హోమ్ /వార్తలు /business /

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా? ఇలా చేస్తే చలాన్ కట్టాల్సిన అవసరం లేదు

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా? ఇలా చేస్తే చలాన్ కట్టాల్సిన అవసరం లేదు

Driving Licence | మీకు పదేపదే డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయే అలవాటు ఉందా? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు చలాన్లు (Traffic Challan) కట్టాల్సి వస్తోందా? ఈ పనిచేస్తే మీరు డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయినా చలాన్ కట్టాల్సిన అవసరం ఉండదు.

ఇంకా చదవండి ...

    డ్యూటీకి బయల్దేరేప్పుడు హడావుడిగా పర్సు మర్చిపోవడం, ఆ పర్సులోనే డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) ఉండటం, ట్రాఫిక్ పోలీసుల చెకింగ్‌లో డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయామన్న సంగతి గుర్తుకు రావడం వాహనదారులకు ఎదురయ్యే అనుభవాలే. రోడ్డుపైన డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (Registration Certificate) తప్పనిసరి. టూవీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా ఈ డాక్యుమెంట్స్ ఉండాల్సిందే. ట్రాఫిక్ పోలీసులకు, రవాణా శాఖ అధికారులకు తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ చూపించడం కూడా తప్పనిసరి. మరి మీరు పదేపదే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ మర్చిపోతున్నారా? ఏం పర్లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ చూపిస్తే చాలు. అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ ఫోటో తీసి చూపిస్తే కుదరదు. ప్రభుత్వం అధికారికంగా అనుమతించే పద్ధతిలోనే చూపించాల్సి ఉంటుంది.

    మోటార్ వెహికిల్ యాక్ట్ 1989 లో సవరణ ప్రకారం వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ ఫిజికల్ కాపీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. డిజిటల్ కాపీ కూడా చూపించొచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఎంపరివాహన్ (mParivahan) పేరుతో ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌లో మీ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్టోర్ చేయొచ్చు. వాటిని అధికారులకు చూపించొచ్చు. ఎంపరివాహన్ యాప్‌ని గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు. మరి ఎంపరివాహన్ యాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

    Jio Cricket Plans: ఐపీఎల్ మ్యాచ్ ఫ్రీగా చూడాలా? జియో క్రికెట్ ప్లాన్స్ ఇవే

    ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎంపరివాహన్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి.

    మీ మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి.

    డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేయొచ్చు.

    ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ పైన క్లిక్ చేయాలి.

    మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి.

    Add To My Dashboard పైన క్లిక్ చేయాలి.

    మీ పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.

    మీ డ్రైవింగ్ లైసెన్స్ డ్యాష్‌బోర్డ్‌లో యాడ్ అవుతుంది.

    ఇలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా డ్యాష్‌బోర్డ్‌లో యాడ్ చేయాలి.

    డ్యాష్‌బోర్డ్‌లో వర్చువల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ కనిపిస్తాయి. క్లిక్ చేస్తే పూర్తి వివరాలు, క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తాయి. ట్రాఫిక్ పోలీసులు లేదా రవాణా శాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎంపరివాహన్ యాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ చూపిస్తే సరిపోతుంది. అధికారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెరిఫై చేస్తారు.

    Poco X4 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.6,549 ధరకే... ఆఫర్ కొద్దిరోజులే

    ఎంపరివాహన్ యాప్‌లో వేర్వేరు యూజర్లు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ యాడ్ చేయొచ్చు. ఉదాహరణకు భార్య వాహనాన్ని భర్త డ్రైవ్ చేస్తున్నాడనుకుందాం. అప్పుడు భార్య వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, భర్త డ్రైవింగ్ లైసెన్స్ చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకే యాప్‌లో వీటిని యాడ్ చేయొచ్చు.

    First published:

    ఉత్తమ కథలు