• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • KNOW HOW TO BUY US STOCKS LIKE GOOGLE FACEBOOK MICROSOFT BY STAYING IN INDIA AK GH

Buying US Stocks from India: ఇండియాలో ఉంటూ అమెరికా కంపెనీల షేర్లు కొనాలనుకుంటున్నారా ? ఎలాగో తెలుసుకోండి ?

Buying US Stocks from India: ఇండియాలో ఉంటూ అమెరికా కంపెనీల షేర్లు కొనాలనుకుంటున్నారా ? ఎలాగో తెలుసుకోండి ?

ప్రతీకాత్మకచిత్రం

How To Buy US Shares From India: రిజర్వు బ్యాంక్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం (LRS)లో భాగంగా.. భారత పెట్టుబడిదారులు ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేకుండా సంవత్సరానికి 250,000 డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) వరకు ఫారెన్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

  • Share this:
ఒకప్పటితో పోలిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మార్గాలు పెరిగాయి. అందుబాటులోకి వచ్చిన స్టాక్ బ్రోకింగ్ సంస్థల కారణంగా పెట్టుబడులను ఎంచుకునేవారి సంఖ్య సైతం పెరుగుతోంది. ఇప్పుడు సాధారణ స్టాక్స్‌తో పాటు ప్రపంచంలో అత్యంత విలువైన స్టాక్స్‌ను సైతం సులభంగా కొనుగోలు చేయవచ్చు. గూగుల్, ఫేస్‌బుక్, టెస్లా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ఇతర కంపెనీల షేర్లను కూడా భారత పెట్టుబడిదారులు ఎంచుకోవచ్చు. ఇలాంటి స్టాక్స్ పోర్ట్‌ఫోలియో ఎక్స్‌పోజర్‌ను పెంచుతాయి. రిజర్వు బ్యాంక్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం (LRS)లో భాగంగా.. భారత పెట్టుబడిదారులు ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేకుండా సంవత్సరానికి 250,000 డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) వరకు ఫారెన్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

ఇండియన్ బ్రోకరేజీ సంస్థలు అందించే ఓవర్సీస్ అకౌంట్ ద్వారా అమెరికన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లోని గ్లోబల్ ఈక్విటీల ద్వారా కూడా విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. అమెరికాలో మంచి పనితీరు కనబరిచే ఐదు ముఖ్యమైన స్టాక్స్‌ను "FAANG" అంటారు. ఇది ఐదు ప్రధాన అమెరికన్ టెక్నాలజీ కంపెనీల స్టాక్స్‌ను సూచిస్తుంది. ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, ఆల్ఫాబెట్ సంస్థల షేర్లు ఈ జాబితాలో ఉంటాయి. ఈ ఐదు స్టాక్స్‌కు మంచి ఆదరణ ఉంటుంది. FAANGలు మంచి క్యాష్‌ ఫ్లోను అందిస్తాయి. అందువల్ల వీటి ప్రొడక్ట్ గ్రోత్, న్యూ వెంచర్లపై ఎక్కువగా ఖర్చు పెట్టవచ్చు.

* భారత్ నుంచి US స్టాక్స్ ఎలా కొనుగోలు చేయాలి?

* డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (దేశీయ బ్రోకరేజీ సంస్థల సాయంతో)
ఇండియన్ బ్రోకరేజీ సంస్థల సాయంతో పెట్టుబడిదారులు విదేశీ ట్రేడింగ్ అకౌంట్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్లకు ఇది మంచి పెట్టుబడి మార్గం. చాలా వరకు ఫుల్ సర్వీస్ ఫండ్ హౌస్‌లు విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పిస్తాయి. కానీ బ్రోకరేజీ సంస్థను బట్టి ఈ సేవలకు కొన్ని పరిమితులు ఉంటాయి. కంపెనీని బట్టి పెట్టుబడి మార్గాలు మారుతూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలావరకు దేశీయ బ్రోకరేజీ సంస్థలు అమెరికన్ స్టాక్ బ్రోకర్లతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ సంస్థలు కస్టమర్ల వ్యాపారాలను నిర్వహిస్తాయి. ఈ బ్రోకరేజీ సంస్థలు విదేశీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి సహాయపడతాయి. 5పైసా, వెస్టెడ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ డైరెక్ట్, రిలయన్స్ మనీ, కొటక్ సెక్యూరిటీస్.. తదితర దేశీయ బ్రోకరేజీ సంస్థలు అమెరికన్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సహాయపడతాయి.

* డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (విదేశీ బ్రోకరేజీ సంస్థ సాయంతో)
భారత్‌లో నమోదు చేసుకున్న విదేశీ బ్రోకరేజీ సంస్థల సాయంతో మన పెట్టుబడిదారులు అక్కడి స్టాక్స్ కొనుగోలు చేయవచ్చు. చార్లెస్ ష్వాబ్ ఇంటర్నేషనల్ అకౌంట్, ఇంటరాక్టివ్ బ్రోకర్లు, టీడీ అమెరిట్రేడ్, ఇతర స్టాక్ బ్రోకర్ సంస్థల సాయంతో కస్టమర్లు ఫారెన్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. వీటి ద్వారా US సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ ఈ మార్గంలో పెట్టుబడి ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ముందే ఖర్చుల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

* ఇన్‌డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (పరోక్ష పెట్టుబడి మార్గం)
కొన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ నేరుగా ఇంటర్నేషనల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తాయి. ఇందుకు పెట్టుబడిదారులు ప్రత్యేకంగా ఒక అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. మినిమం డిపాజిట్ కూడా అవసరం లేదు. అందువల్ల ఈ మార్గంలో గ్లోబల్ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి తక్కువ ఖర్చు అవుతుంది. ఈ పద్ధతిలో ఒక దేశీయ లేదా విదేశీ బ్రోకర్ నుంచి US ETFలను కొనుగోలు చేయవచ్చు. లేదా అంతర్జాతీయ సూచీలను ట్రాక్ చేసే ఒక ఇండియన్ ETFను కూడా ఖాతాదారులు కొనుగోలు చేయవచ్చు.

* ఈ విషయాలు మర్చిపోవద్దు...
US లిస్టెడ్ సంస్థల్లో పెట్టుబడి పెట్టేవారు US డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఫ్రాక్షనల్ షేర్స్ ఆప్షన్ ద్వారా ఫ్రాక్షన్లలో సైతం షేర్లను కొనుగోలు చేయవచ్చు. అంటే.. అమెరికాకు చెందిన ఒక పబ్లిక్ ట్రేండింగ్ ఫర్మ్‌లో సగం వాటా లేదా 1.5 వాటా షేర్లను కూడా కొనుగోలు చేయవచ్చు. భారతదేశం, అమెరికా మధ్య డబుల్ ట్యాక్స్ ఎవైడెన్స్ అగ్రిమెంట్ (DTAA) ఉంది. దీని ప్రకారం... ఒక స్టాక్‌పై రెండు దేశాల్లో ట్యాక్స్ విధించే అవకాశం లేదు.

US మార్కెట్లపై అవగాహన పెంచుకోవాలనుకునేవారు ఐదు యూఎస్ సూచీలపై దృష్టి పెట్టాలి. కస్టమర్లు RUSSEL 2000 ఇండెక్స్, S&P 500 ఇండెక్స్, నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్, నాస్‌డాక్-100 ఇండెక్స్ (NDX), డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ (DJI).. వంటి ఐదు ఇండెక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. వీటిల్లో స్టాక్స్ పనితీరును పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలి.
First published:

అగ్ర కథనాలు