హోమ్ /వార్తలు /బిజినెస్ /

Personal Finance: మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

Personal Finance: మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

సేవింగ్స్ చేయడానికి చాలా మార్గాలున్నాయి. ఉదాహరణకు మీ అమ్మాయి వయస్సు 21 ఏళ్లు వచ్చేసరికి మీ లక్ష్యం రూ.1 కోటి అయితే మీకు మూడు ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలు కనిపిస్తాయి. సుకన్య సమృద్ధి యోజన, యూలిప్స్, మ్యూచువల్ ఫండ్స్... వేర్వేరు మార్గాల్లో సేవింగ్స్ చేయొచ్చు.

ఇంకా చదవండి ...

  సేవింగ్స్ లేదా పొదుపు... ఇటీవల ప్రజల్లో అవగాహన పెరుగుతున్న అంశాలివి. సంపాదిస్తున్నాం కదా అని ఖర్చుపెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆలోచన పెరుగుతోంది. అందుకే డబ్బు పొదుపు చేయాలన్న స్పృహ పెరుగుతోంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇంటినిర్మాణం... ఇలా రకరకాల అవసరాల కోసం డబ్బు పొదుపు చేస్తున్నారు. అయితే అమ్మాయి పెళ్లిని దృష్టిలో పెట్టుకొనే చాలామంది సేవింగ్స్ చేస్తున్నారు. ఏ దాంట్లో పెట్టుబడి పెడితే లాభం ఎక్కువ? రిస్క్ ఎక్కువ? తెలుసుకోండి.

  Read this: Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

  సేవింగ్స్ చేయడానికి చాలా మార్గాలున్నాయి. ఉదాహరణకు మీ అమ్మాయి వయస్సు 21 ఏళ్లు వచ్చేసరికి మీ లక్ష్యం రూ.1 కోటి అయితే మీకు మూడు ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలు కనిపిస్తాయి. సుకన్య సమృద్ధి యోజన, యూలిప్స్, మ్యూచువల్ ఫండ్స్... వేర్వేరు మార్గాల్లో సేవింగ్స్ చేయొచ్చు.

  sukanya samriddhi yojana details, sukanya samriddhi yojana chart, sukanya samriddhi yojana benefits, sukanya samriddhi yojana interest rate, best savings schemes, sukanya samriddhi yojana vs mutual funds, best mutual funds, ulips, elss, సుకన్య సమృద్ధి యోజన, మ్యూచువల్ ఫండ్స్, యూలిప్స్, ఈఎల్ఎస్ఎస్

  సుకన్య సమృద్ధి యోజన

  ఇటీవల సుకన్య సమృద్ధి యోజన పథకానికి డిమాండ్ పెరుగుతోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, పన్ను మినహాయింపులు, సావరిన్ గ్యారెంటీ ఉండటమే ఇందుకు కారణం. ఇందులో ఏడాదికి రూ.1,50,000 కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టలేరు. ప్రస్తుతం 8.5 శాతం వడ్డీ రేటు ఉంది. అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఏటా రూ.1,50,000 చొప్పున 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే అమ్మాయికి 21 ఏళ్లు నిండేసరికి సుమారు రూ.75,00,000 రిటర్న్స్ వస్తాయి. అయితే మీరు అనుకున్న రూ.1 కోటి లక్ష్యం మాత్రం చేరుకోలేరు.

  Read this: WhatsApp Group: వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయాలంటే మీ పర్మిషన్ తప్పనిసరి

  sukanya samriddhi yojana details, sukanya samriddhi yojana chart, sukanya samriddhi yojana benefits, sukanya samriddhi yojana interest rate, best savings schemes, sukanya samriddhi yojana vs mutual funds, best mutual funds, ulips, elss, సుకన్య సమృద్ధి యోజన, మ్యూచువల్ ఫండ్స్, యూలిప్స్, ఈఎల్ఎస్ఎస్

  యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్(యూలిప్)

  ఇన్స్యూరెన్స్‌తో పాటు వచ్చే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ ఇది. అయితే ఈక్విటీలో పెట్టుబడులకు మార్కెట్ రిస్కు ఉంటుంది. అయితే ఇన్స్యూరెన్స్ రూపంలో అదనంగా సెక్యూరిటీ ఉంటుంది. యూలిప్ పెట్టుబడులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. యూలిప్ ద్వారా 9 శాతం లాంగ్ టర్మ్ రిటర్న్స్ వస్తాయని అంచనా. ఈ లెక్కన మీ అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఏడాదికి రూ.1,86,493 చొప్పున 20 ఏళ్లు పెట్టుబడి పెడితే రూ.1 కోటి పొందొచ్చు.

  Read this: PMSYM Scheme: మీ జీతం రూ.15 వేల కన్నా తక్కువా? ఈ పెన్షన్ స్కీమ్ మీ కోసమే...

  sukanya samriddhi yojana details, sukanya samriddhi yojana chart, sukanya samriddhi yojana benefits, sukanya samriddhi yojana interest rate, best savings schemes, sukanya samriddhi yojana vs mutual funds, best mutual funds, ulips, elss, సుకన్య సమృద్ధి యోజన, మ్యూచువల్ ఫండ్స్, యూలిప్స్, ఈఎల్ఎస్ఎస్

  మ్యూచువల్ ఫండ్స్

  ఇటీవల మ్యూచువల్ ఫండ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఇందులో కూడా మార్కెట్ రిస్క్ తప్పదు. అయితే లాంగ్ టర్మ్ పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయన్నది మార్కెట్ నిపుణుల అంచనా. ఇందులో ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. 10 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. సగటున 12 శాతం రిటర్న్స్ అనుకున్నా మీరు నెలకు రూ.10 వేల చొప్పున 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మీ లక్ష్యం రూ.1 కోటి చేరుకోవచ్చు.

  అయితే ఏ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అయినా, సేవింగ్స్ స్కీమ్ అయినా మార్కెట్ రిస్క్, ద్రవ్యోల్బణం, భవిష్యత్తులో పెరిగే ఖర్చులు, ధరల్ని దృష్టిలోపెట్టుకోవడం మంచిది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి.

  Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి  ఇవి కూడా చదవండి:

  Business Idea: రూ.1 లక్ష పెట్టుబడితో నెలకు రూ.14 వేల ఆదాయం

  ఎల్ఐసీ నుంచి మీకు రావాల్సిన డబ్బులు బ్లాక్ అయ్యాయా? కారణాలు ఇవే...

  First published:

  Tags: Income tax, Mutual Funds, Personal Finance, Save Girl Child, Save Money, Sukanya samriddhi yojana, TAX SAVING

  ఉత్తమ కథలు