కు పొరపాటున డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగిస్తున్నవారు ఎప్పుడో ఒకప్పుడు పొరపాటుగా ఇలాంటి పేమెంట్స్ చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్బంలో ఏం చేయాలో తెలుసుకోండి.
LIC Policy: ఎల్ఐసీ పాలసీతో లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం, డిజిటల్ సేవల ద్వారా అనుకోకుండా, పొరపాటుగా ఏవైనా లావాదేవీలు జరిపితే, బాధిత వ్యక్తి మొదట ఏ యాప్ ఉపయోగించి ట్రాన్సాక్షన్ చేస్తారో, వారికి ఫిర్యాదు చేయాలి. ఉదాహరణకు గూగుల్ పే ద్వారా ఒకరికి డబ్బులు పంపబోయి పొరపాటున మరొకరికి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే మొదట గూగుల్ పేకు ఫిర్యాదు చేయాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పోర్టల్‌లో కూడా కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. మనీ ట్రాన్స్‌ఫర్‌తో పాటు మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌కి కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఎలా కంప్లైంట్ చేయాలో స్టెప్స్ తెలుసుకోండి.
Step 1- ముందుగా https://www.npci.org.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో టాప్ రైట్‌లో Get in Touch పైన క్లిక్ చేసి UPI Complaint పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత Complaint సెక్షన్‌లో Transaction పైన క్లిక్ చేయాలి.
Step 4- Person to Person లేదా Person to Merchant లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 5- Incorrectly transferred to another account ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
SBI Account: మీ ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.147.5 డెబిట్ అయ్యాయా? కారణమిదే
ఇలా కంప్లైంట్ చేసిన తర్వాత మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కంప్లైంట్స్ ద్వారా ఫలితం లేకపోతే ఓసారి బ్యాంకును సంప్రదించాలి. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ లేదా అంబుడ్స్‌మన్ ఫర్ డిజిటల్ కంప్లైంట్స్‌లో కంప్లైంట్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google pay, Paytm, Personal Finance, PhonePe, Reserve Bank of India, UPI