మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలనుకుంటున్నారా? చాలా సింపుల్. ఈపీఎఫ్ఓ పోర్టల్ మాత్రమే కాదు... ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేయొచ్చు. ప్రభుత్వానికి చెందిన అన్ని సేవల్ని ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ కలిసి 'యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్-UMANG' పేరుతో ఓ యాప్ రూపొందించాయి. ఈ యాప్‌లో అనేక ప్రభుత్వ సేవలు లభిస్తాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO అందించే సేవల్ని కూడా ఉమాంగ్ యాప్‌లో పొందొచ్చు. ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్లోడ్ నుంచి పీఎఫ్ విత్‌డ్రాయల్ వరకు అన్నీ సాధ్యమే. మరి ఉమాంగ్ యాప్‌లో ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
EPF Withdrawal: పీఎఫ్ డబ్బులు డ్రా చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి
ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌లో ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేయండి.
మీ వివరాలతో లాగిన్ కావాలి.
ఆ తర్వాత EPFO సెక్షన్లోకి వెళ్లాలి.
ఆ తర్వాత Employee Centric సర్వీసెస్‌లో క్లెయిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
కోవిడ్ 19 అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి.
మీ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత విత్‌డ్రాయల్ టైప్ సెలెక్ట్ చేయాలి.
అంటే హెల్త్, మ్యారేజ్ లాంటి వాటిలో మీ కారణాన్ని సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి.
క్లెయిమ్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.
క్లెయిమ్ రిఫరెన్స్ నెంబర్‌తో విత్‌డ్రాయల్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు.
GoI has announced back in March 2020 that an individual can withdraw a certain sum from their @socialepfo account, if he/she is facing financial problems due to the coronavirus-related lockdown/curfew. Here's how you can withdraw from your EPF corpus via @UmangOfficial_ app. pic.twitter.com/tRA8YGJ6G4
EPF Passbook Download: పీఎఫ్ పాస్‌బుక్ డౌన్లోడ్ చేయండి ఇలా
ఉమాంగ్ యాప్‌లో లాగిన్ అయిన తర్వాత EPFO సెక్షన్లోకి వెళ్లాలి.
Employee Centric సర్వీసెస్‌లో View Passbook ఫైన క్లిక్ చేయాలి.
యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి.
మీ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్లోడ్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.