హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Download: ఆధార్ నెంబర్‌తో కార్డు డౌన్‌లోడ్ చేయండి ఇలా...

Aadhaar Download: ఆధార్ నెంబర్‌తో కార్డు డౌన్‌లోడ్ చేయండి ఇలా...

Aadhaar Download: ఆధార్ నెంబర్‌తో కార్డు డౌన్‌లోడ్ చేయండి ఇలా...
(image: UIDAI)

Aadhaar Download: ఆధార్ నెంబర్‌తో కార్డు డౌన్‌లోడ్ చేయండి ఇలా... (image: UIDAI)

Aadhaar Download | జస్ట్ మీ ఆధార్ నెంబర్ తెలిస్తే చాలు... ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయడం సులువే. UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేసి ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయొచ్చు.

  ఆధార్ కార్డ్... చాలా సందర్భాల్లో అవసరమయ్యే ముఖ్యమైన డాక్యుమెంట్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI జారీ చేసి ఈ కార్డు ముఖ్యమైన ఐడీ ప్రూఫ్‌గా మారిపోయింది. అయితే ప్రతీ సందర్భంలో ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లడం కుదరదు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆధార్ అవసరమైతే కంగారుపడుతుంటారు. ఒకవేళ పొరపాటున ఆధార్ కార్డును ఎక్కడైనా పారేసుకుంటే టెన్షన్ అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడా టెన్షన్ అవసరమే లేదు. మీరు ఆధార్ కార్డును ఎప్పుడైనా, ఎక్కడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి చాలా మార్గాలున్నాయి. జస్ట్ మీ ఆధార్ నెంబర్ తెలిస్తే చాలు... ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయడం సులువే. UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేసి ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయొచ్చు. అయితే ఎన్‌రోల్‌మెంట్ సమయంలో మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసి ఉండాలి. మరి ఆధార్ నెంబర్‌తో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

  Aadhaar Download: ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయండి ఇలా...


  ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి.

  హోమ్ పేజీలో Download Aadhaar లింక్ పైన క్లిక్ చేయండి.

  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Aadhaar number or EID or virtual ID అనే మూడు ఆప్షన్లు ఉంటాయి.

  వాటిలో I have Aadhaar number ఆప్షన్ ఎంచుకోండి.

  మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.

  మీరు మాస్క్ ఆధార్ ఆప్షన్ ఎంచుకుంటే కార్డులో మొత్తం నెంబర్లు కాకుండా చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.

  వెరిఫికేషన్ కోసం క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.

  Send OTP పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

  ఓటీపీ ఎంటర్ చేసి నియమనిబంధల్ని అంగీకరిస్తూ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.

  మీ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.

  డౌన్‌లోడ్ అయిన ఆధార్ కార్డ్ ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

  ఆధార్ కార్డులో మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.

  Apple Watch: యాపిల్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా?

  ఇవి కూడా చదవండి:

  Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టివా వచ్చేసింది... ధర ఎంతో తెలుసా?

  SBI SMS Alerts: ఎస్‌బీఐ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావట్లేదా? ఇలా చేయండి

  IRCTC: రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్‌ బుక్ చేయండి ఇలా...

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Aadhaar Card, AADHAR, UIDAI

  ఉత్తమ కథలు