e-PAN Card: ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా...

e-PAN card download | ఇప్పటికే పాన్ కార్డులు ఉన్నవారు ఇ-పాన్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం నామమాత్రపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసే ప్రతీసారి ట్యాక్సులతో కలిపి రూ.8.26 చెల్లించాలి.

news18-telugu
Updated: July 21, 2019, 11:16 AM IST
e-PAN Card: ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా...
e-PAN Card: ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 21, 2019, 11:16 AM IST
పాన్ కార్డ్... ఆర్థిక వ్యవహారాలకు అవసరమైన డాక్యుమెంట్. అయితే పాన్ కార్డ్ ఎప్పుడూ దగ్గరే ఉంచుకోవడం అందరికీ అలవాటు ఉండదు. ఎప్పుడైనా ఎక్కడైనా పాన్ కార్డ్ అవసరమైతే ఏం చేయాలో తోచదు. ఇక ఏ టెన్షన్ అవసరం లేదు. మీరు ఇ-ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్నట్టుగానే ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజిటైజేషన్‌ను ప్రమోట్ చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ... ఎలక్ట్రానిక్ పాన్ కార్డుల్ని జారీ చేస్తుంది. వాటినే ఇ-పాన్ కార్డులు అంటారు. ఇ-పాన్ కార్డు కూడా ఫిజికల్ పాన్ కార్డులాగే ఉంటుంది. ఇ-పాన్ కార్డుపై పేరు, ఫోటో, తల్లి లేదా తండ్రి పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలన్నీ ఉంటాయి. ఇ-పాన్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఫిజికల్ పాన్ కార్డుపైన క్యూఆర్ కోడ్ ఉండదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ వివరాలు తెలుస్తాయి. ఏదైనా ప్రూఫ్ లేదా వెరిఫికేషన్ కోసం మీరు ఇ-పాన్ కార్డ్ కూడా సబ్మిట్ చేయొచ్చు.

ఫిజికల్ పాన్ కార్డులు ఉన్నవారంతా ఇ-పాన్ కార్డులు తీసుకోవచ్చు. కొత్తగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసినవాళ్లు మాత్రమే కాదు... ఇప్పటికే పాన్ కార్డులు ఉన్నవాళ్లు కూడా ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. NSDL లేదా UTITSL వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే... దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత వారి ఇమెయిల్ ఐడీకి ఇ-పాన్ కార్డ్ కాపీ వస్తుంది. ఇ-పాన్ కార్డును ఉచితంగానే అందిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. ఫిజికల్ పాన్ కార్డుకు మాత్రం రూ.107 చెల్లించాలి. NSDL లేదా UTITSL వెబ్‌సైట్‌లో నుంచి కూడా ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు... పాన్ కార్డ్ ప్రాసెసింగ్ సెంటర్లల్లో దరఖాస్తు చేసిన 10 నిమిషాల్లోపే ఇ-పాన్ కార్డులు జారీ చేసేలా వ్యవస్థ రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఆధార్ నుంచి ఇ-కేవైసీ సేకరిస్తుంది. ఇక ఇప్పటికే పాన్ కార్డులు ఉన్నవారు ఇ-పాన్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం నామమాత్రపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసే ప్రతీసారి ట్యాక్సులతో కలిపి రూ.8.26 చెల్లించాలి.

ఇ-పాన్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?



ముందుగా NSDL లేదా UTITSL వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇ-పాన్ కార్డు డౌన్లోడ్ చేయడానికి అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ తప్పనిసరి. అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. 'download PDF' ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.



Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:
Loading...
LIC Policy: ఎల్ఐసీ పాలసీ సరెండర్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

Save Battery: మీ ఫోన్ బ్యాటరీ ఆదా చేయడానికి ఈ టిప్స్ పాటించండి

Aadhaar-PAN: ఆధార్, పాన్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉన్నాయా? ఇలా చేయండి
First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...