రైల్వే ప్రయాణికులకు అలర్ట్. భారతీయ రైల్వే (Indian Railways) మూడేళ్ల తర్వాత ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్‌ను రిలీజ్ చేసింది. ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (Trains at a Glance) పేరుతో ఓ పుస్తకాన్ని రూపొందించింది. గతంలో ఉన్న పుస్తకానికి ఇది అప్డేట్ వర్షన్. ఇందులో ఉన్న టైమ్ టేబుల్ 2022 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. రైల్వే ప్రయాణికులు భారతీయ రైల్వే అధికారిక వెబ్సైట్ www.indianrailways.gov.in, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్సైట్ www.irctc.co.in, ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ http://www.irctctourism.com లల్లో ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (TAG) ఇ-బుక్ కొనొచ్చు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.
ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్‌లో ప్రచురించిన టైమ్ టేబుల్లో ట్రైన్ నెంబర్, టైమ్, షెడ్యూల్, రూట్ లాంటి వివరాలన్నీ ఉంటాయి. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో నడుస్తున్న రైళ్ల వివరాలన్నీ ఉంటాయి. రైళ్ల సమయపాలన మెరుగుపరచడానికి టైమ్ టేబుల్లో అవసరమైన మార్పులు చేశారు. కోవిడ్‌కు ముందు ఉన్న సమయపాలనతో పోలిస్తే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయపాలన దాదాపు 9 శాతం మెరుగుపడిందని భారతీయ రైల్వే తెలిపింది.
Gold Price Today: ధంతేరాస్‌కు 3 రోజుల ముందు శుభవార్త... తగ్గిన గోల్డ్ రేట్
భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, హమ్సాఫర్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, అంత్యోదయ ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, యువ ఎక్స్‌ప్రెస్, ఉదయ్ ఎక్స్‌ప్రెస్ లాంటి 3,240 మెయిల్, ఎక్స్‌ప్రెస్, జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, ఇతర రకాల రైళ్లను నడుపుతోంది. వీటితో పాటు 3,000 ప్యాసింజర్ రైళ్లు, 5,660 సబర్బన్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లల్లో రోజూ సుమారు 2.23 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల మొత్తం జనాభా కన్నా భారతీయ రైల్వే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ.
Credit Cards: ఈ 7 క్రెడిట్ కార్డ్స్ కొత్తగా వచ్చాయి? క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ వివరాలివే
ఈ వివరాలన్నీ ఉన్న ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ ఇ-బుక్ ధర రూ.100. డెలివరీ ఛార్జీలతో కలిపి మొత్తం రూ.160 చెల్లించాలి. ఇందులో 400 పైగా కలర్ పేజీల్లో అనేక వివరాలు ఉంటాయి. ఈ పుస్తకంలో టైమ్ టేబుల్ వివరాలతో పాటు రైల్వే టూరిజం, భోజనం మెను, ముందస్తు రిజర్వేషన్, రైల్వే విచారణ, తత్కాల్ రిజర్వేషన్, అప్‌గ్రేడేషన్, విదేశీయులకు ప్రత్యేక సౌకర్యాలు, ప్రయాణ ప్రణాళికలో మార్పులు, లగేజీ బుకింగ్, ఇంటర్నెట్ ద్వారా రిజర్వేషన్, రీఫండ్ రూల్స్, ప్రయాణికుల సౌకర్యాలు లాంటి వివరాలు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, IRCTC, IRCTC Tourism, Railways