మీరు తిరుపతి వెళ్తున్నారా? ముందుగానే తిరుపతిలో హోటల్ రూమ్ బుక్ చేయాలనుకుంటున్నారా? తిరుపతి మాత్రమే కాదు... విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో హోటల్ బుకింగ్ సేవల్ని అందిస్తోంది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ ఆపరేట్ చేస్తోంది. దేశంలోని 135 పైగా నగరాలు, పట్టణాల్లో హోటల్ బుకింగ్ (Hotel Booking) చేయొచ్చు. ఒక రాత్రికి కేవలం రూ.600 నుంచే బుకింగ్ ప్రైస్ మొదలవుతుంది. మీరు ఎంచుకునే హోటల్‌ను బట్టి ధర మారుతుంది. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ లేదా ఐఆర్సీటీసీ హోటల్స్ వెబ్సైట్లో హోటల్ బుక్ చేయొచ్చు.
ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకున్న హోటళ్ల జాబితా వెబ్సైట్లో ఉంటుంది. మీరు మీకు నచ్చిన హోటల్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మరి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో హోటల్ బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి.
Train Running Status: మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడుంది? సింపుల్‌గా తెలుసుకోండిలా
New #adventures are awaiting! #PackYourBags & find #pocketfriendly #hotel #rooms starting at ₹600 per night on- the- go on #IRCTC portal. Enjoy the facilities available in 135+ #cities across #India. #Book right away on https://t.co/YkHDZXq3v4 & #explore new #destinations
— IRCTC (@IRCTCofficial) March 23, 2022
ముందుగా https://www.hotel.irctctourism.com/ లేదా https://www.irctctourism.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోటల్ పేరు లేదా సిటీ పేరు ఎంటర్ చేయాలి.
చెకిన్, చెకౌట్ తేదీలను ఎంటర్ చేయాలి.
గెస్ట్‌ల సంఖ్య, గదుల సంఖ్య సెలెక్ట్ చేయాలి.
సెర్చ్ చేస్తే మీరు ఎంటర్ చేసిన తేదీల్లో అందుబాటులో ఉన్న హోటళ్ల జాబితా కనిపిస్తుంది.
అందులో మీరు రూమ్ బుక్ చేయాలనుకుంటున్న హోటల్ బుక్ చేయాలి.
లాగిన్ చేసి పేమెంట్ పూర్తి చేస్తే బుకింగ్ కన్ఫామ్ అవుతుంది.
IRCTC Tirupati Tour: తిరుపతి నుంచి లోకల్ టూర్ ప్రకటించిన ఐఆర్సీటీసీ టూరిజం
సింగిల్, డబుల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. 20 మంది గెస్ట్‌ల వరకు కూడా గ్రూప్ బుకింగ్ చేయొచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు చెకిన్, చెకౌట్ పాలసీ ఉంటుంది. హోటల్ బుక్ చేసే సమయంలో డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉంటాయి. మీకు హోటల్ గది అవసరం లేదనుకుంటే రిటైరింగ్ రూమ్ బుక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు బుక్ చేసిన ట్రైన్ టికెట్ పీఎన్ఆర్ అవసరం ఉంటుంది. రిటైరింగ్ రూమ్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.
ముందుగా https://www.irctctourism.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
రిటైరింగ్ రూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ట్రైన్ టికెట్ పీఎన్ఆర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత స్టేషన్ సెలెక్ట్ చేయాలి.
చెకిన్, చెకౌట్ తేదీలు, రూమ్ టైప్, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
స్లాట్ డ్యూరేషన్ సెలెక్ట్ చేసి రిటైరింగ్ రూమ్ బుక్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC, IRCTC Tourism, Tourism, Travel