ఆధార్ కార్డ్... ప్రతీ ఒక్కరికి అవసరమైన డాక్యుమెంట్. బ్యాంకులో ఖాతా తెరవడం దగ్గర్నుంచి ప్రభుత్వ పథకాలు పొందడం వరకు ప్రతీ చోటా ఆధార్ కార్డు అవసరం అవుతోంది. ఆధార్ కార్డు ఎప్పుడూ పాకెట్లో పెట్టుకునే అలవాటు అందరికీ ఉండదు. ఎక్కడైనా ఆధార్ కార్డు అవసరం అయినప్పుడు కంగారుపడుతుంటారు. ఎప్పుడు ఎక్కడ ఆధార్ కార్డు అవసరమైనా సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం కొన్ని స్టెప్స్‌తో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయాలంటే ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి అని అనుకుంటారు. కానీ మొబైల్ నెంబర్ లేకపోయినా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయొచ్చు. అయితే కొన్ని అవసరాలకు ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. అందుకే మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయండి. ఇప్పటివరకు ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే ఎలా చేయాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
Aadhaar Card Download: ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయండి ఇలా
ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత Order Aadhaar Reprint ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.
My Mobile number is not registered ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసే ఆప్షన్ వస్తుంది.
ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయాలి.
Terms and Conditions ఆప్షన్ సెలెక్ట్ చేసి Submit చేయాలి.
ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత Preview Aadhaar Letter పైన క్లిక్ చేయాలి.
పేమెంట్ చేసి ఇ-ఆధార్ డౌన్లోడ్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.