SBI Credit Card: SBI క్రెడిట్ కార్డు బ్లాక్ చేయాలనుకుంటున్నారా ? ఇలా చేస్తే సరిపోతుంది

SBI Credit Card: క్రెడిట్ కార్డు పోగొట్టుకోవడం, కోల్పోయినపుడు బ్లాక్ చేయడమెలాగో వినియోగదారులకు అనుమతిస్తుంది. హెల్ప్ లైన్ నెంబరుకు లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా కార్డును బ్లాక్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: November 6, 2020, 10:04 PM IST
SBI Credit Card: SBI క్రెడిట్ కార్డు బ్లాక్ చేయాలనుకుంటున్నారా ? ఇలా చేస్తే సరిపోతుంది
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్బీఐ.. దేశంలోనే అతిపెద్ద రుణదాతగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా వినియోగదారుల కోసం క్రెడిట్ కార్డులను జారీ చేస్తూ సేవలనందిస్తుంది. ఈ సమయంలో క్రెడిట్ కార్డు పోగొట్టుకోవడం, కోల్పోయినపుడు బ్లాక్ చేయడమెలాగో వినియోగదారులకు అనుమతిస్తుంది. హెల్ప్ లైన్ నెంబరుకు లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా కార్డును బ్లాక్ చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఎస్బీఐ కార్డు వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా కూడా బ్లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

ఫోన్ చేయడం ద్వారా..

వినియోగదారులు హెల్ప్ లైన్ నెంబరు 39 02 02 02 (లోకల్ ఎస్టీటీ కలిపిన తర్వాత) కాల్ చేసి బ్లాక్ చేయవచ్చు. అంతేకాకుండా 1860 180 1290 ఫోన్ చేయడం ద్వారా కూడా క్రెడిట్ కార్డును బ్లాక్ చేసుకోవచ్చు.

ఎస్ఎంఎస్ ద్వారా..
ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా కూడా క్రెడిట్ కార్డును బ్లాక్ చేసుకోవచ్చు. 5676791 నెంబరుకు "BLOCK XXXX"(క్రెడిట్ కార్డుపై చివరి నాలుగు సంఖ్యలను) రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా మెసేజ్ చేసి కార్డును బ్లాక్ చేసుకోవచ్చు.

ఎస్బీఐ వెబ్ సైట్ లో క్రెడిట్ కార్డును బ్లాక్ చేయవచ్చు..
స్టెప్-1: ముందుగా sbicard.com అనే వెబ్ సైట్ కు వెళ్లి లాగిన్ అవ్వాలి.

స్టెప్-2: అనంతరం రిక్వెస్ట్ ట్యాబ్ కు వెళ్లి 'రిపోర్ట్ లాస్ట్ లేదా స్టోలెన్ కార్డు' అనే ఆప్షన్ ను సెలక్టు చేసుకోవాలి.
స్టెప్-3: అనంతరం పోగోట్టుకున్న కార్డు కోసం రిపోర్టు చేయడం వల్ల కార్డు నెంబరును క్లిక్ చేయాలి
స్టెప్-4: కార్డు మళ్లీ పొందాలనుకుంటే రీ ఇష్యూ కార్డు అనే దానిపై సెలక్టు చేసుకోవాలి. అనంతరం సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. దీంతో క్రెడిట్ కార్డు బ్లాక్ చేసుకోవచ్చు.

కార్డు పోగొట్టుకున్న లేదా దొంగిలించిన కార్డును మొబైల్ యాప్ ద్వారా బ్లాక్ చేయడం..
స్టెప్-1: ముందుగా ఎస్బీఐ యాప్ లో అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాలి
స్టెప్-2: సర్వీస్ రిక్వెస్ట్ పై క్లిక్ చేయాలి. అనంతరం రిపోర్టు లాస్ట్/స్టోలెన్ పై ట్యాప్ చేయాలి.
స్టెప్-3: అనంతర కార్డు నెంబరు క్లిక్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. దీంతో క్రెడిట్ కార్డు ఆటోమేటిక్ గా బ్లాక్ అవుతుంది.
ఎస్‌బీఐ ప్లాట్ ఫామ్స్‌లో బ్లాక్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కార్డు బ్లాక్ అయినట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ అడ్రస్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
Published by: Kishore Akkaladevi
First published: November 6, 2020, 10:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading