హోమ్ /వార్తలు /బిజినెస్ /

Sovereign Gold Bond: ఎస్​బీఐ ద్వారా సావరిన్​ గోల్డ్​ బాండ్ కొనండి ఇలా

Sovereign Gold Bond: ఎస్​బీఐ ద్వారా సావరిన్​ గోల్డ్​ బాండ్ కొనండి ఇలా

Sovereign Gold Bond: ఎస్​బీఐ ద్వారా సావరిన్​ గోల్డ్​ బాండ్ కొనండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Sovereign Gold Bond: ఎస్​బీఐ ద్వారా సావరిన్​ గోల్డ్​ బాండ్ కొనండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Sovereign Gold Bond | సావరిన్ గోల్డ్ బాండ్ కొనాలనుకుంటున్నారా? ఎస్‌బీఐలో గోల్డ్ బాండ్స్ ఎలా కొనాలో తెలుసుకోండి.

సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్​ గడువు రేపటితో ముగియనుంది. సావరిన్ గోల్డ్ బాండ్స్ 2021–22 సిరీస్​ 1 అమ్మకాలు మే ​​17న ప్రారంభమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే మొదటి సిరీస్​ కావడం విశేషం. ఈ గోల్డ్​ బాండ్​ అమ్మకాలు 2021 మే 21న ముగుస్తాయి. ఈ సిరీస్​లో ఒక్కో గ్రాము సావరిన్​ గోల్డ్​ బాండ్​ ధర రూ. 4,777 గా నిర్ణయించింది ఆర్​బీఐ. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ ​బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఆన్‌లైన్‌లో ఈ సావరిన్​ బాండ్​లను కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ స్కీమ్​ గురించి పూర్తి వివరాలను ఎస్‌బిఐ ఒక ట్వీట్‌లో వెల్లడించింది. సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడికి ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఎస్‌బిఐ కస్టమర్లు నేరుగా ఈ–సర్వీసుల కింద సావరిన్​ బాండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు.

వీటి అమ్మకాలు మే 21 న ముగుస్తాయి. కొనుగోలు చేసిన వారికి బాండ్లు మే 25 న జారీ చేస్తారు. డిజిటల్​ పేమెంట్​ను ప్రోత్సహించడంలో భాగంగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే పెట్టుబడిదారులకు ప్రతి గ్రాముకు రూ. 50 తగ్గింపు లభిస్తుంది. ఫలితంగా అటువంటి వారు గ్రాము సావరిన్​ గోల్డ్​ బాండ్​ను​ రూ.4,727 ధర వద్దే కొనుగోలు చేయవచ్చు.

EPFO Insurance: ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ.7,00,000 వరకు ఇన్స్యూరెన్స్... ఎలా పొందాలంటే

PAN Card: మీ పాన్ కార్డుపై ఉన్న 10 డిజిట్స్‌కి అర్థం తెలుసా?

ఎస్​బీఐ ద్వారా కొనుగోలుకు ఈ స్టెప్స్​ ఫాలో అవ్వండి


1. మీ ఎస్​బీఐ నెట్ బ్యాంకింగ్ అకౌంట్​కు లాగిన్ అవ్వండి

2. ఈ–సర్వీసెస్‌పై క్లిక్ చేసి ‘సావరిన్ గోల్డ్ బాండ్’ కి వెళ్లండి.

3. 'టర్మ్స్​ అండ్​ కండీషన్స్’​ ఎంచుకొని, ‘ప్రొసీడ్​’ పై క్లిక్ చేయండి.

4. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపండి.

5. మీరు ఎన్ని గ్రాములను కొనుగోలు చేస్తున్నారు? నామినీ వివరాలను నమోదు చేసి సబ్​మిట్​పై క్లిక్ చేయండి.

Gold Hallmarking: హాల్‌మార్కింగ్ అంటే ఏంటీ? ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

EPF Withdrawal: కరోనాతో మరణించినవారి ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు డ్రా చేయండిలా

కేవలం ఎస్​బీఐ నుంచే కాకుండా వాణిజ్య బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సిఐఎల్), ఆర్‌బిఐ నియమించిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి కూడా బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని 2015 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

First published:

Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold loans, Gold ornmanets, Gold price, Gold price down, Gold Prices, Gold rate, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates, Sovereign Gold Bond Scheme