హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడుందో తెలుసుకోవాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

IRCTC: మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడుందో తెలుసుకోవాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IRCTC train status | మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడ ఉంది? ఎలా గుర్తించాలో తెలుసా? టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఈ విషయం సులువుగా తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.

ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగిన ఇండియన్ రైల్వే ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. కొన్ని సందర్భాల్లో రైల్వే ట్రాక్లో వచ్చే కొన్ని సమస్యలు మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతాయి. కాబట్టి ప్రస్తుతం మనం ప్రయాణించాల్సిన రైలు ఎక్కడుంది? స్టేషన్‌కు రావడానికి ఎంత సమయం పడుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రయాణికుల్లో ఉంటుంది. ఈ సమాచారాన్ని సులభంగా మన అరచేతిలో ఉన్న మొబైల్ ఫోన్లోనే చూసుకునే వ్యవస్థను భారతీయ రైల్వే రూపొందించింది. యాత్ర, గోయిబిబో వంటి వివిధ ట్రావెల్ కంపెనీ వెబ్‌సైట్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణిస్తున్న రైలు యొక్క రన్నింగ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్స్ అన్నీ ఇండియన్ రైల్వే లేదా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఐఆర్‌సీటీసీ, రైల్ యాత్రి వంటి యాప్‌ల ద్వారా ట్రైన్ రన్నింగ్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు.

SBI ATM: అలర్ట్... ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు కొత్త రూల్

Savings Scheme: మీ డబ్బును రెండింతలు చేసే స్కీమ్ ఇదే

ఐఆర్‌సీటీసీ ద్వారా ఇలా చెక్ చేసుకోండి


ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

ట్రైన్స్ అనే ఆప్షన్‌పైన క్లిక్ చేయండి.

మీ రైలును ట్రాక్ చేయండిపై క్లిక్ చేయండి.

మీ రైలును గుర్తించండి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ రైలు నెంబర్ ఎంటర్ చేయండి.

రైల్ యాత్రి ద్వారా ఇలా చెక్ చేసుకోండి


రైల్ యాత్రి వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కూడా రైలు స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో రైలు విచారణ కేంద్రం ఎంపిక చేసుకొని ట్రైన్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మీ రైలు నెంబర్ లేదా పేరు ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ట్రైన్ స్టేటస్, రైలు వచ్చే ప్లాట్‌ఫామ్ నెంబర్, రైలు వచ్చే సమయం, బయలుదేరే సమయం, రాబోయే స్టేషన్, ఇంటర్మీడియట్ స్టేషన్ వంటి సమాచారం తెలుసుకోవచ్చు. ప్రయాణీకులు తమ రైలు స్టేటస్‌ను తెలుసుకోవడానికి రైల్వే ఎంక్వైరీ నంబర్ 139 కి కాల్ లేదా ఎస్ఎంఎస్ చేయవచ్చు.

First published:

Tags: Indian Railway, Indian Railways, Irctc, Railways, Train, Train tickets

ఉత్తమ కథలు