Home /News /business /

KNOW HOW TO BUY NATIONAL FLAG ONLINE FROM INDIA POSTS EPOST OFFICE WEBSITE SS

Independence Day 2022: పోస్ట్ ఆఫీస్ నుంచి జాతీయ జెండాను ఆన్‌లైన్‌లో కొనండి ఇలా

Independence Day 2022: పోస్ట్ ఆఫీస్ నుంచి జాతీయ జెండాను ఆన్‌లైన్‌లో కొనండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Independence Day 2022: పోస్ట్ ఆఫీస్ నుంచి జాతీయ జెండాను ఆన్‌లైన్‌లో కొనండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Independence Day 2022 | కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ (Azadi ka Amrit Mahotsav) కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా క్యాంపైన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పౌరులు తమ ఇళ్లపై జెండాలను ఎగరవేసేందుకు త్రివర్ణ పతాకాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయొచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ (Azadi ka Amrit Mahotsav) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈసారి ఇండిపెండెన్స్ డే (Independence Day) వేడుకలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. పౌరులు తమ ఇళ్లపై జాతీయ జెండాలను (National Flag) ఎగరవేయబోతున్నారు. ఇక పిల్లల చేతుల్లో, వాహనాలపై జాతీయ జెండాలు కనిపించబోతున్నాయి. వీధుల్లో చిరు వ్యాపారుల దగ్గర్నుంచి బడా షాపుల వరకు జాతీయ జెండాల అమ్మకాలు జోరుగా సాగబోతున్నాయి. మీరు ఇండియా పోస్ట్ నుంచి ఆన్‌లైన్‌లో జాతీయ జెండాను కొనవచ్చు.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 'హర్ ఘర్ తిరంగా' పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పౌరులు తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వ తపాలా సేవా ఇ-పోస్ట్ ఆఫీస్ వెబ్‌సైట్ ద్వారా జాతీయ జెండాలను ఆన్‌లైన్‌లో అమ్మబోతోంది. కేవలం రూ.25 చెల్లించి జాతీయ జెండాను కొనొచ్చు. ఒకరు 5 జెండాలను కొనవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Aadhaar Mandatory: ఈ సేవలకు ఆధార్ నెంబర్ తప్పనిసరి... గుర్తుంచుకోండి


ఇ-పోస్ట్ ఆఫీస్ వెబ్‌సైట్‌లో జాతీయ జెండా కొనండి ఇలా


Step 1- ముందుగా https://www.epostoffice.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో 'హర్ ఘర్ తిరంగా' బ్యానర్ పైన క్లిక్ చేయాలి.

Step 3- క్వాంటిటీలో మీకు ఎన్ని జాతీయ జెండాలో కావాలో సెలెక్ట్ చేయాలి.

Step 4- ఒకటి నుంచి ఐదు జెండాలకు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు.

Step 5- ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయాలి.

Step 6- ఆ తర్వాత డెలివరీ అడ్రస్ వివరాలు ఎంటర్ చేయాలి.

Step 7- ఆ తర్వాత పేమెంట్ చేస్తే చాలు.

PAN Card: పాన్ కార్డ్ పోయిందా? మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయండి ఇలా

మీరు ఇచ్చిన అడ్రస్‌కు జాతీయ జెండా డెలివరీ అవుతుంది. జాతీయ జెండా సైజ్ 20 అంగుళాలు, 30 అంగుళాల సైజ్‌లో ఉంటుంది. కేవలం రూ.25 చెల్లించి ఈ జెండా సొంతం చేసుకోవచ్చు. జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. దగ్గర్లోని పోస్ట్ ఆఫీసులో కూడా త్రివర్ణ పతాకాన్ని కొనొచ్చు. కస్టమర్లు ఫ్లాగ్ కోడ్ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాలి.



స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర రక్షణ శాఖ అన్ని విద్యాసంస్థలకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపొందించింది. ప్రధాన మంత్రి జాతీని ఉద్దేశించి తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇస్తారు. ఈసారి డిజిటల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, హెల్త్ కేర్ లాంటి టాపిక్స్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Azadi Ka Amrit Mahotsav, Independence Day 2022, India post, National flag, Pm modi, Post office

తదుపరి వార్తలు