Bamboo Farming: వెదురు పంటతో లక్షల్లో ఆదాయం... ఆ ఐడియా ఇదే

Bamboo Business | వెదురు సాగు పెరిగితే స్థానికంగానే ఫర్నీచర్ తయారీ పెరుగుతుంది. తద్వారా చైనా నుంచి దిగుమతులు తగ్గించుకోవచ్చు. ఇటీవల వెదురుతో ఇళ్లను నిర్మిస్తున్నారు. హస్తకళల్లోనూ వెదురుకు డిమాండ్ పెరుగుతోంది.

news18-telugu
Updated: June 21, 2019, 3:30 PM IST
Bamboo Farming: వెదురు పంటతో లక్షల్లో ఆదాయం... ఆ ఐడియా ఇదే
Bamboo Business: వెదురు పంటతో లక్షల్లో ఆదాయం... ఆ ఐడియా ఇదే
news18-telugu
Updated: June 21, 2019, 3:30 PM IST
రైతుల సంక్షేమం కోసం కొత్తకొత్త పథకాలు తీసుకొస్తున్న మోదీ ప్రభుత్వం... గతేడాది నేషనల్ బాంబూ మిషన్ ప్రారంభించింది. వెదురు పంటతో ఆదాయమార్గాలను పెంచుకునే అవకాశం కల్పిస్తోంది. వాస్తవానికి ఫారెస్ట్ చట్టాలు వెదురు వ్యవసాయానికి వర్తించవు. అయితే గత ప్రభుత్వాలు కఠినంగా ఉండటంతో వెదురు వ్యవసాయంపై దృష్టిపెట్టిన రైతులు తక్కువ. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం నిబంధనల్ని మార్చింది. అడవుల్లో ఉన్న వెదురు చెట్లకు మాత్రమే చట్టాలు వర్తింపజేసి ప్రైవేట్ భూమిని మినహాయించింది. నేషనల్ బాంబూ మిషన్ ఏర్పాటు చేసింది. అంతేకాదు... రైతులకు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది. ఒక వెదురు మొక్క నాటితే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.120 సాయం లభిస్తుంది. ఈ విధంగా వెదురు రైతులకు లాభాలు పెంచుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం.

వెదురు సాగును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే నేషనల్ బాంబూ మిషన్ ఏర్పాటు చేసింది. ప్రతీ రాష్ట్రంలో మిషన్‌కు ఓ డైరెక్టర్ ఉన్నారు. వ్యవసాయ, అటవీ, పారిశ్రామిక శాఖలకు చెందిన అధికారులు ఈ మిషన్‌లో ఉంటారు. వెదురు సాగు దగ్గర్నుంచి మార్కెట్ చేసుకునేవరకు కావాల్సిన సాయాన్ని అందిస్తారు.
అల్కా భార్గవ, కేంద్ర వ్యవసాయ శాఖ అడిషనల్ సెక్రెటరీ


వెదురును మూడునాలుగేళ్ల పాటు పెంచాల్సి ఉంటుంది. నాలుగో ఏట చెట్లను నరకొచ్చు. వెదురును ఫర్నీచర్ తయారీకి ఉపయోగించొచ్చు. ప్రస్తుతం చైనా నుంచి ఫర్నీచర్ దిగుమతి చేసుకుంటున్నాం. వెదురు సాగు పెరిగితే స్థానికంగానే ఫర్నీచర్ తయారీ పెరుగుతుంది. తద్వారా చైనా నుంచి దిగుమతులు తగ్గించుకోవచ్చు. ఇటీవల వెదురుతో ఇళ్లను నిర్మిస్తున్నారు. హస్తకళల్లోనూ వెదురుకు డిమాండ్ పెరుగుతోంది. ఒక వెదురు మొక్కను మూడేళ్లు పెంచడానికి రూ.240 ఖర్చవుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.120 ఆర్థిక సాయం అందుతుంది. ఒక హెక్టార్‌లో 1500 నుంచి 2500 వరకు వెదురు మొక్కల్ని నాటొచ్చు. నాలుగేళ్లు సాగు చేస్తే హెక్టార్‌కు రూ.3 నుంచి రూ.3.5 లక్షల ఆదాయం వస్తుందని అంచనా. వెదురు సాగుకు కావాల్సిన సాయం కోసం జిల్లాలోని నోడల్ ఆఫీసర్‌ను సంప్రదించాలి.



Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్


ఇవి కూడా చదవండి:
Loading...
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి దుబాయ్ టూర్... ప్యాకేజీ వివరాలివే

Tata Sky: టాటా స్కై నుంచి కొత్త ప్లాన్స్... వివరాలివే

Scholarship: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి ఎంబీఏ స్కాలర్‌షిప్
First published: June 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...