IRCTC Booking: రైలులో ఖాళీ సీట్ల లెక్క ఇలా తెలుసుకోండి

irctc.co.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి రైలు బయల్దేరే స్థలం, వెళ్లాల్సిన ప్రదేశాన్ని ఎంటర్ చేయాలి. అక్కడ ‘check seat availability’ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత తేదీల వారీగా సీట్ల లభ్యత తెలుస్తుంది.

news18-telugu
Updated: February 4, 2019, 5:18 PM IST
IRCTC Booking: రైలులో ఖాళీ సీట్ల లెక్క ఇలా తెలుసుకోండి
IRCTC Booking: రైలులో ఖాళీ సీట్ల లెక్క ఇలా తెలుసుకోండి
  • Share this:
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో చేసిన మార్పులు... టికెట్ బుకింగ్‌ను ఇంకా సులభతరం చేసింది. మారిన ఇంటర్‌ఫేస్ యూజర్లకు సులభంగా ఉంది. ఎలాంటి సమాచారమైనా సులువుగా తెలుసుకునే అవకాశం లభిస్తోంది. బుకింగ్ సమయంలో యూజర్లు పలు రకాల కోటాల్లో టికెట్లు బుక్ చేయొచ్చు. జనరల్ కోటా, లేడీస్ కోటా, ఫారిన్ టూరిస్ట్ కోటా, ప్రీమియం తత్కాల్ కోటా, తత్కాల్ కోటా, సీనియర్ సిటిజన్ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్(దివ్యాంగుల) కోటా... ఇలా పలు రకాల కోటాలున్నాయి. సీట్ల లభ్యత తెలుసుకునేందుకు irctc.co.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి రైలు బయల్దేరే స్థలం, వెళ్లాల్సిన ప్రదేశాన్ని ఎంటర్ చేయాలి. అక్కడ ‘check seat availability’ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత తేదీల వారీగా సీట్ల లభ్యత తెలుస్తుంది. బుక్ బటన్ క్లిక్ చేసి టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. జనరల్, రిజర్వ్‌డ్, తత్కాల్ టికెట్లకు ఇదే పద్ధతి ఉంటుంది.

Read this:

IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...

IRCTC Refund Rules: ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ రూల్స్ ఇవే...

జనరల్, రిజర్వ్‌డ్‌లో సీట్లు లేకపోతే తత్కాల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రైలు బయల్దేరడానికి కనీసం 24 గంటల ముందు తత్కాల్ టికెట్లు తీసుకోవాలి. ఏసీ క్లాస్‌కు ఉదయం 10 గంటలకు, నాన్-ఏసీ క్లాస్‌కు 11 గంటలకు తత్కాల్ టికెట్ బుకింగ్ ఓపెన్ అవుతుంది. సెకండ్ క్లాస్‌కు 10%, ఇతర క్లాసులకు 30% అదనంగా ఛార్జీలు చెల్లించాలి. కన్ఫామ్డ్ తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ రాదు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న తత్కాల్ టికెట్ క్యాన్సల్ చేస్తే రైల్వే రూల్స్ ప్రకారం రీఫండ్ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:Alert: ఫోటో ఎడిటింగ్ యాప్స్‌లో వైరస్... ఈ యాప్స్ మీ దగ్గరున్నాయా?

Photos: అక్కడికి వెళ్తే ప్యాంటు విప్పాల్సిందే... ఎందుకో తెలుసా?
First published: February 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading