Aadhaar Card: మీ మొబైల్ నెంబర్‌తో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

Aadhaar Card Download | ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ UIDAI దగ్గర రిజిస్టరై ఉండాలి. మరి మొబైల్ నెంబర్‌తో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

news18-telugu
Updated: May 31, 2019, 11:54 AM IST
Aadhaar Card: మీ మొబైల్ నెంబర్‌తో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
Aadhaar Card: మీ మొబైల్ నెంబర్‌తో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 31, 2019, 11:54 AM IST
జేబులో ఆధార్ కార్డు లేని సందర్భాల్లో ఆధార్ కార్డ్ అవసరమైతే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. మీ దగ్గర ఆధార్ నెంబర్ లేకపోయినా జస్ట్ మీ మొబైల్ నెంబర్‌తో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా ఆధార్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ తెలుసుకొని ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌లో ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఉంటుంది. మీరు మొబైల్ నెంబర్‌తో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ UIDAI దగ్గర రిజిస్టరై ఉండాలి. మరి మొబైల్ నెంబర్‌తో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

Read this: పాత ఫోన్ అమ్మేస్తున్నారా? తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలివే

UIDAI, aadhaar download, aadhar card download with mobile number, how to download aadhaar card, aadhar card download steps, aadhar card download by enrollment number, e aadhar card download, ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్, ఆధార్ డౌన్‌లోడ్, ఆధార్ డౌన్‌లోడ్ ఎలా, మొబైల్ నెంబర్‌తో ఆధార్ డౌన్‌లోడ్, ఆధార్ డౌన్‌లోడ్ స్టెప్స్, ఆధార్ డౌన్‌లోడ్ ప్రాసెస్, ఆధార్ డౌన్‌లోడ్ చేయడమెలా
image: UIDAI


మొబైల్ నెంబర్‌తో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి స్టెప్స్ ఇవే...




ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి.
My Aadhaar సెక్షన్‌లో Retrieve Lost or Forgotten EID/UID పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
EID అంటే ఎన్‌రోల్‌మెంట్ నెంబర్. UID అంటే ఆధార్ నెంబర్.
EID లేదా UID సెలెక్ట్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
Sent OTP పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు కోరుకున్న EID లేదా UID మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి వస్తుంది.
మీరు పొందిన EID లేదా UID ద్వారా మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇందుకోసం My Aadhaar సెక్షన్‌లో Download Aadhaar పైన క్లిక్ చేయాలి.

ఒకవేళ మీ మొబైల్ నెంబర్ UIDAI దగ్గర రిజిస్టర్ చేయకపోయినా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ స్లిప్ ఉండాలి. అందులో ఎన్‌రోల్‌మెంట్ నెంబర్, డేట్, టైమ్ ఉంటాయి. వీటి ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇవేమీ లేకపోతే మీరు దగ్గర్లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

ATM: ఏటీఎంలో డబ్బులు రాలేదా? ఇలా కంప్లైంట్ చేయండి

PAN Card: మీ పాన్ కార్డ్ నెంబర్ అర్థమేంటో తెలుసా?

ఆన్‌లైన్‌లో చెప్పులు కొంటున్నారా? ఈ 11 జాగ్రత్తలు తప్పనిసరి
First published: May 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...