హోమ్ /వార్తలు /బిజినెస్ /

Train Tickets: ఈ ట్రిక్‌తో బుక్ చేస్తే ట్రైన్ టికెట్స్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ

Train Tickets: ఈ ట్రిక్‌తో బుక్ చేస్తే ట్రైన్ టికెట్స్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ

Train Tickets: ఈ ట్రిక్‌తో బుక్ చేస్తే ట్రైన్ టికెట్స్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ
(ప్రతీకాత్మక చిత్రం)

Train Tickets: ఈ ట్రిక్‌తో బుక్ చేస్తే ట్రైన్ టికెట్స్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ (ప్రతీకాత్మక చిత్రం)

Train Tickets | రైలు టికెట్లు బుక్ చేసేప్పుడు కొన్ని టిప్స్, ట్రిక్స్ ఫాలో అయితే బెర్త్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే కొందరు ప్రయాణికులు ఈ ట్రిక్స్ ఫాలో అవుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తుంటారా? ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో రైలు టికెట్లు బుక్ (Train Ticket Booking) చేస్తుంటారా? రైలు టికెట్స్ బుక్ చేసేప్పుడు కొన్ని టెక్నిక్స్, ట్రిక్స్ ఫాలో అయితే టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. సాధారణంగా పండుగ సమయంలో, సెలవుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రైలులో ప్రయాణించేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ట్రైన్ టికెట్స్ (Train Tickets) దొరకడం కాస్త కష్టం. అయితే బుకింగ్ చేసే సమయంలో కొన్ని టెక్నిక్స్ గుర్తుపెట్టుకుంటే, కన్ఫామ్డ్ టికెట్ పొందొచ్చు. మరి మీరు కూడా ఈసారి రైలు టికెట్స్ బుక్ చేసేప్పుడు ఈ ట్రిక్స్ ఫాలో అవండి.

భారతీయ రైల్వే వేర్వేరు జోన్లు, డివిజన్లలో రైళ్లను ఆపరేట్ చేస్తుంటాయి. ఒక రైల్వే జోన్ నడిపే రైలు వేర్వేరు జోన్ల నుంచి, డివిజన్ల నుంచి వెళ్తుంటాయి. వేర్వేరు జోన్లకు కొన్ని నియమనిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. మీరు రైలు టికెట్ బుక్ చేసేప్పుడు బెర్తులు ఖాళీగా ఉంటే మీరు వెళ్లాల్సిన చోటు నుంచి టికెట్ బుక్ చేయొచ్చు. వెంటనే బెర్త్ కన్ఫామ్ అవుతుంది.

New Rules: ఫిబ్రవరిలో కొత్త రూల్స్... ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఒకవేళ బెర్త్ ఖాళీగా లేనప్పుడు ఓ చిన్న ట్రిక్ ఫాలో కావాలి. మీరు వెళ్లాల్సిన స్టేషన్ నుంచి కాకుండా, రైలు బయల్దేరే స్టేషన్ నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేయాలి. బోర్డింగ్ స్టేషన్ మాత్రం మీరు రైలు ఎక్కాల్సిన స్టేషన్‌ను ఎంచుకోవాలి. కాస్త ఛార్జీ ఎక్కువ చెల్లించాల్సి రావొచ్చు కానీ, టికెట్ ఈజీగా కన్ఫామ్ అవుతుంది. ఇదెలా పనిచేస్తుందో ఓ ఉదాహరణ ద్వారా తెలుసుకోండి.

ఉదాహరణకు ఓ వ్యక్తి మహబూబ్‌నగర్ నుంచి తిరుపతికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లాలి. మహబూబ్‌నగర్ నుంచి తిరుపతికి టికెట్ బుక్ చేయాలని చూస్తే బెర్తులు ఖాళీగా లేకపోతే, అప్పుడు కాచిగూడ నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేయొచ్చు. బోర్డింగ్ స్టేషన్ మహబూబ్‌నగర్ ఉంటుంది. టికెట్ ఛార్జీలు కాచిగూడ నుంచి తిరుపతికి చెల్లించాల్సి ఉంటుంది.

LIC Policy: రోజూ రూ.40 పొదుపు... రూ.25 లక్షల రిటర్న్స్... ఈ ఎల్ఐసీ పాలసీతో సాధ్యం

ఇలా మధ్య స్టేషన్‌లో రైలు ఎక్కాలనుకుంటే, అక్కడి నుంచి అందుబాటులో ఉండే టికెట్లు తక్కువ. అదే రైలు బయల్దేరే మొదటి స్టేషన్ నుంచి అయితే రైలు టికెట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మొదటి స్టేషన్ నుంచి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే బెర్త్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

భారతీయ రైల్వే నడిపే ప్రతీ రైలులో ప్రధాన స్టేషన్లకు టికెట్ల కోటా ఉంటుంది. అయితే రైలు బయల్దేరే స్టేషన్‌కు ఎక్కువ టికెట్స్ కేటాయిస్తారు. ఎక్కువ టికెట్స్ కేటాయించిన స్టేషన్ నుంచి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి స్టేషన్ నుంచి టికెట్లు బుక్ చేసేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. కానీ కోటాలో ఎక్కువ బెర్తులు ఉంటాయి కాబట్టి మీరు కన్ఫామ్డ్ టికెట్ ఈజీగా బుక్ చేయొచ్చు.

First published:

Tags: Indian Railways, IRCTC, Railways, Train tickets