ఏటీఎం పిన్ మర్చిపోవడం మామూలే. ఓ నెల రోజులు ఏటీఎం వాడకపోతే పిన్ మర్చిపోతుంటారు. రెగ్యులర్‌గా ఏటీఎం కార్డు వాడేవారికి ఈ సమస్య ఉండదు. పిన్ గుర్తుంటుంది. కానీ ఎప్పుడో ఓసారి ఏటీఎం కార్డు వాడేవారు పిన్ మర్చిపోవడం సాధారణమే. రెండుమూడు ఏటీఎం కార్డులు వాడేవారు కూడా పిన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. కొత్త పిన్ జనరేట్ చేయడం గతంలో కొద్దిగా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి పిన్ జనరేట్ చేయడం చాలా సులువు. మీ ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐవీఆర్, ఎస్ఎంఎస్ ద్వారా సులువుగా ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI గ్రీన్ పిన్ పేరుతో ప్రచారం చేస్తోంది. ఎస్బీఐ కస్టమర్లు సులువుగా పిన్ జనరేట్ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఈజీ స్టెప్స్‌తో ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే ఐవీఆర్ సిస్టమ్ ద్వారా ఏటీఎం పిన్ జనరేట్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి.
ఎస్బీఐ కస్టమర్లు ఐవీఆర్ సిస్టమ్ ద్వారా ఏటీఎం పిన్ జనరేట్ చేయడానికి 1800 112 211 లేదా 1800 425 3800 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలి. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ల నుంచే కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటీఎం డెబిట్ కార్డు సేవల కోసం 2 ప్రెస్ చేయాలి. ఆ తర్వాత పిన్ జనరేషన్ కోసం 1 ప్రెస్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేసినట్టైతే 1 ప్రెస్ చేయాలి. లేదా ఏజెంట్‌తో మాట్లాడటానికి 2 ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీ ఏటీఎం కార్డులోని చివరి 5 అంకెల్ని ఎంటర్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన ఐదు అంకెల్ని కన్ఫామ్ చేసేందుకు 1 ప్రెస్ చేయాలి. ఏటీఎం కార్డులోని చివరి ఐదు అంకెల్ని రీ ఎంటర్ చేసేందుకు 2 ప్రెస్ చేయాలి. ఇక మీ అకౌంట్ నెంబర్లోని చివరి 5 అంకెల్ని ఎంటర్ చేయాలి. కన్ఫామ్ చేసేందుకు 1 ప్రెస్ చేయాలి. రీ ఎంటర్ చేసేందుకు 2 ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీ పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. మీ గ్రీన్ పిన్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన గ్రీన్ పిన్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. మీ ఏటీఎం పిన్ ఎవరికీ చెప్పకూడదన్న విషయం గుర్తుంచుకోండి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.