IRCTC: యూటీఎస్ యాప్‌లో ట్రైన్ పాస్... బుక్ చేయండి ఇలా

UTS App | యూటీఎస్ యాప్‌లో సీజన్ టికెట్ తీసుకుంటే కాపీని ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్‌లోనే టీసీకి చూపించొచ్చు.

news18-telugu
Updated: July 21, 2019, 4:48 PM IST
IRCTC: యూటీఎస్ యాప్‌లో ట్రైన్ పాస్... బుక్ చేయండి ఇలా
IRCTC: యూటీఎస్ యాప్‌లో ట్రైన్ పాస్... బుక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తరచూ ఒకే రూట్‌లో రైలులో ప్రయాణించేవాళ్లు సీజన్ టికెట్ తీసుకుంటూ ఉంటారు. అయితే కౌంటర్‌లోనే సీజన్ టికెట్ తీసుకోవడం చాలామందికి అలవాటు. భారతీయ రైల్వే యూటీఎస్ యాప్ ద్వారా సీజన్ టికెట్స్‌ని అందిస్తోంది. యూటీఎస్ యాప్‌లో జనరల్ టికెట్ తీసుకోవచ్చన్న విషయం తెలిసిందే. సీజన్ టికెట్ అంటే మంత్లీ పాస్‌ని కూడా యూటీఎస్ యాప్‌లో తీసుకోవడం సులువే. రెండు స్టేషన్ల మధ్య తరచూ ప్రయాణించేవారికి ఇది ఉపయోగకరం. యూటీఎస్ యాప్‌లో సీజన్ టికెట్ తీసుకుంటే కాపీని ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్‌లోనే టీసీకి చూపించొచ్చు. సీజన్ టికెట్‌ను నెలకు మాత్రమే కాదు ఏడాదికి కూడా తీసుకోవచ్చు. మరి యూటీఎస్ యాప్ ద్వారా సీజన్ టికెట్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

UTS App: సీజన్ టికెట్ తీసుకోండి ఇలా


ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో UTS App డౌన్‌లోడ్ చేసుకోండి.

లాగిన్ బటన్ పైన క్లిక్ చేసి మీ వివరాలు ఎంటర్ చేయండి.
లాగిన్ చేసిన తర్వాత 'Book Ticket' ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
సీజన్ టికెట్ పైన క్లిక్ చేసి 'Book & Travel (Paperless)' ఆప్షన్ ఎంచుకోండి.


తర్వాత 'Issue Ticket' పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడైనా సీజన్ టికెట్ తీసుకోవాలంటే 'Renew Ticket' ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
Loading...
ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సీజన్ టికెట్ కావాలో సెలెక్ట్ చేయాలి.
ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్, ఏసీ, నాన్ ఏసీ లాంటి వివరాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత పేమెంట్ చేయాలి.
చివరగా 'Done' పైన క్లిక్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.
సీజన్ టికెట్ కొన్న తర్వాత 'Show Booked Ticket' ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సీజన్ టికెట్ కనిపిస్తుంది.

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి షిమ్లా టూర్ ప్యాకేజీ... వివరాలివే

IRCTC: ఐఆర్‌సీటీసీ ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్... ఎలా పనిచేస్తుందో తెలుసా?

Shopping Tips: వీకెండ్ షాపింగా? ఈ 9 టిప్స్‌తో డబ్బు ఆదా చేయండి
First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...