EPF Nomination: ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ నామినేషన్ వివరాలు నమోదు చేయండి ఇలా...

EPF Nomination in Online | ఒకవేళ నామినీ వివరాలు లేకపోతే ఈపీఎఫ్ సేవింగ్స్ విత్‌డ్రా చేయడంలో సమస్యలొస్తాయి. మీరు నామినీగా ఒకరిని ఎంచుకోవచ్చు.

news18-telugu
Updated: April 20, 2019, 10:46 AM IST
EPF Nomination: ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ నామినేషన్ వివరాలు నమోదు చేయండి ఇలా...
EPF Nomination: ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ నామినేషన్ వివరాలు నమోదు చేయండి ఇలా...
  • Share this:
మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? నామినీ వివరాలు ఇచ్చారా? నామినీ వివరాలు ఇప్పటి వరకు ఇవ్వకపోతే వెంటనే అప్‌డేట్ చేయండి. ఎందుకంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఈపీఎఫ్ అకౌంట్‌కు నామినీ తప్పనిసరి చేసింది. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో మీరే అప్‌డేట్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/  ఓపెన్ చేసి మీ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ అకస్మాత్తుగా చనిపోతే ఈపీఎఫ్ సేవింగ్స్‌ను నామినేటెడ్ సభ్యులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ నామినీ వివరాలు లేకపోతే ఈపీఎఫ్ సేవింగ్స్ విత్‌డ్రా చేయడంలో సమస్యలొస్తాయి. మీరు నామినీగా ఒకరిని ఎంచుకోవచ్చు. లేదా మీ కుటుంబ సభ్యులకు ఎంతెంత శాతం ఇవ్వాలో మీరే నిర్ణయించొచ్చు. మరి ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ అకౌంట్‌లో నామినేషన్ వివరాలు ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

Read this: Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు ఇవే...

ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ నామినేషన్ వివరాలు నమోదు చేయండి ఇలా...


ముందుగా ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైడ్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయండి.
యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
"Manage" ట్యాబ్‌ పైన క్లిక్ చేసి ఇ-నామినేషన్ ఆప్షన్ ఎంచుకోండి.
యూఏఎన్, పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు కనిపిస్తాయి.మీ ప్రస్తుత, శాశ్వత చిరునామాను ఎంటర్ చేసి సేవ్ చేయండి.
ఫ్యామిలీ డిక్లరేషన్ కోసం "yes" పైన క్లిక్ చేయండి.
"add family details" క్లిక్ చేసి మీరు నామినేట్ చేయాలనుకునేవారి పేర్లు ఎంటర్ చేయండి.
కుటుంబ సభ్యుల పేరు, పుట్టిన తేదీ, మీతో ఉన్న సంబంధం, నామినీ పూర్తి అడ్రస్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
మీరు నామినీగా ఒకరి పేరే ఇవ్వొచ్చు. లేదా ఒకరికన్నా ఎక్కువ కూడా ఇవ్వొచ్చు.
"nomination details" క్లిక్ చేసి ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో వెల్లడించాలి.
వివరాలు నమోదు చేసిన తర్వాత "save EPF nomination" బటన్ క్లిక్ చేయాలి.
ఓటీపీ కోసం ఇ-సైన్ బటన్ పైన క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఇ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో నమోదవుతుంది.
మీరు ఇక ఎలాంటి డాక్యుమెంట్స్ ఈపీఎఫ్ఓ లేదా మీ సంస్థకు పంపాల్సిన అవసరం లేదు.

Photos: న్యూయార్క్ ఆటో షోలో కళ్లుచెదిరే 16 కార్లు

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు

FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
First published: April 20, 2019, 10:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading