మీరు హెచ్‌పీ గ్యాస్ వాడుతున్నారా? హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం చాలా సింపుల్. టెక్నాలజీని ఉపయోగించుకొని గ్యాస్ బుకింగ్‌ను సులభతరం చేసింది హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్. హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఐవీఆర్ఎస్, వాట్సప్, ఎస్ఎంఎస్, ఆన్లైన్, యాప్... ఇలా వేర్వేరు పద్ధతుల్లో హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు.
IVRS: హెచ్‌పీ ఎనీటైమ్ పేరుతో 24 గంటలు పనిచేసే ఐవీఆర్ఎస్ సిస్టమ్ రూపొందించింది HPCL. ప్రాంతాలను బట్టి ఈ నెంబర్లు మారుతుంటాయి. మీరు ఐవీఆర్ఎస్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మీ ప్రాంతానికి చెందిన హెచ్‌పీ బుకింగ్ నెంబర్ తెలుసుకోవాలి. ఆ తర్వాత రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఐవీఆర్ఎస్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు.
WhatsApp: వాట్సప్ హెల్ప్‌లైన్ సేవల్ని కూడా ప్రారంభించింది HPCL. వాట్సప్ నెంబర్ 92222201122 మీ ఫోన్లో సేవ్ చేసుకొని వాట్సప్ హెల్ప్‌లైన్ సేవల్ని పొందొచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే BOOK అని, ఇతర సాయం కావాలంటే HELP అని, గ్యాస్ లీకేజీ సమస్యలు ఉన్నట్టైతే LEAKAGE అని ఈ వాట్సప్ నెంబర్‌కు మెసేజ్ పంపిస్తే చాలు. రిజిస్టర్డ్ మొబైల్ నుంచే ఈ మెసేజ్ పంపాల్సి ఉంటుంది.
WhatsApp New Features: వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే
IRCTC Coorg Tour: కూర్గ్ టూర్ ప్రకటించిన ఐఆర్సీటీసీ... ప్యాకేజీ వివరాలు ఇవే
HP Gas is now on #WhatsApp with a range of easy service options.Simply use your HP Gas registered phone number to avail multiple services.
Book HP Gas: https://t.co/tc3LdHQVK3 Download HP Pay App:
Android: https://t.co/pDCmKgV3Xy
iOS: https://t.co/g8Of97jsIe#RahoBefikar pic.twitter.com/s5WAY34cik
— Hindustan Petroleum Corporation Limited (@HPCL) November 20, 2020
Online Portal: ఆన్లైన్ పోర్టల్ ద్వారా హెచ్‌పీ గ్యాస్ బుక్ చేయొచ్చు. మొదట ఆన్లైన్ పోర్టల్‌లో కస్టమర్ నెంబర్, డిస్ట్రిబ్యూటర్ పేరు, డిస్ట్రిబ్యూటర్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, కాంటాక్ట్ అడ్రస్ లాంటి వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత ఆన్లైన్ పోర్టల్‌లో లాగిన్ అయి గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు.
SMS: హెచ్‌పీ ఎనీటైమ్లో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. ఇందుకోసం HP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎస్టీడీ నెంబర్‌తో డిస్ట్రిబ్యూటర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి కన్స్యూమర్ నెంబర్ టైప్ చేసి హెచ్‌పీ ఎనీటైమ్ నెంబర్‌కు పంపాలి. రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత HPGAS అని టైప్ చేసి హెచ్‌పీ ఎనీటైమ్ నెంబర్‌కు మెసేజ్ చేస్తే సిలిండర్ బుక్ అవుతుంది.
HP Gas Quick Book & Pay: హెచ్‌పీ గ్యాస్ క్విక్ బుక్ అండ్ పే ద్వారా సిలిండర్ బుక్ చేయాలంటే ముందుగా https://myhpgas.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత క్విక్ బుక్ అండ్ పే సెక్షన్ ఓపెన్ చేయాలి. Quick Search లేదా Normal Search ద్వారా సిలిండర్ బుక్ చేయొచ్చు. డిస్ట్రిబ్యూటర్ పేరు, కన్స్యూమర్ నెంబర్ సెర్చ్ చేసి సిలిండర్బుక్ చేయొచ్చు.
Post Office Savings Account: ఖాతాదారులకు అలర్ట్... మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ మారాయి
Job Loss Insurance: ఉద్యోగం పోతే ఇన్స్యూరెన్స్... వారానికి రూ.1,00,000 వరకు బెనిఫిట్
Mobile App: ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్లో HPGas యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత యాక్టివేషన్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్ కోడ్, కన్స్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి యాక్టివేషన్ చేయాలి. ఆ తర్వాత ఇదే యాప్‌లో సిలిండర్ బుక్ చేయొచ్చు.
Other Apps: పేటీఎం, అమెజాన్ లాంటి యాప్స్ ద్వారా కూడా హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. ఇందుకోసం కన్స్యూమర్ నెంబర్, డిస్ట్రిబ్యూటర్ కోడ్ లాంటి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: HPCL, LPG Cylinder